నటుడు ఆనంద్ రాజ్ తమ్ముడు ఆత్మహత్య కేసులో కొత్త మలుపు.. పోలీసుల చేతికి సూసైడ్ లెటర్.. అన్ననే కారణం..

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఆనంద్ రాజ్. ఈయన గురించి తెలుగు వాళ్లకు కూడా పరిచయం అవసరం లేదు. పెదరాయుడు సినిమాలో ఈయన విలనిజం అంత ఈజీగా ఎవరూ మరిచిపోలేరు. దానికి ముందు గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో ఈయన చాలా ఫేమస్ అయ్యాడు. 100 సినిమాలకు పైగానే నటించిన ఆనంద్ రాజ్ తమిళనాట పాపులర్ విలన్. అక్కడ రజినీకాంత్ బాషా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన కుటుంబంలో విషాదం నెలకొంది. తాజాగా ఈయన సోదరుడు కనగసబాయ్ పాండిచ్చేరిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వయసు 55 సంవత్సరాలు. ఈ విషయం ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో సంచలనం రేపుతుంది. ఈయన ఆత్మహత్య విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి పోతే..

దక్షిణాది చిత్ర పరిశ్రమలో యాక్టర్ ఆనంద్ రాజ్‌కి ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు సినిమాల్లో విలన్‌గా నటించి టాలెంటెడ్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 100 సినిమాలకు పైగానే నటించిన ఆనంద్ రాజ్ తమిళనాట పాపులర్ విలన్. ఇటీవల ఆనంద్ రాజ్ సోదరుడు కనకసబై సూసైడ్ చేసుకోవడం తమిళ సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. 55 సంవత్సరాల వయసున్న కనకసబై పాండిచ్చేరిలో బలవన్మరణానికి పాలుపడ్డాడు. ఈయన హఠాన్మరణంతో ఆనంద్ రాజ్ తీవ్రంగా కుటుంబం కలత చెందింది. మృతి చెందిన కనకసబై తమిళనాడులో చిట్ ఫండ్ వ్యాపారం చేసేవాడు. ఈ చిట్ ఫండ్స్‌లో ఆయనకు ఈ మధ్య తీవ్ర నష్టాలు రావడం, అలాగే ఇటీవలే కొనుగోలు చేసిన ఓ ఇంటి విషయమై సమస్యలు తలెత్తడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అంతా భావించారు. మరోవైపు ఆనంద్ రాజ్ తన తమ్ముడి మరణం వెనుక ఏదో కుట్ర దాగివుందని ఆరోపించాడు.

Image result for ఆనంద్ రాజ్ తమ్ముడు

ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో భాగంగా కేసు కొత్త మలుపు తిరిగింది. తాజాగా కనకసబై ఆత్మహత్య లేఖ పోలీసుల చేతికి చిక్కింది. దీని ఆధారంగా ఆనంద్ రాజ్ మరో సోదరుడు భాస్కర్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను మరణించడానికి తన అన్నయ్య భాస్కర్, అతని కొడుడు శివచంద్రన్ కారణమని ఈ లేఖలో కనకసబై పేర్కొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తదుపరి విచారణలో భాగంగా వారిద్దరినీ న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు పోలీసులు. అయితే అంతకముందు సోదరుడి మరణంపై నటుడు ఆనంద్ రాజ్ కూడా స్పందించాడు. తన సోదరుడి బలవన్మరణానికి బెదిరింపులే కారణమని, అతడిని చంపుతామని బెదిరించారని అందుకే ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు ఆనంద్ రాజ్. ఎంతో మానసిక క్షోభకు గురైన తర్వాత తన సోదరుడు ఈ దారుణమైన నిర్ణయం తీసుకుని ఉండుంటాడని ఆయన విలపిస్తున్నారు. కనగసబాయ్ వ్యాపారంలో నష్టాలకు తోడు ఓ ఇంటిని కొన్నాడు. అదే సమయంలో కొందరు ఆయనపై దాడి కూడా చేసారని చెప్పాడు ఆనంద్ రాజ్. బెదిరింపులకు కూడా పాల్పడ్డారని.. దీంతో తనను ఏమైనా చేస్తారేమోననే కనగసబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు ఈయన. తన తమ్ముడి చావుకు కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు ఆనంద్ రాజ్.

Content above bottom navigation