పూజా హెగ్డేకు కరోనా కష్టాలు..

135

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేస్తోంది. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడుతున్నాయి. కొవిడ్‌-19 లక్షణాలతో వచ్చే రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ప్రయాణాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో ఆటల పోటీలకే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలకూ బ్రేక్‌ పడింది. ఇప్పుడు సినిమా షూటింగ్ లకు విదేశాలకు వెళ్లినవాళ్లను కూడా కరోనా భయపెడుతుంది. టాలీవుడ్‌ హీరోయిన్ పూజా హెగ్డే ను కరోనా భయపెట్టింది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం పూజ హెగ్డే స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రభాస్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. అక్కడ కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉండటంతో సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టేశారు. ప్రభాస్ కూడా ఇప్పటికే అక్కడికి వెళ్లిపోయారు. అక్కడే ప్రభాస్ – పూజా హెగ్డే కాంబినేషన్ సీన్స్ చేయాల్సి ఉంది. దీని కోసం ఇండియా నుంచి పూజా హెగ్డే బయలుదేరి వెళ్లారు. అయితే ఆమె టర్కీలోని ఇస్తాంబుల్ మీదుగా జార్జియా వెళ్లారు. ఇస్తాంబుల్ న్యూ ఎయిర్‌పోర్ట్‌లో తీసుకున్న ఫొటోను పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పూజా.. ముఖానికి మాస్క్, చేతులకు గ్లోవ్స్ వేసుకుని ఉన్నారు. దీనికి కారణం కరోనా వైరస్ భయం.

ప్రస్తుతం యూరప్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందుకే, రక్షణ చర్యల్లో భాగంగా పూజా హెగ్డే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. స్వెట్ జాకెట్, వైట్ షూస్ వేసుకుని ఎయిర్‌పోర్ట్‌ లో పూజా హెగ్డే ధీనంగా చూస్తోన్న ఈ ఫొటో చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘ పూజకు ఎన్ని కష్టాలొచ్చాయి’ కామెంట్స్ పెడుతున్నారు.. ఇదిలా ఉంటే.. టర్కీతో పోలిస్తే జార్జియాలో కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. టర్కీలో ఇప్పటి వరకు రెండు కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జార్జియాలో 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు అక్కడే ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే జార్జియాలో ఏ నగరంలో షూటింగ్ జరుగుతోందనే విషయంపై స్పష్టత లేదు.

Image result for పూజా హెగ్డేకు కరోనా కష్టాలు..

ఇక పూజా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఒకటి అక్కినేని అఖిల్‌తో చేస్తోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాగా, మరొకటి రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేస్తోన్న సినిమా. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా షూటింగ్‌ ను పూజా హెగ్డే ఎప్పుడో పూర్తి చేసేశారు. ఇప్పుడు ఆమె చేతిలో ప్రభాస్ సినిమా ఒక్కటే ఉంది. ఈ సినిమాకు సినిమాకు ‘జాన్’ అనే టైటిల్‌ను పరిశీలించారు. ఇప్పుడు ‘ఓ డియర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.

Content above bottom navigation