నితిన్ కి కాబోయే భార్య ఈమెనే.. ఎలా ప్రపోజ్ చేసాడో తెలుసా…

104

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో యంగ్ హీరో నితిన్ ఒకడు. నూనూగు మీసాల వయసులోనే నితిన్ జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలతో హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తుంపు తెచ్చుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్.. మధ్యలో వరుస పరాజయాలతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతడి కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఇష్క్’ సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. ఇక త్వరలోనే హీరో నితిన్ పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే నితిన్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరా అని అతని ఫాన్స్ తెగ అతృతతో ఎదురుచూస్తున్నారు. ఆమెకు సంబందించిన విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి.

నితిన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని.. ఏప్రిల్‌లో వీరి పెళ్లి జరగబోతోంది. అయితే ఇప్పటివరకు నితిన్‌కు కాబోయే భార్యకు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటికి రాలేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న అందమైన అమ్మాయినే నితిన్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 15న హైదరాబాద్ లో వీరిద్దరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్ లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నితిన్ షాలినిని 2012లోనే కలిసారట. అయితే అప్పటికి ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది. రెండేళ్ల క్రితమే ఇద్దరి స్నేహం ప్రేమగా మారిందట. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుంటుండడంతో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నారట.

ఎంతైనా నితిన్ సినిమా హీరో. తన ఆలోచనలు కూడా సినిమాటిక్‌గా ఉంటాయి. అందుకే షాలినికి అందరిలాగా పువ్వులు ఇచ్చి పెళ్లి చేసుకుంటావా అని రొటీన్‌గా అడగలేదట. కాస్త వైరెటీగా ప్రపోజ్ చేయాలని నితిన్ అనుకున్నారట. అందుకే ఒంటికాలిపై నిలబడి ప్రపోజ్ చేసాడట. దాంతో నితిన్ చేష్టలు చూసి నవ్వుకున్న షాలిని వెంటనే అతని ప్రేమను ఒప్పుకున్నారట. మరో విషయం ఏంటంటే.. ఇప్పటివరకు నితిన్ నటించిన అన్ని సినిమాలు షాలిని చూసేసిందట. సినిమా చూసాక తన అభిప్రాయాలను నిజాయతీగా చెబుతుందట. నితిన్ బాధపడతాడు అనుకోకుండా తనకు అనిపించింది ఉన్నది ఉన్నట్లు చెబుతుందట. అయితే నితిన్ నటించిన ‘లై’ సినిమా మాత్రం షాలిని అర్థం కాలేదట. ఈ విషయాన్ని నితిన్ కి చెబితే అతను నవ్వి ఊరుకున్నాడట. శనివారం హైదరాబాద్‌లో ఉన్న నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారట. దుబాయ్‌లో పెళ్లి కాబట్టి సినీ ప్రముఖులు అందరూ వెళ్లలేరు. దాంతో హైదరాబాద్‌లో అందరికీ కలిపి గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation