ఉదయభాను రియల్ స్టోరీ..

154

యాంకర్ ఉదయభాను గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తన వాక్ చాతుర్యం, చురుకుదనంతో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ…సినిమాల్లోనూ తన మార్కను చాటుకుంది. ఇటీవల వచ్చిన పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేస్తూ, హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ దర్శనం ఇచ్చింది. తర్వాత పెళ్లి చేసుకుని కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ప్రస్తుతం పలు సినిమా ఫంక్షన్స్ లలో కనిపిస్తూ మళ్ళి తన సత్తా చూపించాలని ట్రై చేస్తుంది. ఇక ఉదయభాను గురించి చెప్పాలంటే తానూ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడింది.పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషన్ లైఫ్ లో ఆమె ఎన్నో కష్టాలు అనుభవించింది. ఒక్కసారి ఆమె లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బాల్యం, చదువు…
ఉదయభాను కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ లో 5 ఆగస్టు 1978 లో జన్మించింది. ఆమె తండ్రి sk పటేల్ డాక్టర్, తల్లి అరుణ ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఉదయభాను తండ్రి ఒక కవి. ఆయన కలం పేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఇక ఉదయభానుకు 15 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తితో పెళ్లయింది. కానీ ఆ పెళ్లి ఉదయభానుకు ఇష్టం లేకపోవడంతో కొన్ని రోజులకే అతని నుంచి విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత విజయ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి ఉదయభాను తల్లికి ఇష్టం లేదు. అయినా తల్లిని ఎదిరించి పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కవల ఆడపిల్లలు జన్మించారు. వాళ్ళ పేర్లు యువి నక్షత్ర, భూమి ఆరాధ్య. ఇక ఉదయబాబు MA లిటరేచర్ కంప్లీట్ చేసింది.

కెరీర్..
ఉదయభానుకు చిన్నప్పటినుంచే సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువ. అందుకే సినిమా రంగంవైపు వచ్చి ప్రయత్నించింది. పదవ తరగతి చదువుతున్నప్పుడు ఎర్ర సైన్యం సినిమా ఛాన్స్ వచ్చింది. అందులో ఒక చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి మళ్ళి చదువు మీద కాన్సంట్రేట్ చేసింది. అయితే అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంది. వాటన్నిటిని దాటుకుని మళ్ళి సినిమాల వైపు నడించింది. కానీ సినిమా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరవైపు నడిచింది. అయితే ఈటీవీ ఛానెల్ లో కొత్త యాంకర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో ట్రై చేసింది. ఆ సెలెక్షన్స్ కు ఎంతోమంది వస్తే ఉదయభాను సెలెక్ట్ అయ్యింది. ఆ పోగ్రామే హృదయాంజలి. ఆ షో కొన్ని రోజులు బాగానే నడించింది. అదే సమయంలో జెమిని టీవీ వాళ్ళు వన్స్ మోర్ ప్లీజ్ అనే అనే పోగ్రామ్ ను కండక్ట్ చేశారు. ఈ పోగ్రామ్ లో కమిడియన్ కమ్ మిమిక్రి ఆర్టిస్ట్ వేణుమాధవ్ తో కలిసి చేసింది. ఈ పోగ్రామ్ తో ఉదయభాను మంచి పేరు తెచ్చుకుంది. అప్పుడప్పుడే కలర్ టీవీ లు వస్తున్నా కాలం కాబట్టి ఈ షో టీవీ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ షో పెద్ద హిట్ అవ్వడంతో యాంకర్ గా ఉదయభాను సక్సెస్ అయ్యింది. ఈ షో తర్వాత వరుసగా సాహసం చెయ్యరా డింభకా, డాన్స్ బేబీ డాన్స్ లాంటి షోలు స్టార్ట్ అయ్యాయి. ఈ షోలాన్ని పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా డాన్స్ బేబీ డాన్స్ పోగ్రామ్ నెంబర్ 1 గా దూసుకుపోయింది. అంతేకాదు ఉదయభానును టాప్ ప్లేస్ లో ఉంచింది. ఇక ఈ పోగ్రామ్ తర్వాత ఉదయభాను వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వరుసగా యాంకర్ గా ఛాన్సులు దక్కించుకుంది. ఇక ఉదయభాను కెరీర్ లో మర్చిపోలేనిది ఈటీవీలో వచ్చిన ఢీ డాన్స్ రియాలిటీ షో. ఈ షోతో ఎంతోమంది గొప్ప గొప్ప డాన్సర్లు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్స్ గా అన్నవాళ్ళందరూ కూడా ఢీ పోగ్రామ్ నుంచి వచ్చినవాళ్లే. ఈ షోను ఏకంగా 6 సీజన్లు నడిపించింది ఉదయభాను. ఇక ఈ పోగ్రామ్ చేస్తుండగానే మిగతా ఛానెల్స్ లలో పలు షోలకు యాంకరింగ్ చేసింది. అందులో చెప్పుకోదగ్గవి, రేలారే రే రేలా, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు, ఛాంగురే బంగారు లేడి, గోల్డ్ రష్, రంగం, అంతపురం, నీతోనే డాన్స్, కళ్యాణ లక్ష్మి, గ్యాంగ్ లీడర్..ఇలా ఎన్నో షోలకు యాంకరింగ్ చేసింది.

Image result for udaya bhanu

ఇక ఉదయభాను కొన్ని సినిమాలలో కూడా నటించింది. 1994 లో మొదటిసారి ఎర్ర సైన్యం సినిమాలో నటించింది. ఆ తర్వాత 1995 లో ఎన్టీఆర్, శ్రీదేవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన వేటగాడు సినిమాలో నటించింది. ఆ తర్వాత ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం, పోలీస్ నెంబర్ 1. బస్తీమే సవాల్, శ్రావణమాసం, లీడర్, జులాయి, మధుమతి లాంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. కొన్ని తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించింది.

ఇలా సినిమాలు, యాంకర్ గా ఉదయభాను తెలుగువారి గుండెల్లో సుస్థిరస్థానాన్ని ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఎక్కువ సమయం ఫ్యామిలీకి కేటాయిస్తుంది. అలాగే మళ్ళి యాంకర్ గా రాణించాలని ట్రై చేస్తుంది. ప్రస్తుతం ఈటీవీ లో గ్యాంగ్ లీడర్ అనే పోగ్రామ్ చేస్తుంది. ఇది టిఆర్పి పరంగా పర్వాలేదనిపిస్తుంది. ఉదయభాను మరిన్ని షోలు చేసి, మళ్ళి యాంకర్ గా మనల్ని అలరించాలని కోరుకుందాం.

Content above bottom navigation