ప్రభాస్ జీవితంలో విషాదకరమైన ఘటన ఇదే..

56

ఆరు అడుగుల అందగాడు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న వ్యక్తి. ఎన్నో అవార్డులు పొందాడు.. ఎన్నో సినిమాలు ప్లాప్ అయ్యాయి.. కొన్ని సినిమాలే హిట్ అయ్యాయి. సినిమా ప్లాప్ అయినా కూడా ప్రతి సినిమాకు ఆయనకు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. అంతటి అభిమానాన్ని ప్రభాస్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్రభాస్ కు అభిమానులు కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు.. ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అంతటి స్టార్ హీరో ప్రభాస్. మిర్చి సూపర్ హిట్ సినిమా అయితే అంతకు మించిన సినిమా బాహుబలి. ఈ బాహుబలి సినిమా ప్రభాస్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పవచ్చు.. బాహుబలి 2 ప్రపంచ రికార్డులను తిరగరాసింది.. అంతటి ఘన విజయం సాధించిన ప్రభాస్ నెక్స్ట్ చిత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని అభిమానులు అంత భావించారు. కానీ అలా అవ్వలేదు, సాహూ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు భారీ షాక్ తగిలింది. సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది.

Image result for prabhas bahuali

అయితే ఆ భాద నుండి బయట పడ్డ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ జీవితం అత్యంత దారుణమైన విషాదకరమైన ఘటన బయటపడింది. ఆ విషాదకరమైన ఘటన ఏంటి అంటే? ప్రభాస్ తండ్రి మరణం. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ టాలీవుడ్ లో వెరీ డైనమిక్ ప్రొడ్యూసర్. అన్నయ్య కృష్ణంరాజుకు చేదుడు వాదోడుగా ఉంటూ గోపీకృష్ణ మూవీస్‌ను ఆయన హ్యాండిల్ చేశారు. అలాగే కొడుకు భవిష్యత్ కోసం ఎంతాగానమో వెంపర్లాడేవాడు. అలాంటి సూర్యనారాయణ అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ 2010 ఫిబ్రవరి 12 న మరణించారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని భార్య శివ కుమారి కూడా అస్వస్ధతకు గురయ్యారు. దీంతో ఒక వైపు తండ్రి మరణం, మరోవైపు తల్లి అనారోగ్యం పాలవ్వడంతో ప్రభాస్ విషాదంలో మునిగిపోయాడు.

Image result for prabhas father

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ మహారాజు పాత్రలో నటించాడు. మహారాజుగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రభాస్‌ ను ఆదరించారు. కానీ చనిపోయిన ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు మాత్రం ప్రభాస్‌ను మహారాజు పాత్రలో నటిస్తే చూడాలనే కోరిక ఉండేది. కానీ ఆయన బతికున్నప్పుడు అలంటి పాత్ర ప్రభాస్ కు రాలేదు. అయన చనిపోయిన తర్వాత రాజు పాత్ర ప్రభాస్ కు వచ్చింది. అలా రాజుగా చూడాలనుకున్న సూర్యనారాయణ, ఆ కోరిక తీరకుండానే ఈ లోకం విడిచివెళ్లిపోయారు. కానీ ఆ చనిపోయిన తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ మహారాజు పాత్ర పోషించి తన తండ్రి చివరి కోరికను నెరవేర్చాడు. ఇలా తండ్రి మరణం ప్రభాస్ జీవితంలోనే అత్యంత విషాదకరమైన ఘటనట. ఇక ఈ ఘటన నుంచి చాలా రోజుల వరకు ప్రభాస్ కోలుకోలేకపోయాడు. సినిమా సెలెక్షన్స్ లలో కూడా కొంచెం తేడా రావడంతో అప్పట్లో ప్లాప్ సినిమాలు కూడా పలకరించాయి. కానీ మెల్లిగా తేరుకొని మళ్ళి కెరీర్ మీద కాన్సంట్రేట్ చేసి హిట్ సినిమాలలో నటించాడు.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation