Friday, July 30, 2021

తెలంగాణలో బ్లాక్ ఫంగస్ తో వైద్యుడు మృతి…

Must Read

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీపతి రవి (50) గత కొంతకాలంగా మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో ఆర్ఎంపీ వైద్యునిగా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం కరోనా మహమ్మారి సోకడంతో దానికి చికిత్స పొందుతున్నాడు.

పది రోజుల క్రితం బ్లాక్ ఫంగస్ సోకడంతో హైదరాబాదులోని ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య కుమార్తె,కుమారుడు ఉన్నారు. ప్రజలకు వైద్యం చేసే వ్యక్తి మృతిచెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This