Tuesday, July 27, 2021

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులు స్వీకరణ: ఏపీ ప్రభుత్వం

Must Read

ఉపాధ్యాయుల ఎప్పుడునుంచో ఎదురుచూస్తున్నా అంతర్ జిల్లా బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. భార్యాభర్తలు, పరస్పర బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే ఈ నెల 30వ తేదీకి రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నవారు బదిలీలకు అర్హులని పేర్కొంది. అనధికారికంగా విధులకు గైర్హాజరులో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు బదిలీకి అనర్హులని ప్రకటించింది. అలాగే గతంలో చేసుకున్న దరఖాస్తులు చెల్లవని స్పష్టం చేసింది.

మరోవైపు సెక్రటేరియట్‌లో పని చేసే జీవిత భాగస్వామి ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు బదిలీ చేస్తారని తెలిపింది. అలాగే బదిలీ కోరుకునే జిల్లాలోని ఎయిడెడ్‌, లోకల్‌ బాడీ, రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీల్లో వారి జీవిత భాగస్వామి(స్పౌజ్‌) పనిచేస్తూ ఉండాలని పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక్కసారి మాత్రమే దరఖాస్తుకు అనుమతి ఇస్తామని.. అర్హత కలిగిన ఉపాధ్యాయులు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

బదిలీల షెడ్యూల్‌ ఇలా ఉంది…
జూన్‌ 30 నుంచి జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవాలని.. ఆ తర్వాత దాన్ని ప్రింట్ తీసి ఎంఈఓ లేదా డిప్యూటీ ఈఓకి అందజేయాలి.
జూలై 7 నుంచి 11 వరకు: దరఖాస్తుల పరిశీలన, డీఈఓకి సమర్పణ.
జూలై 12 నుంచి 17 వరకు: జిల్లా విద్యాధికారి దరఖాస్తుల పరిశీలన, ఈ నెల 19న పాఠశాల విద్యా కమిషనర్‌కు సమర్పణ.
జూలై 20 నుంచి 26 వరకు: తుది జాబితాను రూపొందిస్తారు.
జూలై 29: ప్రభుత్వానికి దరఖాస్తుల సమర్పణ, అనంతరం ఉత్తర్వులు జారీ

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This