ఆదికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మల్లెమాల.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆది

169

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏడేళ్లుగా జబర్ధస్త్ కు పోటీగా ఎన్నో ప్రోగ్రామ్స్ వచ్చాయి.. కానీ ఏది కూడా సక్సెస్ సాధించలేక పోయాయి. జబర్ధస్త్ లో పాపులర్ అయిన నటులు వేణు, తాగుబోతు రమేష్, దన్ రాజ్, షకలక శంకర్, చమ్మక్ చంద్ర వీరే కాదు మరికొంత మంది వెండి తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరుసగా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. షకలక శంకర్, సుధీర్ లు హీరోలుగా నటించారు. జబర్ధస్త్ తో మంచి హిట్ సాధించిన వారు ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఇలా జబర్ధస్త్ పుణ్యమా అని మంచి సెటిల్ మెంట్ అయిన వారు ఇప్పుడు ఇతర ఛానల్స్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు.

ఇక యాంకర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అనసూయ, రేష్మిలు ఫేమస్ అయ్యిందే జబర్దస్ట్ వల్ల. వీళ్ళకు సిల్వర్ స్క్రీన్ మీద కూడా భారీ డిమాండ్ ఉంది. వెండితెర మీద ఛాన్సులు దక్కించుకుంటూ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సుడిగాలి సుధీర్, ఆది, శ్రీను, ఆటో రాం ప్రసాద్‌, అప్పారావు, అవినాష్‌ లాంటి పలువురు కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు.

Image result for hyper adi

ఇక ముఖ్య విషయానికి వస్తే… జబర్ధస్త్ లో హైపర్ ఆది స్కిట్ అంటే ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. ఆది వేసే పంచులు కడుపుబ్బా నవ్విస్తున్నారు. హైపర్ ఆది,రైజింగ్ రాజుతో పాటు దొరబాబు, పరదేశిలు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు వీళ్ళ టీమ్ దిక్కుతోచని స్థితిలో ఉంది. దానికి కారణం మొన్న వైజాగ్ లో దొరబాబు, పరదేశిలు వ్యభిచారం చేస్తుండగా అడ్డంగా బుక్ అవ్వడం. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

Image result for hyper adhi dorababu

సెలబ్రెటీ హోదాలో ఉండి ఇంత నీచమైన పనులు చేయడంతో అందరూ ఛీ కొడుతున్నారు. ఇప్పుడు దొరబాబు చేసిన పనికి, మిగిలిన కమెడియన్లందరికీ మల్లెమాల ప్రొడక్షన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి పిచ్చి కథలు పడితే జబర్దస్త్ నుంచి తొలగిస్తామని, హైకమాండ్‌ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అలాగే ఆదికి కూడా చిన్న వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. టీమ్ లో ఉండే కాంటిస్తేంట్స్ గురించి కొంచెం ఆలోచించమని, ఇన్ని రోజులు వాళ్ళ క్యారెక్టర్స్ మీద పంచులు వేశావు. ఇప్పుడు వాళ్ళిద్దరిని టీమ్ లో కంటిన్యు చేస్తావా.లేదా వేరే వాళ్ళను తీసుకుంటావా అని ఆదిని అడిగారంట. దాంతో ఆది వాళ్ళిద్దరిని తీసేసి వేరే వాళ్ళను తీసుకోవాలని నిర్నయించుకున్నాడంట. జబర్దస్త్‌లోకి రాక ముందు యూ ట్యూబ్‌లో ‘బిగ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్’ కూడా చేశాడు. ఆది స్కిట్ లో కూడా ఇదే విషయం మీద పంచులు వేస్తాడు. దాంతో చాలా తక్కువ కాలంలోనే దొరబాబుకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఆది టీమ్ లో నుంచి తీసేయ్యడంతో దొరబాబు కెరీర్ డైలమాలో పడిపోయింది.

Content above bottom navigation