టాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ ని పక్కన పెడుతున్న డైరెక్టర్స్ ..కారణం ఏమిటో తెలుసా ?

198

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావడం లేదంటారు కానీ వచ్చిన వాళ్లకి ఛాన్స్ లు ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పైకి ఒకటి చెబుతూ లోపల ఇంకోలా మన ఫిలిం మేకర్స్ పనిచేస్తున్నారని,బాగా యాక్ట్ చేసేవాళ్లను దృష్టిలో ఉంచుకుని కేరక్టర్స్ డిజైన్ చేసి,ఎందుకు రాయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్స్ కి ఛాన్స్ లు లేకపోవడం వలన మన తెలుగు అమ్మాయిలు కనుమరుగై పోతున్నారన్న ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. తెలుగు హీరోయిన్స్ ని చిన్నచూపు చూస్తున్నారని అంటున్నారు. అలా డైరెక్టర్స్ చిన్న చూపు చూస్తున్న కొందరు హీరోయిన్స్ గురించి ఇప్పుడు చూద్దాం.

విశాఖ కు చెందిన శోభిత ధూళిపాళ అచ్చమైన తెలుగు అమ్మాయే కదా. శోభిత నటనకు ఎవరూ పేరు పెట్టలేరు. అమెజాన్ వెబ్ సిరీస్ లో ఆమె చేసిన నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. గూఢచారిలో నటించినా సరే, మంచి ఛాన్స్ లు రాకపోవడంతో హిందీలో ట్రై చేసింది. అక్కడే బానే ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇక మరొక అమ్మాయి రీతూ వర్మ. ఈమె తెలుగమ్మాయి కావడంతో ఈమెకు కూడా ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ఖుషి లాంటి సినిమాల్లో భూమిక కు ఇచ్చిన రోల్స్ ఈమెకు సరిపోతాయి. కానీ అలాంటి పాత్రలకు రాయడం మానేశారు. ఇక శ్రద్ధానాధ్ జెర్సీ మూవీలో మంచి క్యారెక్టర్ చేసింది. కానీ మళ్ళీ కనిపించలేదు.

Image result for టాలీవుడ్ లో ఈ హీరోయిన్స్ ని పక్కన పెడుతున్న డైరెక్టర్స్

మెహ్రిన్ పిజ్జాదా అనగానే కృష్ణగాడి వీరప్రేమగాధ మూవీ గుర్తొస్తోంది. మహాలక్ష్మి క్యారెక్టర్ అదరగొట్టింది. కానీ ఆలాంటి క్యారెక్టర్స్ మళ్ళీ ఈమెకు రావడం లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ కు పేరుచ్చింది కానీ,షాలిని పాండే లాగ ఎవరూ నటించలేరు. చిన్నపిల్లాడు ఆవేశంలో పిచ్చిపనులు చేస్తుంటే,ఓ తల్లి బిడ్డను దగ్గరకు తీసుకుని లాలిస్తున్నట్లు షాలిని ఉంటుంది. ఈమె నటన వల్లే ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అయింది. కనీసం ఆమెకు ఒక్క అవార్డు రాలేదు. ఇక మరొక అద్ఇభుతమైన నటి సాయి పల్లాలవి. ఫిదా సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరొయిన్ అయ్యింది. కాని ఆ రేంజ్ కు తగ్గ పాత్రలు మళ్ళి రాలేదు. కేవలం నటనకు స్కోప్ ఉన్న సినిమాలే చేస్తా అని సాయి పల్లవి చెప్పడంతో, అలాంటి పాత్రలు రాయలేని మన దర్శకులు సాయి పల్లవిని పక్కన పెట్టేశారు. ఇలా కొంతమంది హీరోయిన్స్ అద్భుతమైన నటనను కనబర్చినా కూడా అవకాశాలు రావడం లేదు. ఇక ముందు అయినా వీళ్ళకు మంచి చాన్సులు వచ్చి మనల్ని అలరించాలని కోరుకుందాం.

Content above bottom navigation