Saturday, June 19, 2021

వేడినీళ్లతో తలస్నానం చేస్తున్నారా.. వెంటనే ఇది చూడండి!

Must Read

ప్రస్తుతం ఉన్న కాలుష్యవాతావరణంలో, నిత్యజీవిత పయనంలో ఆనందంగా మనసుకు రిలాక్స్ ని శరీరానికి ఆరోగ్యన్నిచ్చేది స్నానమే. అయితే తలస్నానంలో చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తలస్నానానికి వేడినీళ్ల ఎక్కువగా వాడుతుంటారు. ఇది తప్పు, ఎందుకంటే వేన్నీళ్లతో తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు వేగంగా డ్రై అవుతాయి. వేడి నీళ్లకు బదులు గోరువెచ్చటి నీళ్లతో చేస్తే మంచిది. దీని వల్ల షాంపు, కండిషనర్లు కూడా వెంట్రుకలపై బాగా పనిచేస్తాయి. షాంపుతో తలస్నానం చేసేముందు వెంట్రుకలను నీళ్లతో బాగా కడుక్కోవాలి. షాంపును తలకు రాసుకోబోయే ముందు కనీసం ఒకటి రెండు నిమిషాల పాటు జట్టును షవర్‌ కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బాగా తడుస్తాయి. దీంతో షాంపు, కండిషనర్లు జుట్టుపై బాగా పనిచేస్తాయి.తలస్నానం వేగంగా చేసేయొద్దు.

షాంపు, కండిషనర్లు శుభ్రంగా పోయేదాకా చేయాలి. చాలామంది తలకు షాంపును ఎక్కువ రాసుకుంటారు. ఇది ఇంకో తప్పు. ఎక్కువ షాంపు వెంట్రుకలపై అప్లై చేస్తేనేగాని వెంట్రుకలపై షాంపు సరిగా పనిచేయదనే దురభిప్రాయం చాలామందిలో ఉంది. కాని ఇది కరెక్ట్‌ కాదు.. ఎక్కువ షాంపు తలపై రాయడం వల్ల నురగ బాగా వస్తుంది తప్ప ప్రయోజనం ఉండదు.

మరొక ముఖ్య విషయం.. చాలామంది కూడా ఉపవాసాలున్నపుడో గుడికి వెళ్తపన్నపుడో లేదా రెండు మూడు రోజులకొకసారి తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. అంతేకాక చాలా మంది ఉదయం పూట తలస్నానం చేస్తుంటారు. కాని అందమైన ఆరోగ్యవంతమైన జుట్టు కోసం సాయంత్రం చేసే తలస్నానమే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఉదయంపూట ఇంటి పనులు ఒకవైపు, ఉద్యోగానికో ఆఫీస్ కో బయలుదేరే హడావుడి మరొకవైపు ఇలాంటి సమయంలో తలస్నానంచేయడానికి కేటాయించే సమయం చాలా తక్కువై వేగంగా స్నానది కార్యక్రమాలు ముగించేస్తాం. ఉదయం తలస్నానం వలన జుట్టు త్వరగా ఆరకపోవడంతో అదే తడి జుట్టుతో బయటికి వెళ్లడం వలన జుట్టుపై దుమ్ము ధూళి తదితర కాలుష్యాలు చేరి జుట్టు పాడయ్యే అవకాషం ఎక్కువ.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This