టాలీవుడ్ టాప్ 15 హీరోయిన్స్ రియల్ ఏజ్..

355

తెలుగులో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త హీరోయిన్ లతో కళకళలాడుతోంది. ఇక శతాబ్దం కాలం నుండి తెలుగు లో నిలదొక్కుకున్న అనుష్క ,కాజల్, తమన్నా, సమంతలతో పాటు కుర్ర హీరోయిన్స్ రకూల్, సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇంకా చాలా మంది తమ సినిమాలతో బిజీ అవుతున్నారు. అయితే చాలా కాలం నుండి నటిస్తున్న ఈ హీరోయిన్స్, అలాగే కొత్తగా వచ్చి టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న యువ హీరోయిన్స్ ల వయస్సు ఎంతో మీకు తెలుసా? ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే…

 1. త్రిష : నీ మనసు నాకు తెలుసు సినిమాతో 2003 లో తెలుగు సినిమాకి పరిచయం అయింది. ఆ తర్వాత వర్షం, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దానంట, స్టాలిన్, బుజ్జిగాడు, కింగ్, కృష్ణ, పౌర్ణమి లాంటి హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పటికీ త్రిష అంటే ఆడియన్స్ లో క్రేజ్ తగ్గలేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా త్రిష లుక్స్ లో ఏ మాత్రం చేంజెస్ రాలేదు. ఈ అమ్మడు వయసు 36 ఏళ్ళు.
 2. అనుష్క : అరుంధతి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయ్యింది అనుష్క. స్టార్ హీరోలతో పోటీగా లుక్స్ విషయంలో, క్యారెక్టర్స్ విషయంలో వేరియేషన్స్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ బొమ్మాలి. ‘ సైజ్ జీరో ’ లాంటి సినిమాలు చేయాలన్నా, అల్ట్రా గ్లామరస్ క్యారెక్టర్స్ లో యూత్ ని మెస్మరైజ్ చేయాలన్నా, బాహుబలి సినిమాలో ‘దేవసేన’ లా డీ గ్లామర్ రోల్ లో కనిపించాలన్నా అది కేవలం అనుష్కకే సాధ్యం. అరుంధతి, సింగం, బిల్లా, రుద్రమదేవి, విక్రమార్కుడు, డాన్, భాగమతి, లాంటి సినిమాలతో అదరహో అనిపించింది ఈ బొమ్మాలి. ఈ ముద్దుగుమ్మ వయసు 37 ఏళ్ళు.
 3. నయనతార : ఇండస్ట్రీలో హీరోలు ఎంత బిజీగా ఉంటారో, నయనతార కూడా అంతే బిజీగా ఉంటుంది. అంతెందుకు స్టార్ హీరోల సినిమాల కోసం ఆడియెన్స్ ఎంతగా వెయిట్ చేస్తారో, నయనతార సినిమా కోసం అంతే ఈగర్ గా వెయిట్ చేస్తారు ఆడియన్స్. లక్ష్మి, అదుర్స్, దుబాయ్ శీను, వల్లభ, కృష్ణం వందే జగద్గురుం లాంటి సినిమాలతో అలరించింది. 34 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం సక్సెస్ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తగా కెరిర్ ప్లాన్ చేసుకుంటుంది నయనతార.
 4. కాజల్ అగర్వాల్ : తెలుగు సినిమాకి కాజల్ చందమామ. ఇండస్ట్రీకి పరిచయమై 12 ఏళ్ళ కింద పరిచయం అయినా కాజల్ అగర్వాల్ ను స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. గతకొన్ని రోజులుగా వెనుకబడ్డ కాజల్ ఇప్పుడు వరుస సినిమాలను ఒప్పుకుంటుంది. విలక్షణ నటుడు కమల్‌‌ నటిస్తున్న భారతీయుడు2 లో నటిస్తుంది. 34 ఏళ్ళ వయసులో కూడా యంగ్ గర్ల్ లుక్స్ లో ఎప్పటికపుడు మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది ఈ పంచదార బొమ్మ.
 1. సమంతా : మొదటి సినిమా ఏ మాయ చేశావే తోనే యూత్ అందరిని మాయ చేసిన ఈ ముద్దుగుమ్మ పెళ్ళైన కూడా సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. పెళ్ళైన తర్వాత కూడా గ్లామరస్ పత్రాలు చేస్తూ సినీ అభిమానులను అలరిస్తుంది. ఈ కుందనపు బొమ్మ వయసు అక్షరాలా 32 ఏళ్ళు.
 2. తమన్నా : టాలీవుడ్ లో మ్యాగ్జిమమ్ హైట్స్ చూసిన హీరోయిన్స్ లో తమన్నా పేరు ఖచ్చితంగా ఉంటుంది. గ్లామర్ కి గ్లామర్, పర్ఫామెన్స్ కి పర్ఫామెన్స్… ఓ రకంగా చెప్పాలంటే తమన్నా ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్. ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ అమ్మడు వయసు 30 ఏళ్ళు.
 3. ఇలియానా : దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత కిక్, రాఖీ, మున్నా, జులాయి లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా పెద్ద హిట్స్ సాధించింది. తన నడుము వంపులతో ఇప్పటికి కూడా ఛాన్సులు దక్కించుకుంటున్న ఈ అమ్మడు వయసు 33 ఏళ్ళు.
 4. హన్సిక : 14 ఏళ్లకే ‘దేశముదురు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 14 ఏళ్ళకే టాలీవుడ్ ని ఓ స్థాయిలో ఊపేసింది. ఈ మధ్య చిన్నగా స్పీడ్ తగ్గినా, మళ్ళీ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తుంది. హన్సిక వయసు 28 ఏళ్ళు.

ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చి టాప్ హీరోయిన్స్ గా వెలుగొందిన హీరోయిన్స్ వయసు వివరాలు ఇలా ఉన్నాయి. ఇక వీళ్ళ హవా తగ్గినా తర్వాత కొంతమంది కుర్ర హీరోయిన్స్ ఇండస్ట్రీ మీద దండయాత్ర చెయ్యడానికి వచ్చారు. వారిలో రకుల్, రష్మిక, కీర్తి సురేష్.. ఇలా చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న టాప్ కుర్ర హీరోయిన్స్ వయసు వివరాల్లోకి వెళ్తే…

 1. శృతిహాసన్ : కమల్ హాసన్ నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. ఒక యాక్టర్ గా, ఒక సింగర్ గా తనలోని వివిధ కోణాలను బయటపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే మల్టీ ట్యాలెంటెడ్ అనే చెప్పాలి. గబ్బర్ సింగ్, రేసుగుర్రం, శ్రీమంతుడు, ఎవడు లాంటి హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య గ్యాప్ వచ్చిందనిపించినా రవితేజ సినిమాతో మళ్ళీ ట్రాక్ పైకి రానున్న శృతి హాసన్ వయసు 33 ఏళ్ళు.
 2. రకుల్ ప్రీత్ సింగ్ : హీరోయిన్ కాస్త ప్రెట్టీ లుక్స్ లో ఉండాలి అనగానే డైరెక్టర్స్ మైండ్ లోకి వచ్చే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరటం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్ కొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్రూస్ లీ, జయజనకి నాయక, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుకచూద్దాం లాంటి సినిమాతో స్టార్ హీరోయిన్ అయ్యింది. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా తన సత్తా చూపించింది. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోయిన్స్ తో నటించి, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. రకుల్ వయసు 29 ఏళ్ళు.
 3. సాయి పల్లవి : మొదటి సినిమా ఫిదాతోనే హైబ్రిడ్ పిల్లగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది సాయిపల్లవి. చాలా తక్కువ మంది హీరోయిన్స్ సాయి పల్లవి తరహాలో జెట్ స్పీడ్ లో ఫామ్ లోకి వస్తారు. అయితే గ్లామర్ పాత్రలకు నో చెప్పి, చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది సాయిపల్లవి. అటు మెడిసిన్ చేస్తూనే, ఇటు సినిమాలు చేస్తున్న సాయి పల్లవి వయసు 27 ఏళ్ళు.
 4. అనుపమ పరమేశ్వరన్ : అ ఆ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్సినా ఈ అమ్మడు తెలుగులో మంచి పేరే తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ, హోమ్లీ పాత్రలు చేసుకుంటుంది. దాంతో అవకాశాలు తక్కువనే వస్తున్నా కూడా మంచి హోమ్లీ పాత్ర ఉంటె మాత్రం డైరెక్టర్స్ ఈ అమ్మడుకే ఓటు వేస్తున్నారు.శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, రాక్షసుడు, హలొ గురు ప్రేమకోసమే జీవితం లాంటి హిట్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఈమె వయసు జస్ట్ 23.
 5. రష్మిక మందాన : తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్స్‌లలో ఒకరుగా రాణిస్తున్నారు రష్మిక మందన. కన్నడలో కిరికీ పార్టీ సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ఛలో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్ సినిమాలతో ఆకట్టుకొని ఏకంగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఛాన్స్‌ కొట్టి హిట్ అందుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న రష్మిక వయసు 23 ఏళ్ళు.
