దొరబాబు బలి పశువు అయ్యాడా?.. తప్పించుకున్న పెద్దలు..

119

బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెండీ ప్రోగ్రామ్స్ వచ్చాయి..కానీ ‘జబర్థస్త్’ లాంటి ప్రోగ్రామ్ కి వచ్చిన పాపులారిటీ దేనికీ రాలేదు. ఈ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. వీరిలో షకలక శంకర్, వేణు, గెటప్ శ్రీను, సుదీర్, హైపర్ ఆది.. ఇలా చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో ఎవరి హవా నడుస్తుంది అంటే హైపర్ ఆది పేరే చెబుతారు. ఆది వేసే పంచులకు నవ్వనివాడు ఎవరు ఉండరు. అయితే ఆదికి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే..అతని టీమ్ లో ఉన్న కంటిస్టెంట్స్. ఆది టీమ్ లో రైజింగ్ రాజు తర్వాత చెప్పుకోవాల్సింది దొరబాబు గురించి. గతంలో దొరబాబు అడల్ట్ బీ గ్రేడ్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తావన హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబు పై పంచ్ లు వేస్తుంటాడు. కానీ ఇప్పుడు రియల్ గా కూడా ఇదే పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. విశాఖ పట్నంలోని వ్యభిచార గృహంలో జబర్ధస్త్ నటుడు దొరబాబు, పరదేశ దొరికిపోవడం సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఈ రాకెట్‌ లో అడ్డంగా దొరికిపోయిన దొరబాబు, ఈ కేసులో బలి పశువు అయ్యాడా ? ఇందులో పెద్దలను విడిచిపెట్టి పోలీసులు దొరబాబును కావాలనే ఈ కేసులో ఇరికించారా అంటే ఔననే అంటున్నాయి స్మాల్ స్క్రీన్ వర్గాలు. దొరబాబు పోలీసులకు దొరికిన రోజు రాత్రి అసలేం జరిగిందింటే.. ఆ రోజు పోలీసులు పేకాట ఆడుతున్న బ్యాచ్ పై రైడింగ్ కోసం వెళ్తే అనుకోకుండా దొరబాబు పోలీసులకు దొరికిపోయాడు. కానీ పోలీసులు అక్కడ పేకాట ఆడుతున్న పెద్ద మనుషులకు విడిచి పెట్టి, మీడియా వాళ్ల నుంచి ఈ కేసు దృష్టిని మరల్చడానికి దొరబాబును ఈ కేసులో ఇరికించారని ఆయన సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యభిచారం రాకెట్‌ లో మొత్తంగా చూసుకుంటే దొరబాబు బలి పశువుగా మారాడని అంటున్నారు. ఈ కేసులో వేరే నటులు, పొలిటికల్‌ అండ ఉన్న వాళ్ల ప్రమేయం ఉన్నా, కావాలనే దొరబాబును అడ్డంగా బుక్ చేసారని చెబుతున్నారు.

Image result for దొరబాబు

దొరబాబుపై ఇన్ని ఆరోపణలు వచ్చినా, ఆయన భార్య, జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ మాత్రం అతనికి అండగా నిలుస్తున్నారు. అతను అలాంటి వాడు కాడని చెబుతున్నారు. అతని భార్య అయితే నా భర్త ఎలాంటి వాడో నాకు తెలుసు అని బల్లగుద్ది చెబుతుంది. అలాగే తోటి జబర్దస్త్ కమెడియన్స్ అందరు కూడా ఇతనికి అండగా ఉంటున్నారు. జబర్దస్త్ నుంచి దొరబాబును తీసేస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు. దొరబాబును జబర్దస్త్ లో కంటిన్యూ చెయ్యాలని జబర్దస్త్ యూనిట్ అనుకుంటుంది. మొత్తానికి ఈ వ్యవహారంలో నిజంగానే దొరబాబు దోషినా.. ? లేకపోతే వేరే వాళ్లు పన్నిన ట్రాప్‌లో పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.

Content above bottom navigation