అబ్బ అబ్బ అబ్బ.. సమంతను ఫ్యాన్ ఏం చేశాడో చూడండి…

136

పాపం సినిమా సెలబ్రిటీస్ కి జనాల్లోకి వెళ్ళాలంటే ఎన్ని ఇబ్బందులు పడతారో మనకు తెలుసు. హీరో హీరోయిన్స్ జనాలలోకి వస్తున్నారంటే వందల్లో జనాలు ఎగబడతారు. ఎంతమంది బౌన్సర్స్ ఉన్నా వాళ్ళకి వందరెట్లు జనాలుంటారు కాబట్టి అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. మన సినిమా స్టార్స్ పబ్లిక్ ఫంక్షన్ కి హాజరైన ప్రతీసారి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. సాధారణంగా మన సెలబ్రిటిస్ పబ్లిక్ ఫంక్షన్స్ అంటే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, లేదా ఇతర పెద్ద ఫంక్షన్స్ కి, ఆలయాల సందర్శనకి వెళ్ళినప్పుడు ఇలాంటివి అనుభవిస్తుంటారు. పబ్లిక్ ఫంక్షన్స్ కి పలానా సినీ తార వస్తుందంటే కొన్ని గంటల ముందు నుంచే ఆకతాయిలు కాపు కాసి సిద్దంగా ఉంటారు. అభిమానం అన్న పేరుతో వచ్చి రాగానే మీద మీద పడటానికి ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని నొక్కేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని భావించి, షేక్ హ్యాండ్ పేరుతో చేతులేసి ప్రేవేట్ భాగాలను టచ్ చేసి సరదా తీరిందనుకుంటారు.

అలా సమంత కూడా కొన్ని సార్లు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంది. ఒక కొత్త షోరూం ఓపెన్ చేసేందుకు మధురై వెళ్లిన సమంతకు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. సమంత కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆమె వచ్చినప్పుడు చూడాలి, మాట్లాడాలని ఒకేసారి మీద పడబోయారు. సెక్యురిటీ వల్ల సమంత షాప్ లోకి ఎలాగోలా వెళ్లింది. అయితే రిటర్న్ లో మాత్రం సమంత ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఆపలేకపోయింది. కనీసం ఆమెను కార్ కూడా ఎక్కనివ్వకుండా కొందరు ఆకతాయిలు ఆమె మీద పడ్డారు. జనాల మధ్యన ఒకడు తన ప్రవేట్ భాగానీ పట్టుకున్నాడు. అది అర్థమైన సమంత వెంటనే అతని చేయి పక్కకి జరిపేసింది. వెంటనే బౌన్సర్లు ఆ వ్యక్తిని దూరంగా నెట్టేశారు.

Image result for samantha with public

ఇలా సమంత ఒక్కదానికే జరగలేదు. ఇంతకముందు కొందరు హీరోయిన్స్ కు కూడా ఇలాగె జరిగింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కు వచ్చిన కొందరు హీరోయిన్స్ తో కూడా కొందరు ఆకాతాయిలు ఇలాగె చేస్తే, వెంటనే చెంప చెళ్ళు మనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ ఫంక్షన్ నిర్వహించిన నిర్వాహకులకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్న హీరోయిన్స్ లలో సమంత, ఆసిన్, నయనతార, శ్రద్దా దాస్, కీర్తి సురేష్, హన్సిక, ఛార్మి….ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. అయితే మన హీరోయిన్స్ ఇలా పబ్లిక్ ఫంక్షన్స్ తో వచ్చే ఆదాయంతో అనాధలకి సహాయం చేస్తున్నారు. ఆ డబ్బు ని ట్రస్ట్ లకి డొనేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సమంత కొంతమంది పిల్లలని చేరదీసి వాళ్ళకి కావలసినవన్ని చూసుకుంటోంది. అంత మంచి పనికోసం వచ్చే వాళ్ళను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంత వరకు కరెక్టో ఆ ఆకతాయిలు అర్థం చేసుకోవాలి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation