కార్తీకదీపం వంటలక్క ఫాన్స్ కి చేదు వార్త…ఆమె స్థానంలో మరో సీనియర్ నటి…

203

సినిమా హిస్టరీలో ‘బాహుబలి’.. టీవీ హిస్టరీలో ‘కార్తీకదీపం’ సీరియల్ ఈ రెండూ రెండే. వీటిని కొట్టాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. బుల్లితెర బాహుబలిగా అవతరించిన ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌తో ఆడియన్స్ ఉన్న కనెక్టివిటీ ఏ రేంజ్‌లో ఉంది అంటే.. ఈ సీరియల్ ఒక్కరోజు మిస్ అయ్యారంటే వందరోజులు బాధపడతారు. సోమవారం నుండి శనివారం వరకూ స్టార్ మాలో రాత్రి ఏడున్నర ప్రసారం అవుతున్న ఈ సీరియల్ జాతీయ స్థాయిలో నెంబర్ వన్ సీరియల్‌గా సత్తా చాటుటోంది. సినిమా హీరోయిన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇందులో దీపంగా నటించినా ప్రేమి విశ్వనాథ్ కు ఉంది. నల్లగా ఉన్నాకూడా తన నటనతో నవ్వుతో కట్టిపడేస్తుంది ప్రేమి విశ్వనాధ్.

కార్తీక దీపం సీరియల్ టీవీలో అన్ని షోస్ ని దాటేసింది. ఎంత కొత్త సినిమా వచ్చినా, ఎన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్‌ వచ్చినా కార్తీక దీపం సీరీయల్‌ చూడకుండా ఉండలేకపోతున్నారట జనం. అంతలా మెప్పించిన కార్తీక దీపం సీరీయల్‌కు వంటలక్క పాత్ర కీలకమైంది. జనం ఆమె యాక్టింగ్‌కు టీవీలకు అతుక్కుపోతున్నారు.మన ఆడియన్స్ అయితే వంటలక్కను తమ ఇంట్లో మనిషిగా భావిస్తున్నారు. ఇప్పుడు దీపక్క ఫాన్స్ షాకయ్యే న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది.. వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్థానంలో మరో నటిని తీసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది.బుల్లితెర మీద 740 ఎపిసోడ్లు దాటి జాతీయ స్థాయిలో టీఆర్పీ రేటింగుల్లో ఆదరగోట్టేస్తోంది ఈ సీరియల్.

Image result for karthikadeepam serial

ఈ సీరియల్ ప్రారంభంలో తక్కువ రెమ్యునరేషన్ కి పని చేయడానికి ఒప్పుకున్నారట ప్రేమి విశ్వనాధ్. అయితే ఇప్పుడు ‘కార్తీకదీపం’ అంచనాలకు మించి క్రేజ్ సంపాదిస్తూ టాప్ ప్లేస్ కి చేరుకుంది. దీంతో ఆమె రెమ్యూనరేషన్ ఏకంగా నాలుగు రేట్లు పెంచేసింది అంట. అంతేకాదు ఆమెకి వేరే ఆఫర్ లు కూడా బాగా రావడంతో…చేసేదేమీ లేక మరో నటిని తీసుకోవాలని ‘కార్తికదీపం’ టీం ఆలోచనలో పడిందట. మరి ఈ వార్త చూసి వంటలక్క ఫాన్స్ పరిస్థితి ఏంటో? మరో టాలీవుడ్ సీనియర్ నటిని వంటలక్క పాత్ర కోసం తీసుకోవాలనుకున్నట్లు టాక్. అభిమానులు మాత్రం ఆమె ప్లేస్ లో మరొకరిని ఊహించుకోలేము అంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Content above bottom navigation