Saturday, June 19, 2021

సాయంత్రం 7 తర్వాత మనం అస్సలు చెయ్యకూడని పనులు

Must Read

సాయంత్రం వేళ అనేది మన పనికి ముగింపు చెప్పి కొద్దిగా రిలాక్స్ అయ్యే సమయం. అందుకే మనం ఆ టైం లో కనుక కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా కాపాడుకోవచ్చు

సాయంత్రం పూట అస్సలు చెయ్యకూడని పనులు
తిన్న వెంటనే:
మనం రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోతే మనకి చాలా అనారోగ్యాలు వస్తాయ్. ఉదాహరణకు తిన్న అన్నం జీర్ణం కాకపోవడం, సరైన నిద్ర పట్టకపోవడం అధిక బరువు పెరగడం,ఇలాగా చాలా అనారోగ్యం పాలు అవుతాము.

ఇది అస్సలు చెయ్యకూడదు:
సాయంత్రం 7 దాటాక వ్యాయామం అస్సలు చెయ్యకండి, ఎందుకంటే ఇది గుండె వేగాన్ని బాగా పెంచుతుంది. అలాగే ఉత్సాహ పరిచే హార్మోన్లను పెంచుతుంది. దీని వల్ల నిద్రకు భంగం అవుతుంది,ఒక వేళ చెయ్యాలన్న కూడా 8 గంటల లోపు చెయ్యాలి.

ఎక్కువగా నూనె పదార్ధాలు:
బాగా నూనెలో వేయించిన ఆహారం రాత్రి అస్సలు తినకూడదు, అలా తినడం వల్ల కాలేయం మిద అధిక భారం పడుతుంది. అంతే కాకుండా అధిక దాహం వల్ల ఆరోగ్యం పోతుంది.

మొలకలు ఎత్తిన విత్తనాలు:
ఇవి రాత్రి పూట తినడం అంత శ్రేయస్కరం కాదు, ఎందుకంటే మనం మళ్ళీ పొద్దున్న వరకు ఖాలీ కడుపుతో ఉంటాము. దీనిలోని యాసిడ్ పెంచే కారణం చేత రాత్రి కాకుండా పగలు తింటే మంచి ఫలితాన్ని ఇస్తుంది

బాగా చల్లగా ఉన్న నీటిని:
అస్సలు రాత్రి పూట త్రాగాకూడదు దీని వల్ల జలుబు దగ్గు ఎలేర్జిలే కాకుండా వయసు పెరుగుతున్న వారిలో గుండె పోటు కూడా వస్తుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This