 6. రాశికన్నా : ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్సినా ఈ అమ్మడు ఆ తర్వాత జిల్, తొలిప్రేమ, జై లవకుశ లాంటి హిట్ సినెమాలో నటించింది. ఈ మధ్యనే ప్రతిరోజు పండుగే, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలతో హిట్స్ అందుకుంది. కుర్ర హీరోలతో హీరోయిన్స్ లలో బెస్ట్ ఛాయస్ ఎవరంటే రాశీఖన్నానే గుర్తుకువస్తుంది. ఈ అమ్మడు వయసు 29 ఏళ్ళు .
 7. కీర్తి సురేష్ : మొదట్లో మరీ హోమ్లీగా ఉందనిపించినా కీర్తి సురేష్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. టాలీవుడ్ లో మహానటి లాంటి గొప్ప సినిమాలో నటించి తన సత్తా ఏంటో అందరికి తెలిసేలా చేసింది. ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా తన మార్క్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది కీర్తి సురేష్. ఇప్పుడు గ్లామర్ సినిమాలు చెయ్యడానికి కూడా సిద్దమే అని గ్లామర్ షోలు చేస్తుంది. ఈ అమ్మడు వయసు 26 ఏళ్ళు.
 1. పూజ హెగ్డే :
  పూజా హెగ్డే .. ఇప్పుడు దర్శకనిర్మాతలు జపిస్తున్న పేరు. తెలుగులో చేసింది నాలుగైదు సినిమాలే అయినా టాప్ హీరోలందరి సరసన నటించిన అందాల నటి. టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ అనగానే గుర్తొచ్చే పేరు ‘పూజా హెగ్డే’దే. రీసెంట్ గా ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకుంది ఈ పొడుగుకాళ్ల సుందరి. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు వయసు 29 ఏళ్ళు.
 2. కియారా అద్వానీ :
  బాలీవుడ్తోపాటు దక్షిణాదిలో కూడా హాట్ బ్యూటీ కియారా అద్వానీ జోష్ను కొనసాగిస్తున్నది. భరత్ అనే నేను లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో కబీర్సింగ్, గుడ్ న్యూస్ లాంటి బ్లాక్బస్టర్ విజయాలతో సత్తా చాటింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో గిల్టీ అనే సిరీస్లో నటించింది. ప్రస్తుతం అన్ని లాంగ్వేజ్ లలో ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈమె వయసు 27 ఏళ్ళు.
 3. నిధి అగర్వాల్ :
  మజ్ను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టి అక్కడ రాణించాలనుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ వయసు 26 ఏళ్ళు.
 4. నివేతా థామస్ :
  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అయ్యింది నివేతా థామస్. జెంటిల్ మెన్, నిన్ను కోరి, జై లవకుశ, దర్బార్, బ్రోచేవారెవరురా లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో నటించింది. ప్రస్తుతం యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళ్తున్న ఈ అమ్మడు వయసు 24 ఏళ్ళు.
 5. ఇషా రెబ్బ ..
  టాలీవుడ్ లో తెలుగమ్మాయిలను అవకాశాలు తక్కువ ఉంటాయని అందరు అంటారు. అలాంటి స్థితిలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ మంచి నటిగా పేరు తెచ్చుకుంటున్న ఈ అచ్చ తెలుగమ్మాయి వయసు 29 ఏళ్ళు.
Content above bottom navigation