గంగోత్రి మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

156

టాలీవుడ్ లో ఛైల్డ్ ఆర్టిస్ట్ లకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇప్పటికే ఈ విషయం చాలాసార్లు నిరూపితమైంది. చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి స్థానానికి ఎదిగారు. సినీ పరిశ్రమకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరో హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది సక్సెస్ కాలేకపోయారు. కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ తరువాత కొంత కాలానికి ఆ హీరో పక్కనే హీరోయిన్ గా స్టెప్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో ముందుగా అతిలోక సుందరి శ్రీదేవి, మీనా, నిత్యా మీనన్, అవికా గోర్ వంటి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ నుంచి హీరోయిన్ గా మారినవారే. అయితే మీరు గంగోత్రి సినిమా చూసే ఉంటారు..అందులో చిన్నప్పటి హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన పాప గుర్తుకు ఉందా? ఇప్పుడు ఆ పాప ఎక్కడ ఉందొ, ఎలా ఉందొ తెలుసా..

Image result for gangotri movie kavya

గంగోత్రి సినిమాలో చిన్నప్పటి అదితి అగర్వాల్ గా నటించిన ఆ చిన్నారి పేరు కావ్య. వల్లంగి పిట్ట సాంగ్ లో తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెలుగువారందరిని కట్టిపడేసింది. చూడగానే చాలా క్యూట్ గా, ముద్దుగా ఉండడంతో ఆ పాప క్యారెక్టర్ ను ఇప్పటికి కూడా ఎవరు మర్చిపోలేదు. ఆ సినిమా తర్వాత కావ్యకు చాలా సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి. కానీ కావ్య తర్వాత నటించడానికి ఎందుకో ఆసక్తి చూపించలేదు. ఆ సినిమా తర్వాత చదువు కోసం అని ఆమె తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో ఆఫర్స్ వచ్చినా కూడా నటించలేదు. ఆ తర్వాత చదువును కంటిన్యూ చేసింది. చదువుకుంటూనే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. ఎన్నో స్టేజ్ షోలలో క్లాసిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. రీసెంట్ గా పూణేలో బిఏ, ఎల్ఎల్‍బి పూర్తి చేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది కావ్య.

Image result for gangotri movie kavya

ఇన్ని రోజులు ఇండస్ట్రీకు దూరంగా ఉన్న కావ్య ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య ఫోటోషూట్ చేసింది. కావ్య లేటేస్ట్ ఫొటోస్‍లో చాలా అందంగా చూడముచ్చటగా కనిపిస్తోంది. రీసెంట్ గా చేయించుకున్న ఆ ఫోటో షూట్ నుంచి కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇక కావ్య మాట్లాడుతూ.. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నా. హీరోయిన్ గానే కాకుండా సిస్టర్ రోల్స్, యాక్టింగ్ కు స్కోప్ ఉన్న ఏ రోల్ అయిన సరే చేసేందుకు సిద్దం అంటుంది. కావ్యకు టాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation