గెటప్ శ్రీను ఫ్యామిలీ గురించి షాకింగ్ విషయాలు ..!

212

జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటికే జబర్దస్త్ షో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఈ షోలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ చేయడం వల్ల ఈ షోని కొట్టే షో ఇంకా రాలేదని చెప్పవచ్చు. ఇక ఎక్స్‌ట్రా జబర్దస్త్ లో ముఖ్యమైన టీం సుధీర్ టీం. సుధీర్ టీంలో రాం ప్రసాద్, గెటప్ శ్రీను ముఖ్యంగా ఉంటారు. ఇక గెటప్ శ్రీను తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం లో మంచి పేరు ఉన్న కమెడియన్ గా గెటప్ శ్రీను పేరు సంపాధించుకున్నాడు. స్కిట్స్ లో వివిధ రకాల గెటప్స్ వేసి ఆ గెటప్ అనే పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. జబర్దస్త్ లో అతను వేయ్యని గెటప్ లేదంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర కమల్ హాసన్ గా కూడా పేరు తెచ్చుకున్నారు శ్రీను. బుల్లితెర పై తన సత్తా చాటుతున్న శ్రీను ఇప్పుడిప్పుడే వెండితెర మీద కూడా కనిపిస్తాడు. అయితే గెటప్ శ్రీను ఫామిలీ గురించి చాలామందికి తెలీదు. ఇప్పుడు అతని ఫామిలీ గురించి తెలుసుకుందాం.

గెటప్ శ్రీను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట. వీళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేసుకుని జీవించేవారు. వీళ్లకు సినిమా ఇండస్ట్రీ గురించి కొంత కూడా అవగాహన లేదు. గెటప్ శ్రీనుకు ఒక అన్న ఉన్నాడు. శ్రీను అన్నయ్యకు ఇండస్ట్రీ గురించి తెలుసు. గెటప్ శ్రీను ఇండస్ట్రీలోకి వెళ్తా అంటే ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఇక ఇంటర్ అయిపోయాక ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడంతో, చదువును మధ్యలో మానేసి అప్పులు తీర్చాలనే ఉద్దేశ్యంతో ఏదైనా జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాడు. అదే సమయంలో సినిమా అవకాశాల కోసం తిరగొచ్చు అని అనుకున్నాడు. అప్పుడే అతను నాగోల్ లోని తన ఫ్రెండ్ మ్యాగీ దగ్గర ఉంటూ, చిన్న ఉద్యోగం చేస్తూ సినిమా అవకాశాల కోసం తిరిగాడు. మ్యాగీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడు. మ్యాగీ గెటప్ శ్రీనుకు చాలా హెల్ప్ చేశాడు. ఇద్దరు చాలాసార్లు తిండి కోసం కష్టపడిన సందర్భాలు ఉన్నాయి.

ఇక అదే సమయంలో సుడిగాలి సుదీర్ కు జబర్దస్త్ లో ఛాన్స్ వచ్చింది. అంతకముందే శ్రీను, సుదీర్ ఫ్రెండ్స్ కావడంతో మెల్లిగా శ్రీనును కూడా జబర్దస్త్ కు తీసుకొచ్చాడు. అదే సమయంలో సుదీర్ తన ఫ్రెండ్ అయినా సుజాతను శ్రీనుకు పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఒక కొడుకు ఉన్నాడు. శ్రీను భార్య సుజాత ఆన్ లైన్ లో క్లాతింగ్ బిజినేస్ చేస్తోంది. ఇక వేణు వండర్స్ టీమ్ లో సుదీర్, గెటప్ శ్రీనులు బిజీ ఆర్టిస్ట్ లుగా ఎదిగారు. అదే సమయంలో వేణు జబర్దస్త్ మానెయ్యడంతో సుదీర్ అండ్ శ్రీనుకు టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్ వచ్చింది. వీరికి జతగా ఆటో రామ్ ప్రసాద్ జాయిన్ అవ్వడంతో ముగ్గురు కలిసి సుడిగాలి సుదీర్ అండ్ టీమ్ గా సెట్ అయ్యారు.

Image result for గెటప్ శ్రీను ఫ్యామిలీ గురించి

ఇక అప్పటినుంచి వెనుతిరిగి చూసుకోలేదు. శ్రీను రకరకాల గెటప్స్ వేసి గెటప్ శ్రీనుగా పేరు తెచ్చుకున్నాడు. బిల్డప్ బాబాయ్ గా అలాగే అతను వేసే వివిధ రకాల గెటప్స్ అందరి చేత శభాష్ అనిపిస్తాయి. ఇతని కామెడీకి సెపరేట్ గా ఫాన్స్ ఉన్నారు. ఇక నాగబాబుకు ఎంతో ఇష్టమైన కమెడియన్ గెటప్ శ్రీను. శ్రీనును చిరంజీవికి పరిచయం చేసింది కూడా నాగబాబు గారే. చిరంజీవి కూడా శ్రీను యాక్టింగ్ కు మెచ్చుకుని ఖైదీ సినిమాలో అవకాశం కూడా ఇచ్చారు. శ్రీనుకి జబర్దస్త్ లో టీం లీడర్ గా ఆఫర్ వచ్చినప్పటికి సుధీర్ టీంలోనే కొనసాగుతున్నాడు. గెటప్ శ్రీను సినిమాల్లో కూడా తన మార్క్ ను చూపిస్తున్నాడని చెప్పాలి. చాలా సినిమాలలో శ్రీను కనిపిస్తున్నాడు. ఒకపక్క సినిమాలు, మరోపక్క షోలతో బిజీబిజీగా ఉన్నాడు. నెలకు 40 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తూన్నాడు. సుదీర్ కెరీర్ ఇలాగె ఉండాలని మనసారా కోరుకుందాం.

Content above bottom navigation