త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు కాపీనా? telugutv

222

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్2లో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో మరో సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. RRR చిత్రం తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేసవి నుంచి సెట్స్‌పైకి వెళుతుంది. సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేమిటీ అంటే… పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఒకప్పటి చిరంజీవి నటించిన ఒక సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అయిననూ పోయి రావలె హస్తినకు సినిమా చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమా కాన్సెప్టును ప్రేరణగా తీసుకొని తెరకెక్కించబోతున్నట్టు చెబుతున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయకృష్ణ నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్‌తోనే త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు తనదైన పొలిటికల్ టచ్‌ తో కాస్త డిఫరెంట్‌ గా తెరకెక్కించబోతున్నాడట. అయితే త్రివిక్రమ్ ఇలా ఇతర సినిమాను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం ఇదేమి మొదటిసారి కాదు. రీసెంట్‌ గా త్రివిక్రమ్.. అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా కూడా అలనాటి ఎన్టీఆర్ ‘ఇంటి గుట్టు’, మంచి మనిషి సినిమాల కాన్సెప్టునే ‘అల వైకుంఠపురములో’ సినిమా కోసం వాడుకున్నాడు. త్రివిక్రమ్ గత సినిమాల విషయానికొస్తే.. ‘అఆ’ సినిమా కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘మీనా’ సినిమాకు రీమేక్. అలాగే మహేష్ బాబుతో చేసిన ‘అతడు’ సినిమా కూడా వెంకటేష్ ‘వారసుడొచ్చాడు’ సినిమాను అటు ఇటు కొంచెం మార్పులు చేసి తెరకెక్కించాడు. ఇక అల్లు అర్జున్ ‘జులాయి’ సినిమాలోని బ్యాంక్ దొంగతనం సీన్.. ’ది డార్క్ నైట్’ అనే ఫేమస్ హాలీవుడ్ సినిమాలోని సీన్లను వాడుకున్నాడు.

Image result for త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా చిరంజీవి సూపర్ హిట్ సినిమాకు కాపీనా?

ఇక అత్తారింటికీ దారేదిలో బ్రహ్మి అబద్ధం చెబితే.. ఆకులు రాలే కామెడీ సీన్ ని ‘ఏ థౌసండ్ వర్డ్స్’ అనే సినిమా నుంచి ఆ సీన్ ను కాపీ పేస్ట్ చేసాడు. మొత్తంగా ప్రతి సినిమాలో ఏదో ఒక హైలెట్ సీన్‌ ను కాపీ కొట్టి తన సినిమా స్క్రీన్ ప్లే కలిపేయడం త్రివిక్రమ్‌ కు పెన్నుతో పెట్టిన విద్యగా మారింది. మొత్తానికి త్రివిక్రమ్ పాత కథలను ఇప్పటి జనరేషన్‌కు తగ్గట్టు తీయడం మంచి పరిణామనే చెప్పాలి. పాత సినిమాల కాన్సెప్ట్‌‌తో కొత్త సినిమా కోసం వాడుకోవడం అనేది ఒక్క త్రివిక్రమ్ మాత్రమే కాదు.. రాజమౌళి, పూరీ జగన్నాథ్ వంటి దర్శకులు కూడా తమ సినిమాల్లో ఎన్నో సీన్లను,కథలను వేరే సినిమాల నుంచి కాపీ పేస్ట్ చేసినవారే. ఈ కాపీ పేస్ట్ అనే కంటే ప్రేరణ తీసుకొని తీసారని చెప్పుకోవచ్చు. చూడాలి మరి ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు ఎదురుచూడాల్సిందే..

Content above bottom navigation