అదిరింది షో నుంచి సమీరా ఔట్.. యాంకర్స్ గా కొత్త జోడి..

255

తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కామెడీ షో జబర్దస్త్. ఈ షో ఎంత పాపులర్ అయిందంటే గురువారం, శుక్రవారం వచ్చిందంటే పిల్లల దగ్గరనుంచి, పెద్దల వరకు జబర్దస్త్ కి అతుక్కుపోతున్నారు. అంతగా పాపులర్ అయింది. జబర్దస్త్ లో ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న నాగబాబు గారు ఆ షో నుంచి బయటకు వచ్చి తర్వాత జీ తెలుగులో అదిరింది పోగ్రామ్ కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్ కు పోటీగా కామెడీ షో వస్తున్న అదిరింది షో ప్రతి ఆదివారం ప్రసారమవుతోంది. ఈ షోలో చమ్మక్ చంద్ర, వేణు, ధన్‍రాజ్, ఆర్పీ వంటివారు కామెడీని పంచుతున్నారు. ఈ షోలో పలు సీరియల్స్ లో తనకంటూ నటనలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమీరాను యాంకర్ గా తీసుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి మిశ్రమ స్పందన లభిస్తుండగా.. హైప్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇప్పటికే 10 వారాలను కంప్లీట్ చేసిన ‘అదిరింది’ ఎపిసోడ్ రేటింగ్స్ అనుకున్న స్థాయిలో రాకపోగా, జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ కంటే తక్కువ రేటింగ్ వస్తుండటంతో కార్యక్రమాన్ని చక్కబెట్టే పనిలో పడ్డారు. కాన్సెప్ట్, టైటిల్, కమెడియన్స్, జడ్జి ఇలా అన్నిట్లో, సేమ్ ‘జబర్దస్త్’ లాగే ఉండడంతో ఈ కార్యక్రమంలో కొత్తదనం లోపించిందనే విమర్శలు వినిపించాయి. అందులో టీం లీడర్లుగా ఉన్న చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్, కిర్రాక్ ఆర్పీలతో పాటు.. ఈ షో డైరెక్టర్లు నితిన్, భరత్‌లు కూడా జబర్దస్త్ నుండే ఎగుమతి కావడంతో అదే పాత కామెడీని ఈ షోలోనూ చూపిస్తుండటంతో ప్రేక్షకుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అయితే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టుగా ‘అదిరింది’ షోకి యాంకర్‌ గా ఉన్న సమీరా కూడా రష్మి, అనసూయ స్థాయిల్లో మెప్పించలేకపోవడం వల్ల ఆమెను తప్పించారు. తొలి ఎపిసోడ్‌లో సమీర గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని చెప్పకనే చెప్పింది. అయితే హావభావాల విషయంలో ఓన్‌ ఐడెంటిటీ ఏర్పరచుకోవడానికి 10 వారాలకు పైగా టైం తీసుకున్న ఈ భామ ఈ ప్లాస్టిక్ నవ్వులు నా వల్ల కాదనుకుందో ఏమో కాని ‘అదిరింది’ షోకు గుడ్ బై చెప్పేసింది.

తాజాగా వచ్చే వారానికి సంబంధించి ‘అదిరింది’ ప్రోమో విడుదల చేయగా, అందులో సమీరా ప్లేస్‌ ను ఇద్దరు కొత్త యాంకర్లతో భర్తీ చేస్తున్నారు. ఒకరు యాంకర్ రవి కాగా, మరొకరు బిగ్ బాస్ భాను శ్రీ. బిగ్ బాస్ సీజన్ 2 రియాలిటీ షోతో క్రేజ్ దక్కించుకున్న భాను శ్రీ, అడపాదడపా అడల్ట్ కామెడీ చిత్రాల్లో కనిపిస్తూ వస్తోంది. తన గ్లామర్‌ కు తగ్గ ప్లాట్ ఫామ్ దొరకాలే కాని ఇరగదీసేస్తా అని పలు సందర్భాలలో తన హాట్ సొగసులతో అలరిస్తుండగా, ఎట్టకేలకు ‘అదిరింది’ స్టేజ్ దొరికేసింది భానుశ్రీ కి. జబర్దస్త్, పటాస్, ఢీ, అదిరింది వంటి ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాల్లో ప్రాసకోసం పాకులాడుతూ కొన్ని సందర్భాలలో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే కంప్లైంట్ ఉండనే ఉంది. కాగా హాసాన్ని అపహాస్యం చేయడంతో పాటు వల్గర్ పంచ్‌ లు వేసే యాంకర్ రవి ‘అదిరింది’ షోకి కొత్త యాంకర్‌ గా రావడంతో కామెడీ బాగానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. అందులోనూ జడ్జిగా నవదీప్ లాంటి ఏ సర్టిఫికేట్ హీరో ఉండనే ఉన్నాడు. ఇతనికి తోడు వేణు, ధనరాజ్, చమ్మక్ చంద్ర లాంటి టీం లీడర్లు యాంకర్ రవికి ఏ మాత్రం తీసిపోకుండా నాన్ స్టాప్ వర్గారిటీ పండించేందుకు రెడీ అయ్యారనడానికి తాజా ప్రోమోను శాంపిల్‌ గా చూపించొచ్చు. చూడాలి మరి వీరందరూ కలిసి అదిరింది షోను ఎక్కడికి తీసుకెళ్తారో.

Content above bottom navigation