పటాస్ షో నిలిపివేత.. అసలేమైందో తెలిస్తే షాక్ ..

135

తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకాదరణను పొందుతున్నాయి. అలాంటి షోలలో పటాస్ ఒకటి. స్టాండప్ కామెడీ షోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కొద్ది రోజులకే ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈటీవీ ఛానల్ లో ప్రసారం అవుతోన్న నెంబర్ వన్ కామెడీ షో జబర్ధస్త్‌ కు పోటీగా మారిన పటాస్.. ఈ మధ్య తన హవాను కోల్పోయింది అనే చెప్పుకోవాలి. ఇలాంటి తరుణంలో ఈ షో గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ షోను ఆపేస్తున్నారంట. దానికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

స్టాండప్ కామెడీ షోగా తెలుగు వారికి పరిచయం అయిన పటాస్ వల్ల ఎంతో మంది పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారానే చాలా మంది కమెడియన్లు, స్క్రిప్ట్ రైటర్లు, టెక్నీషియన్లు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ షో ద్వారానే పలువురు యాంకర్లు సైతం ఎంతో పాపులారిటీని దక్కించుకున్నారు. చిన్న షోగా వచ్చినప్పటికీ ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది పటాస్. ఈ షో సూపర్ హిట్ అవడం వెనుక ఓ ఇద్దరి పాత్ర ఉంది. వాళ్లే యాంకర్లు రవి, శ్రీముఖి. వీళ్లిద్దరూ యాంకర్లుగా పని చేసిన సమయంలోనే పటాస్ భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధించింది. దీంతో ఈ షో యూత్‌ తో పాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది.

యాంకర్లు రవి, శ్రీముఖి పటాస్‌ షోకు ఎంత ప్లస్ అయ్యారో.. అంతే స్థాయిలో మైనస్ కూడా అయ్యారు. షో జరుగుతున్న సమయంలో వీళ్లిద్దరూ వ్యవహరించిన తీరు.. చేసిన అతికి విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో పటాస్‌ను నిషేదించాలని చాలా మంది నిరసన కూడా తెలియజేశారు. అప్పుడు కూడా ఈ షో హాట్ టాపిక్ అయిపోయింది. పటాస్ విజయవంతంగా సాగుతున్న సమయంలో యాంకర్ శ్రీముఖి.. బిగ్ బాస్‌లో పాల్గొనేందుకు షో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె ఎప్పుడైతే వెళ్లిపోయిందో అప్పటి నుంచి షోకు స్పందన కరువైంది. శ్రీముఖి స్థానంలో మరో యాంకర్ వచ్చినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. దీంతో యాంకర్ రవి కూడా పటాస్ నుంచి బయటకు వచ్చేశాడు. విజయవంతమైన షోగా కితాబందుకున్న పటాస్.. త్వరలోనే కనుమరుగు కాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Image result for పటాస్ షో

చాలా కాలంగా తెలుగులో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వచ్చిన ఈ షో.. త్వరలోనే ఆగిపోతుందనే వార్త బుల్లితెర ప్రేక్షకుల్లో నిరాశను కలిగిస్తోంది. దీంతో పటాస్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. పటాస్ ప్రసారం ఆగిపోతుందని ప్రచారం జరుగుతున్న సమయంలోనే దానికి గల కారణాలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో యాంకర్లు శ్రీముఖి, రవి తప్పుకోవడంతో పాటు, కొత్త కమెడియన్లను తీసుకు రావడంతో షో పట్ల జనాల్లో ఆసక్తి తగ్గిపోయిందని, అందుకే టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయిందని తెలుస్తోంది. ఈ కారణంగానే పటాస్‌ ప్రసారాన్ని నిలిపి వేస్తారని ప్రచారం జరుగుతోంది.

Content above bottom navigation