ఉప్పెన సినిమా హీరోయిన్ గురించి షాకింగ్ విషయాలు …

188

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు ఇటీవలే యూట్యూబ్ లో విడుదలై హల్చల్ చేసాయి. పాటలకంటే ఎక్కువగా పాటలో కనిపించే ఈ హీరోయిన్ కి కుర్రకారులందరు ఫిదా అవుతున్నారు. నీ కన్ను నీలి సముద్రం సాంగ్ చూడగానే . ఏం క్యూట్ ఉందిరా హీరోయిన్.. ఏం పేరు అని సెర్చ్ చేయడం మొదలెట్టేసాడు యూత్. ఆ హీరోయిన్ కు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఉప్పెన సినిమా హీరోయిన్ పేరు కృతి శెట్టి. ఆమె వయసు 15 సంవత్సరాలే. బెంగళూరుకు చెందిన కృతి శెట్టి సినిమాల్లోకి ఎలా వచ్చింది అంటే…ఆమె భరతనాట్యం నేర్చుకునే సమయంలో డైరెక్టర్ జై తీర్థ కృతిని యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చారంట. ఆ తర్వాత ప్రీతి, సదరమే అనే స్టేజి షోలతో ఒక్కసారిగా కర్ణాటకలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది కృతి శెట్టి. డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ ‘సరిగమ’ అనే సినిమాతో మొదటిసారిగా తెరంగేట్రం చేసింది. సగక్కల్ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి అజగర్ సమియిన్ కుతిరయ్, కొండాన్ కొడుతాన్, పందియా నాడు, స్నేహవిన్ కాదలర్కాల్, మాంగ, సెవిల్ సినిమాల్లో నటించి మెప్పించింది.

ఇంత పాపులర్ అయిన కృతి శెట్టి మైత్రి మూవీ మేకర్స్ కంట్లో పడింది. అప్పుడే తెలుగులో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఇంట్రోడ్యూస్ అవుతున్న “ఉప్పెన” సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈమె నవ్వు.. సొట్ట బుగ్గలతోనే ఇప్పటికే ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది. కాకినాడ పిల్లగా ఆకట్టుకుంటోంది.. ‘వావ్ ఏం ఉందిరా’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది కృతిశెట్టి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Image result for ఉప్పెన సినిమా హీరోయిన్

ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరొక భారీ ఛాన్స్ దక్కించుకుంది. ఉప్పెన‌’ నిర్మాత‌ల్లో ఒక‌రైన సుకుమార్ ఇప్పుడు క్రితి శెట్టికి మ‌రో అవకాశాన్ని ఇచ్చార‌ని టాక్ నడుస్తోంది. సుకుమార్ రైటింగ్స్‌, జీఏ 2 పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెరకెక్కనున్న ’18 పేజీస్‌’ చిత్రంలో క్రితి శెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. బ‌న్నీవాసు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాకు ప‌ల్నాటి సూర్య ప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.నవ్వుతో, సొట్టబుగ్గలతో తెలుగులో కూడా కృతి ఫుల్ ఫాలోవింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Content above bottom navigation