Friday, July 30, 2021

ఆల్ఫా, డెల్టా వేరియంట్ల‌పై కోవాగ్జిన్ మెరుగ్గా ప‌నిచేస్తోంది… ప‌రిశోధ‌కులు వెల్లడి

Must Read

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్ప‌టికే అనేక టీకాలు అందుబాటులోకి వ‌చ్చాయి. కొత్త వ్యాక్సిన్ల కోసం ప్ర‌యోగాలు జ‌రుగుతూనే ఉన్నాయి. క‌రోనా మ‌హమ్మారిలో అనేక కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి.

కోవిడ్ వైర‌స్‌లో త‌ర‌చుగా ఉత్ప‌రివ‌ర్త‌నాలు జ‌ర‌గుతుండ‌టంతో వ్యాక్సిన్లు వాటిపై ఎంత వ‌ర‌కు ప‌నిచేస్తున్నాయి అనే దానిపై నిత్యం పరిశోధ‌కులు ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. భార‌త్‌లో త‌యారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ప‌నితీరుపై అమెరికా నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్ల‌పై కోవాగ్జిన్ స‌మ‌ర్ధ‌వంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. అయితే, కోవాగ్జిన్ ప‌నితీరు బాగుంద‌ని రిపోర్టులు వ‌స్తున్నా, యూర‌ప్ దేశాల్లో దీనిని వ్యాక్సిన్‌గా గుర్తించ‌క‌పోవ‌డంతో అయోమ‌యం నెల‌కొన్న‌ది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This