హీరో తేజ సజ్జ షాకింగ్ రెమ్యూనరేషన్…అప్పుడే అంత అడుగుతున్నాడా?

యువ హీరో తేజ సజ్జ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ప్రవేశించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోల జాబితాలో చేరిపోయాడు. తేజ సజ్జ తన తరువాత సూపర్ హీరో మూవీ కోసం ఏకంగా కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంటున్నట్టు సమాచారం.

తేజకు ఇప్పుడు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఇటీవలే “హనుమాన్” ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి ఇండియన్ సూపర్ మూవీలో హీరోగా తేజ సజ్జను ప్రకటిస్తూ ఇటీవలే సినిమాను ప్రారంభించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. భారీ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం రూపొందనుంది. తేజ సజ్జ సినిమా సాటిలైట్, డిజిటల్ రైట్స్ కు డిమాండ్ ఉంది. ఇటీవలే వచ్చిన “జాంబీ రెడ్డి”తో అందరిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో రెమ్యూనరేషన్ విషయం చర్చనీయాంశంగా మారింది. తేజ తాను నటించిన “ఇష్క్” మూవీ విడుదల గురించి ఎదురు చూస్తున్నాడు ఈ యంగ్ హీరో.