ఒకప్పుడు ఇండస్ట్రీలో సత్తా చాటిన తెలుగు టాప్ 10 యాంకర్స్ టాప్ సీక్రెట్స్

వెండితెర గొప్పదా? బుల్లితెర గొప్పదా అంటే చెప్పడం కష్టమే కానీ సిల్వర్ స్క్రీన్ మీద రాణించాలని అనుకున్న వాళ్ళకు, వెండితెర ఇచ్చిన దానికన్నా బుల్లితెర ఎక్కువ అవకాశాలు ఇచ్చింది. బుల్లితెర సెలబ్రిటీల గురించి చెప్పాలంటే ముఖ్యంగా టివి యాంకర్స్ గురించే చెప్పాలి. 1990 దశకం తర్వాత ఆడియో ఫంక్షన్స్, టివి షోస్ తో పాపులారిటీ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లలో కొందరు ఇప్పటికి ఉన్నారు. ఇంకా సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కొందరు వేగంగా సక్సెస్ అందుకుని తెరమరుగయ్యారు. అలా ఒకప్పుడు దుమ్ములేపిన యాంకర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రకు చెందిన సౌమ్య అందంతో పాటు తెలుగు, హిందీ, తదితర భాషల్లో రాణించింది. యాంకర్ గా 2008 లో కెరీర్ ప్రారంభించి, పలు ప్రోగ్రామ్స్ చేస్తూ సినిమాల్లో కూడా నటించింది. జీ తెలుగులో గంగతో రాంబాబు సీరియల్ తో ఆడియన్స్ కి దగ్గరైంది. 1985 లో ఏలూరులో పుట్టిన జాహ్నవి జెమినిలో డాన్స్ బేబీ డాన్స్ లో టైటిల్ విన్నర్ అయింది. అప్పట్లో జెమినిలో చేసే యాంకరింగ్ ప్రోగ్రాం అన్నీ హిట్ అయ్యాయి. ఇక 2004 లో యజ్ఞం మూవీలో కామెడీ పండించి ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రసూల్ ని పెళ్లాడాక బుల్లితెరకు, వెండితెరకు దూరమైంది. 1980 లో పుట్టిన అనితా చౌదరి నటిగా, యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది. ఇంటర్ చదివేటప్పుడే యాంకర్ గా వచ్చి, కౌంట్ డౌన్, పబ్లిక్ డిమాండ్ షోస్ తో మంచి పేరు తెచ్చుకుంది. కస్తూరి డైలీ సీరియల్ చేసి రికార్డ్ క్రియెట్ చేసింది. 30కి పైగా సినిమాల్లో చేసింది. పరుగు, అమ్ము, లయన్ వంటి మూవీస్ లో నటించిన రాణి చిత్రలేఖ యాంకర్ గా, సీరియల్ నటిగా, రచయితగా, టివి ప్రోగ్రామ్స్ నిర్వహణతో మంచి పేరు తెచ్చుకుంది. కలకత్తాకు చెందిన శిల్పా చక్రవర్తి తల్లిదండ్రులు రైల్వేలో ఉద్యోగ రీత్యా సికింద్రాబాద్ లో స్థిరపడడంతో తెలుగు బాగా మాట్లాడుతూ యాంకరింగ్ అదరగొట్టేది. ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసి మళ్ళి వెలిగిపోవాలని ట్రై చేసింది.

ఇలా అప్పట్లో వచ్చినవాళ్లు దాదాపుగా కనుమరుగై పోయారు. అయితే ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి రాణిస్తున్న వాళ్ళు కొందరు ఉన్నారు. పలు టీవీ షోలు, సినిమా ఫంక్షన్స్ లలో యాంకరింగ్ చెయ్యడమే కాదు, సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ విషయానికి వస్తే..

ఉదయభాను యాంకరింగ్ తో, సినీ నటిగా, టివి షోస్ తో తన సత్తా చాటింది. అందం, అభినయంతో బుల్లితెరపై యాంకరింగ్ తో ఓ ఊపు ఊపేసింది. ఝాన్సీ 1994లో టివి యాంకర్ గా పరిచయమై ఆడియన్స్ కి దగ్గరైంది. సినిమాల్లో కూడా నటించి తన సత్తా చాటింది. ఇప్పటికీ ఆడియో ఫంక్షన్స్ లో, కొన్ని టీవీ షోస్ తో తనదైన యాంకరింగ్ తో రాణిస్తోంది. ఇక యాంకర్ సుమ మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 45 ఏళ్ళ వయస్సులో కూడా అదరగొడుతోంది. తెలుగు అబ్బాయి రాజీవ్ కనకాలను పెళ్లాడింది. రెండు దశాబ్దాలుగా పలు షోస్ తో తెలుగు బుల్లితెరను ఏలుతోంది. సినిమాల్లో కూడా నటించింది. సింగర్ గా కూడా అవతారం ఎత్తి ఒక సినిమాలో పాట పాడింది. ఇక హరితేజ నటి అయ్యాక యాంకర్ గా రాణిస్తోంది. పలు టివి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుని యాంకర్ గా దుమ్మురేపుతోంది. బిగ్ బాస్ షో ఈమెకు పాపులారిటీ తీసుకొచ్చింది. ఇక దివంగత బాపు మనవరాలు గాయత్రీ భార్గవి యాంకర్ గా, మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఓ మిలట్రీ ఆఫీసర్ ని పెళ్లాడింది. అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తోంది.

ఇలా బుల్లితెర మీద తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కొందరు యాంకర్స్. వీళ్ళలో కొందరి ఇప్పటికి రాణిస్తుంది మరికొందరి కనుమరుగయ్యారు. కనుమరుగైన వారిలో కొందరు మళ్ళి రీ ఎంట్రీ ఇచ్చి తమ సత్తా ఏంటో మళ్ళి చూపించాలనుకుంటున్నారు. వాళ్లకు మళ్ళి అవకాశాలు వచ్చి మళ్ళి మనల్ని అలరించాలని కోరుకుందాం.

Content above bottom navigation