ఐటమ్ సాంగ్స్ తో ఎంతో పాపులర్ కానీ.. ప్రతి ఒక్కరి జీవితంలో కన్నీళ్లే..

156

ఒకప్పుడు ఏ సినిమా అయినా హిట్ అయ్యిందంటే దానికి కారణం హీరో హీరోయిన్స్ మాత్రమే కాదు అందులో ఐటమ్ సాంగ్ చేసిన వాళ్ళు కూడా కారణం. అప్పట్లో ఏదైనా సినిమా హిట్ అయిందంటే అందులో ఐటెం గర్ల్స్ పాత్ర కీలకంగా ఉండేది. అప్పట్లో ఐటెం సాంగ్స్ తో జనాన్ని మత్తెక్కించిన వాళ్లలో జయమాలిని, జ్యోతిలక్ష్మి ఆ తర్వాత అనూరాధ, సిల్క్ స్మిత, డిస్కోశాంతి, షకీలా ఇలా చాలామందే ఉన్నారు. అలాగే ఈ కాలంలో అభినయశ్రీ, ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు అయితే జనాన్ని ఉర్రూతలూగించారు. అయితే సినిమాలలో ఒక వెలుగు వెలిగిన వీళ్ళు చివరి రోజుల్లో దారుణ పరిస్థితులను అనుభవించారు. అలాంటి వారి గురించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఐటమ్ గర్ల్ గురించి చెప్పాలంటే ముందు జ్యోతిలక్ష్మి గురించే ప్రస్తావించాలి. గుడి ఎనక నా స్వామి గుర్రమెక్కి కూర్చుకున్నాడు అనే పాటతో తెలుగునాట అదరగొట్టేసింది. అయ్యవార్ల కుటుంబంలో 8 మంది సంతానంలో ఒక అమ్మాయి అయిన ఈమె చెల్లి జయమాలిని. తెలుగు, తమిళ, కన్నడ మలయాళ భాషల్లో వెయ్యికి పైనే సినిమాలో నటించిన జ్యోతిలక్ష్మి కెమెరామెన్ సాయిప్రసాద్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి జ్యోతిమీనా అనే కుమార్తె ఉంది. ఈమె కూడా కొన్ని పాటల్లో నటించింది. నాలుగు గదుల ఇరుకింట్లో గడిపిన జ్యోతిలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తే సినిమాల్లో నాకు వచ్చిందేమీ లేదు అనేది.

ఇక జయమాలిని విషయం తీసుకుంటే దాదాపు 600 చిత్రాల్లో నటించి ఫామిలీ ఫ్రెండ్ అయిన పార్తీబన్ ని లవ్ చేసి పెళ్లాడింది. చెన్నైలో సెటిల్ అయిన ఈమెకు ఓ కూతురుంది. తల్లి పలానా అని చెప్పుకోవడం తన కూతురు ఇబ్బంది పడేదని అందుకే కూతురిని సినిమాలవైపు మళ్లించలేదని జయమాలిని చెప్పేది. ఇక విజయలక్ష్మి అనే మహిళ సిల్క్ స్మితగా రూపాంతరం చెంది ఎన్నో సినిమాల్లో నటించి కోట్లు గడిచినప్పటికీ, చివరి రోజుల్లో తినడానికి తిండి కూడా లేకుండా ఆరు రోజులు పస్తులుండి మరీ ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాల్లోకి రాకముందు ఉన్న పేదరికమే చివరి దశలోనూ వెంటాడింది. ఒంటరిగా చెన్నై వచ్చి ఒంటరిగానే తనువు చాలించింది. అనురాధ విషయం తీసుకుంటే ఆమెతో పాటు ఆమె కూతురు అభినయశ్రీ కూడా ఛాన్స్ లు లేక ఇబ్బందులు పడ్డారు.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీతో ఐటెం గర్ల్ గా టాప్ రేంజ్ అందుకున్న అల్ఫానా జీవితం పేదరికం కారణంగా రెండు కేసులు, మూడు పెళ్లిళ్లు గా నడిచింది. తెలుగు తమిళ భాషల్లో నటించినా, సరిపడా డబ్బుల్లేక చావు అంచులదాకా వెళ్లివచ్చింది. ఇక షకీలా ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో, స్పెషల్ క్యారక్టర్స్ లో నటించినప్పటికీ దుర్భర జీవితం సాగిస్తోంది. అలాగే డిస్కోశాంతి హీరో శ్రీహరిని పెళ్లి చేసుకుని బాగానే సెటిల్ అయ్యింది కానీ ఆయన చనిపోయిన నానా ఇబ్బందులు పడుతుంది. ఇక ఈ కాలం ఐటమ్ గర్ల్ విషయానికి వస్తే ముమైత్ ఖాన్ గురించే మాట్లాడుకోవాలి. ముమైత్ ఖాన్ పరిస్థితి కూడా అంత మంచిగా లేదని చెప్పుకోవాలి. ఇలా ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

Content above bottom navigation