టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు తెలియని బంధుత్వాలు ఇవే

82

మన తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు దర్శకులు మరెందరో కళాకారులు ఉన్నారు, సినిమా మీద ప్రేమతో వారు సినీ పరిశ్రమకి రావడానికి చాలా కష్టపడుతున్నారు. అయితే ఒకే కుటుంబం నుండి చాలా మంది నటులు కళాకారులు వస్తున్నారు. సినిమా కి సంబంధించి ఎవరి పని వారిది కానీ నిజ జీవితంలో కొందరు నటీనటుల, టెక్నీషియన్స్ మధ్య రిలేషన్ షిప్ ఉంది. ఈ వీడియోలో అలా బంధుత్వం ఉన్న కొందరి గురించి తెలుసుకుందాం.

 1. రామ్ పోతినేని, శర్వానంద్..
  హీరో రామ్, శర్వానంద్ ఇద్దరు తెలుగు సినిమాలో రాణిస్తున్న యువ హీరోలు. అయితే వీరిద్దరు దగ్గరి బంధువులు అని మీకు తెలుసా? అవును రామ్ పోతినేని కి శర్వానంద్ బావ వరుస అవుతాడు. శర్వానంద్ అన్న, రామ్ పోతినేని అక్క ఇద్దరు భార్య భర్తలు.
 2. సందీప్ కిషన్, చోటా కె నాయుడు
  టాలీవుడ్ లో చోటా కె నాయుడు కెమెరా పని తనం గురించి చెప్పనక్కర్లేదు. ఆయన హీరోలని చాలా బాగా చూపిస్తారని పేరుంది. చోటా కె నాయుడికి యువ హీరో సందీప్ కిషన్ మేనల్లుడు అవుతాడు. సందీప్ కిషన్ ఇండస్ట్రీకి రావడానికి చోటాకె నాయుడే కారణం. హీరోగా నటించి చాలా సినిమాలకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా చేశారు.
 3. నాగార్జున , వెంకటేష్
  తెలుగు పరిశ్రమలో పెద్ద కుటుంబాలుగా చెప్పుకునే వారిలో దగ్గుబాటి, అక్కినేని కుటుంబాలు ఉంటాయి. వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ, నాగార్జున మాజీ దంపతులు. వీరి కుమారుడు నాగ చైతన్య. అలా వెంకటేష్ నాగార్జునలు సొంత బావ మరుదులు అవుతారు. కొన్ని కారణాల వల్ల నాగార్జున మొదటి భార్యతో విడాకులు అయినప్పటికీ వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.
 4. నగ్మా, జ్యోతిక
  ఒకప్పటి అందాల తార నగ్మా , తమిళ్ హీరోయిన్ జ్యోతిక లు అక్క చెల్లెళ్లు. జ్యోతిక నగ్మా కి స్టెప్ సిస్టర్.. జ్యోతికను ఇండస్ట్రీకి తీసుకువచ్చింది నగ్మానే. ప్రస్తుతం ఎవరి బిజీ లైఫ్ లో వాళ్ళు ఉన్నా అప్పుడప్పుడు కలుస్తుంటారు.
Image result for టాలీవుడ్ లో బంధువులు
 1. మెహర్ రమేష్, చిరంజీవి
  డైరెక్టర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మెహర్ రమేష్ చిరంజీవికి దగ్గర బంధువు అవుతాడు.
 2. గోపి చంద్, శ్రీకాంత్
  తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచున్న శ్రీకాంత్ కి హీరో గోపిచంద్ దగ్గరి బంధువే. గోపిచంద్ శ్రీకాంత్ గారి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. ఆ లెక్కన చుస్తే శ్రీకాంత్ కు గోపీచంద్ కొడుకు వరుస అవుతాడు.
 3. కొరటాల శివ, పోసాని కృష్ణ మురళి
  మంచి సోషల్ మెసేజ్ కథకి మాస్ ఏలిమెంట్లు కలిపి సినిమాలు తీస్తూ హీరోలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్నీ అభిమానులు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా హిట్ల మీద హిట్లు కొడుతున్న దర్శకులు కొరటాల శివ. తెలుగు సినిమాలో మంచి రచయితగా దర్శకుడిగా మరియు నటుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నా పోసాని కృష్ణ మురళీకి కొరటాల శివ మేనల్లుడు అవుతాడు. కొరటాల రచయితగా అవ్వడానికి ప్రోత్సహం ఇచ్చింది కూడా పోసానినే.
 4. కీరవాణి, ఎస్ ఎస్ రాజమౌళి
  200కు పైగా సినిమాలకు సంగీతం అందించిన సంగీత దర్శకులు కీరవాణి గారు. అలాగే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారూ వీరిద్దరూ అన్నదమ్ముళ్లే. కీరవాణి గారి పిన్ని కొడుకు రాజమౌళి. రాజమౌళి గారూ తీసిన అన్ని సినిమాలకు సంగీతం అందించారు కీరవాణి గారు.
 5. ప్రకాష్ రాజ్, శ్రీ హరి
  ప్రకాష్ రాజ్, శ్రీ హరి కలిసి కొన్ని సినిమాలు చేశారు. వీరిద్దరూ తెలుగు సినిమా ప్రేక్షకులు గుర్తిండి పోయే క్యారెక్టర్లు చేశారు .ప్రకాష్ రాజ్గా శ్రీహరి అన్నదమ్ములు అవుతారు. ఎలా అంటే ప్రకాష్ రాజ్ మొదటి భార్య , శ్రీ హరి భార్య డిస్కో శాంతి సొంత అక్క చెల్లెళ్లు.
 6. మహేశ్వరి, శ్రీదేవి
  అందాల తార శ్రీ దేవి తెలుగు సినిమాలలోనే కాదు భారత దేశ సినీ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే నటి. గులాబీ, పెళ్లి లాంటి హిట్ సినిమాల్లో నటించిన మహేశ్వరి దగ్గరి బంధువులు. శ్రీదేవికి మహేశ్వరి చెల్లెలు అవుతుంది..
 7. సుహాసిని, శ్రుతిహాసన్..
  టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉండి, ప్రస్తుతం అమ్మ క్యారెక్టర్స్ చేస్తున్న సుహాసిని, కమల్ హాసన్ కూతురిగా వచ్చి హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్ అక్కచెల్లెలు అవుతారు. సుహాసిని తండ్రి చాదర్ హాసన్, శ్రుతిహాసన్ తండ్రి కమల్ హాసన్ సొంత అన్నతమ్ములు.
 8. సుద్దాల అశోక్ తేజ, ఉత్తేజ్..
  రచయితగా మంచి పేరు తెచ్చుకున్న సుద్దాల అశోక్ తేజకు మేనల్లుడు అవుతాడు నటుడు ఉత్తేజ్. ఉత్తేజ్ కూడా మంచి రచయిత. మేనమామ పోలికలు ఎక్కడికి పోతాయిలెండి.
 9. రవళి, హరిత..
  టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రవళి. అలాగే బుల్లితెర మీద దుమ్ములేపుతున్న హరిత సొంత అక్కాచెల్లెళ్లు.

ఇలా కొంతమంది సినిమా సెలెబ్రిటీల మధ్య చాలా దగ్గరి బంధుత్వం ఉంది. అయితే వీళ్ళు బంధువులు అవుతారని ఇప్పటికి కూడా చాలామందికి తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

Content above bottom navigation