పిల్లలతో వెట్టిచాకిరీ చేయిస్తున్న యాంకర్ ..

107

పద్దెనిమిది ఏళ్ల వయసు లోపు పిల్లలతో పని చేయించుకుంటే చట్టపరంగా నేరం అన్న సంగతి అందరికి తెలిసిందే..దీనిని ప్రభుత్వం ఎప్పుడో తీసుకొచ్చింది. ఒకవేళ 18 ఏళ్లలోపు పిల్లలతో వెట్టి చాకిరి చేయించుకుంటే శిక్షలతో పాటుగా భారీ జరిమానాను కూడా చెల్లించుకోవాలి. ఇలా పిల్లలతో చాకిరీ చేయించుకుని జైలు పాలు అయినా వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ అన్నీ తెలిసిన ఓ తెలుగు ప్రముఖ యాంకర్ తన ఇంట్లో ఇద్దరు బాలికలను ఇంట్లో పనిలో పెట్టుకొని పని చేయించుకుంటుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

అభం శుభం తెలియని ఇద్దరు మైనర్ బాలికలతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న తెలుగు టీవీ యాంకర్‌ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా నూజివీడులోని చైల్డ్ కేర్‌లో చదువుకుంటున్న ఇద్దరు బాలికలను సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో తల్లి హైదరాబాద్ తీసుకెళ్లింది. ఆ తర్వాత తిరిగి పంపకుండా ఓ టీవీ యాంకర్ ఇంట్లో వారిద్దరిని పనికి కుదిర్చింది. పండగ సెలవులు ముగిసినా బాలికలు తిరిగి రాకపోవడం, తల్లికి ఫోన్ చేస్తే స్పందించకపోవంతో నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్నారు. పోలీసులు చైల్డ్ కేర్ కమిటీతో కలిసి హైదరాబాద్ వెళ్లి వారి తల్లిని విచారించగా ఓ యాంకర్ ఇంట్లో పనికి కుదిర్చినట్లు చెప్పింది. ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఆ యాంకర్ ఇంట్లో వెట్టిచాకిరీ చేయించుకునేవారని, బాడీ మసాజ్ లాంటి పనులు కూడా తమతో చేయించుకున్నారని తెలిపారు.

దీంతో రంగ ప్రవేశం చేసిన చైల్డ్ వెల్ఫీకేర్ సభ్యులు ఆ యాంకర్ పై కేసు నమోదు చేశారు. మైనర్లను పనిలో పెట్టుకోవడం, వెట్టిచాకిరి చేయించుకోవడం చట్టరీత్యా నేరమని యాంకర్‌ కు చెప్పిన పోలీసులు, వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆమెను విచారించగా నేనేం వాళ్ళను పనిలో పెట్టుకోలేదు. వాళ్ళ అమ్మనే డబ్బుల కోసం ఇక్కడ ఉంచింది. ఇప్పుడు తప్పు నాదంటే ఎలా. అవసరం ఉంది కాబట్టి వచ్చారు. అయినా నేను వాళ్ళతో వెట్టిచాకిరి ఏమి చేయించడం లేదంటూ వాళ్ళను ఎదురుగా పెట్టుకొని కల్లబొల్లి మాటలు చెప్పడం పై మండిపడ్డ అధికారులు నోటీసులు జారీ చేశారు..ఇంకొకసారి ఇలా చేస్తే కఠిన శిక్షలు వేసేలా కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు.

Content above bottom navigation