ట్రంప్ సెక్యూరిటీ టీమ్ లో ఉండే ఒకే ఒక్క ఇండియన్.. ఇతని రికార్డ్ గురించి తెలిస్తే దిమ్మతిరుగుతుంది..

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, ప్రభావవంతమైన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. ప్రపంచాన్ని అమెరికా శాసిస్తుంది ఇప్పుడు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. ఒక్కసారైనా అమెరికా అద్యక్షుడై వైట్ హౌస్ లో అడుగుపెట్టాలని ప్రతి అమెరికన్ కలలు కంటాడు. అయితే ఆ పదవిలో ఉన్నవారికి పేరు ప్రతిష్టలు ఏ స్థాయిలో ఉంటాయో, ముప్పూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అటువంటి నేతకు భద్రత కల్పించటానికి ఎంతోమంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఆ సెక్యూరిటీ టీమ్ లో దాదాపుగా అందరు అమెరికన్స్ ఉంటారు. కానీ ప్రస్తుతం అమెరికా ప్రెసిండెంట్ అయినా డోనాల్డ్ ట్రంప్ కు ఉండే సెక్యూరిటీ టీమ్ లో ఒక ఇండియన్ ఉన్నాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.

ట్రంప్ కు ఉన్న సెక్యూరిటీ టీమ్ లో ఉన్న ఆ ఇండియన్ పేరు అన్షు దీప్ సింగ్ భాటియా. ఇతను సిక్కు మతానికి చెందినవాడు. 2018 లో ఇతను ట్రంప్ సెక్యూరిటీ టీమ్ లో జాయిన్ అయ్యాడు. ట్రంప్ సెక్యూరిటీ టీమ్ లో చోటు సంపాదించిన తొలి సిక్కు వ్యక్తిగా నిలిచాడు అన్ష్ దీప్ సింగ్ భాటియా. ఇతని గురించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే… పంజాబ్ లోని లుధియానాలో అన్ష్ దీప్ జన్మించాడు. 1984 లో కాన్పూర్ లో సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో కాన్పూర్ లో సిక్కులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వారిలో అన్షు దీప్ ఫ్యామిలీ కూడా ఉంది. దాంతో అన్ష్ దీప్ కుటుంబం కాన్పూర్ నుంచి పంజాబ్ లోని లుధియానాకు వలస వెళ్లింది. ఈ దాడుల్లో అతని కుటుంబ సభ్యులు కూడా మరణించారు. అతని తండ్రి దేవేంద్ర సింగ్ కూడా ఈ దాడుల్లో గాయపడ్డాడు. అతనికి మూడు బుల్లెట్ గాయాలయ్యాయి.

Image result for anshu deep singh bhatia

పంజాబ్ లోని లుధియానాకు వలస వెళ్లిన తర్వాత దేవేంద్ర సింగ్ ఫార్మాసూటికల్ బిజినెస్ ప్రారంభించారు. ఆ బిజినెస్ మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యింది. ఆ తర్వాత బిజినెస్ ను విదేశాలకు విస్తరించాడు దేవేంద్ర సింగ్. 2000వ సంవత్సరంలో దేవేంద్ర సింగ్ తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. ఆ సమయంలో అన్ష్ దీప్ వయసు పదేళ్లు. ఇక అన్షు దీప్ చదువంతా అమెరికాలోనే కొనసాగింది. అమెరికా మెంబర్ షిప్ ను కూడా తీసుకున్నారు. దాంతో అమెరికా సిటిజన్స్ గా అక్కడే సెటిల్ అయ్యారు. ఇక చిన్నప్పటినుంచి అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్ లో ఉండాలన్నదే తన లక్ష్యంగా పెట్టుకున్న అన్ష్ దీప్ 2018 లో తానూ అనుకున్నది సాధించాడు. ఇక ఇప్పుడు ట్రంప్ ఇండియాకు రావడంతో ట్రంప్ సెక్యూరిటీ టీమ్ తో పాటు ఇండియాకు వచ్చాడు. ఎప్పుడు పదేళ్ల వయసులో ఇండియా నుంచి వెళ్లిన అన్షు దీప్, మళ్ళి ఇన్నాళ్లకు ఇండియా వచ్చాడు.

Content above bottom navigation