గ్లామ‌ర్ మోజులో పడి అమ్మ‌త‌నాన్ని వదిలేశారు.. ఇప్పుడు పిల్లలు లేక బాధపడుతున్న టాప్ హీరోయిన్స్

119

చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకోక‌పోవ‌డ‌మనే సామెత గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. కొంతమంది సినీ హీరోయిన్స్ ను చుస్తే అదే నిజమనిపిస్తుంది. సినిమా మోజులో పడి చాలా మంది హీరోయిన్లు త‌మ జీవితాల్ని నాశ‌నం చేసుకున్నారు.. ఆడ‌జ‌న్మ‌కి నిజ‌మైన అర్ధాన్నిచ్చేది అమ్మ‌త‌నంను వదులుకున్నారు. ఏ ఆడది అయినా తల్లి కావాలని, తనకు పిల్లలు ఉండాలని అనుకుంటారు. తల్లి కాకుండా జీవించ‌డం చాలా బాధాక‌రం. అలా తల్లికాకుండా ఉన్న కొందరు హీరోయిన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మ‌: గ్లామ‌ర్ మోజుతో అమ్మ‌త‌నం అప్పుడు తెలియ‌లేదు...ఇప్పుడు తెలిసినా లాభం లేదు?

ఈ విష‌యంలో ముందుగా చెప్పుకోవాల్సింది రేవతి గురించి. ఈమె చాలా అద్భుత‌మైన న‌టి. ఇంట‌ర్ చదువుతున్నప్పుడే సినిమాలలోకి అడుగుపెట్టింది. తెలుగు, త‌మిళ ఎన్నో చిత్రాల్లో న‌టించి ఎన్నో అవార్డుల‌ను కూడా సంపాదించారు. కెరియ‌ర్ మంచి పీక్‌లో ఉన్న‌ప్పుడు సినిమాటోగ్రాఫ‌ర్ సురేష్‌ చంద్ర‌మీన‌న్‌ ని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ళ‌కు పిల్ల‌లు మాత్రం లేరు. దీనికి కార‌ణం రేవ‌తి సినిమాల్లో న‌టించ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. పిల్ల‌లు పుడితే సినిమా ఛాన్సులు తగ్గుతాయని పిల్లల గురించి ఆలోచించలేదు రేవ‌తి. పిల్ల‌ల‌ను కంటే అందం దెబ్బ‌తింటుంద‌ని, త‌ర్వాత ఆఫ‌ర్స్ రావ‌నుకుని రేవ‌తి పిల్ల‌ల‌ను క‌న‌లేదు. సినిమాల కంటే రియ‌ల్ లైప్ ఇంపార్టెంట్ అని తెలుసుకునే స‌మయానికి దేవుడు పిల్ల‌లు క‌ల‌గ‌కుండా చేశాడు. ఆ తర్వాత భ‌ర్త‌తో విడాకులు జరిగిపోయాయి. అలాగే మెల్లగా సినిమాలు కూడా త‌గ్గిపోయాయి. ఈ మ‌ధ్యనే ఒక పాప‌ని ద‌త్త‌తు తీసుకుంది. ఇక పిల్లలు వద్దనుకున్న మరొక హీరోయిన్ లేడీ అమితాబ్‌ విజ‌య‌శాంతి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి, హీరోయిన్‌గా ఎన్నోగ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి టాప్ హీరోయిన్ అయ్యింది. లేడీఓరియంటెడ్ సినిమాలలో కూడా న‌టించి లేడి అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. హీరోయిన్‌గా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే విజ‌య్‌శాంతి శ్రీ‌నివాస్ ప్ర‌సాద్‌ ను పెళ్ళి చేసుకుంది. కొంతకాలం పిల్లలు వద్దనుకుంది. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చి పూర్తీగా పిల్లల మీద ద్యాస వదిలేసింది. రాజ‌కీయాల్లోకి వెళ్ళాక త‌న‌కు స‌మాజ‌మే పిల్ల‌ల‌ని. సొసైటి కోస‌మే పిల్ల‌ల‌ను క‌న‌లేదని చెప్తుంది.

Image result for sharadha

ఇక పిల్లలు వద్దనుకున్నా మరొక న‌టి శార‌ద. ఈమె కూడా చిన్న‌త‌నంలోనే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టింది. శార‌ద దాదాపు అన్ని భాష‌ల్లో న‌టించి మంచి పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే చ‌లం అనే న‌టుడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. చ‌లానికి అప్ప‌టికే పెళ్ళై పిల్ల‌లు ఉన్నారు. కానీ అత‌ని భార్య చ‌నిపోవ‌డంతో శార‌ద‌ను రెండో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్ద‌రి కూడా పిల్ల‌లు లేరు. ప్ర‌స్తుతం చ‌లం చనిపోవడంతో ఒంట‌రిగా గ‌డుపుతోంది. ఇక మరొక హీరోయిన్ జ‌య‌ప్ర‌ద. ఈమె హీరోయిన్‌ గా భారతదేశం మొత్తం జ‌య‌కేత‌నం ఎగర‌వేసింది. అతి చిన్న వ‌య‌సులోనే స్టార్ స్టేట‌స్‌ని చూసింది. అన్నీ ఉన్నాయి కానీ నోరారా అమ్మ అని పిలిచే పిల్ల‌లు ఈమెకు లేరు. ప్రొడ్యూస‌ర్ శ్రీ‌కాంత్ మెహ‌తాను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అయితే అప్ప‌టికే ఆయ‌న‌కి పెళ్ళై పిల్ల‌లు ఉన్నారు. ఆయ‌న‌తో కూడా ఎక్కువ‌కాలం క‌లిసుండ‌క పోవ‌డంతో పిల్ల‌లు కూడా క‌ల‌గ‌లేదు. ఆ తర్వాత ఇంకెవరికి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. తర్వాత రాజకీయాలలోకి వచ్చి ప్రజా సేవ చేసింది.

ఇలా కొంతమంది స్టార్ హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కూడా పిల్లల్ని కనలేదు. అప్పట్లో పిల్లలు వద్దనుకున్నారు కానీ ఇప్పుడు పిల్లలు ఉండి ఉంటె బాగుండు అని బాధపడుతున్నారు. వీళ్ళను చూస్తుంటే చేతులు కాలాక ఆకులూ పట్టుకుంటే ఏం లాభము అని అనిపిస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation