ఈ 7 మంది టాలీవుడ్ స్టార్ల “ఫస్ట్ క్రష్” ఎవరో తెలిస్తే షాక్.

52

మనకు సినిమా హీరోలు, హీరోయిన్స్ అంటే ఒక రకమైన క్రష్ ఉంటుంది. వారిని తెరపై చూడగానే ఆటోమేటిక్ గా వారిపై ఇష్టం పెరుగుతుంది. అయితే సాధారణ జనానికే క్రష్ లు ఉంటాయా.. సెలెబ్రెటీలకు ఉండవా అంటే ఎందుకు ఉండవు. వాళ్ళు కూడా మనుషుకే కాబట్టి వారికీ కూడా ఎవరినో ఒకరిని చుస్తే క్రష్ పుడుతుంది. వారికి ప్రేమకథలు ఉంటాయి. బ్రేకప్ లు ఉంటాయి. అలా మాన్ టాలీవుడ్ లో కొందరి సెలెబ్రిటీల క్రషెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for rejina

రెజీనా : కుర్రకారుని తన అందంతో మైమరపించే రెజీనా తన ఇంటిపక్కన ఉండే కుర్రాడితో ప్రేమలో పడిందట. కానీ పాపం ఆ అబ్బాయి రెజీనా వైపు ఒకసారి కూడా కన్నెత్తి చూడలేదట..తర్వాత ఏముంది. తన పనిలో తాను బిజీ అయిపోయింది. కానీ ఫస్ట్ క్రష్ ను మర్చిపోలేదు.
నితిన్ : పూజ ఆడియో లాంచ్ టైంలో శృతిహాసన్ పై తనకు చాలా ప్రేముందని నితిన్ బహిరంగంగా చెప్పాడు. కానీ శృతి ఆ టైమ్ లో మరొకటి ప్రేమలో ఉంది. కానీ ఆ ప్రేమ ఇప్పుడు బ్రేకప్ అయ్యింది. ఇప్పుడు శ్రుతికి ప్రపోజ్ చేద్దామన్నా కూడా కుదరదు. ఎందుకంటే నితిన్ కు పెళ్లి ఫిక్సయిపోయింది.
తమన్నా : తన స్నేహితురాలి అన్నంటే తమన్నా పడి చచ్చిపోయేదట. కానీ ఏం చేస్తాం అప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాని అతను కనీసం పట్టించుకునేవాడు కాదట. పాపం ఇప్పుడు ఫీల్ అవుతాడేమో ఈ విషయం అతనికి తెలిస్తే.

Image result for mahesh babu


మహేశ్ బాబు : టాలివుడ్ ప్రిన్స్, అమ్మాయిల కలల రాకుమారుడు నమ్రత సొంతం అయిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అమ్మాయిలు బాదపడ్డారు. అలాంటి మహేశ్ బాబుకి డెమి మూరే అంటే చాలా ఇష్టం అని, తన డైనమిక్ నేచర్ మహేశ్ కి నచ్చుతుందట.
అల్లు అర్జున్ : మన ప్రిన్స్ మహేశ్ పెళ్లిచేసుకుంటే ఎంతమంది అమ్మాయిల గుండెలు పగిలాయో కానీ ఐశ్వర్యరాయ్ పెళ్లప్పుడు అల్లుఅర్జున్ కి గుండె పగిలినంత పనైందట..అంతలా ఇష్టపడ్డాడట ఐష్ ను. ఈ విషయం తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

Image result for prabhas


ప్రభాస్ : చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివేటప్పుడు క్లాస్ టీచర్ పై క్రష్ ఉండేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మన అమ్మాయిల కలల రాకుమారుడు బాహుబలి ప్రభాస్. ఆ తర్వాత కొందరు హీరోయిన్స్ మీద కూడా క్రష్ ఏర్పడిందంట.
రానా : తన స్కూల్ డేస్ లో ఒక సీనియర్ ని ప్రేమించినట్టు రానా చెప్తూ ఉంటాడు. అప్పటికి ఆమె రానాని కానీ, రానా ప్రేమని కానీ గుర్తించలేదట. ఆ తర్వాత కొన్నాళ్లకి ఫేస్ బుక్ లో మ్యూచువల్ ఫ్రెండ్స్ లో ఆమె కనపడిందట. రానా కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెటిందంట. అలా మళ్లి పాత స్నేహం చిగురించింది.

ఇలా కొంతమంది స్టార్స్ ప్రేమలో విఫలం అయ్యారు. అయితే అవన్నీ కూడా క్రష్ లే కాని నిజమైన ప్రేమలు కాదు. అందుకే మనోళ్ళు అంత మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation