ప్రేమికులరోజు స్పెషల్.. టాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న జంటలు

ఫిబ్రవరి 14…ప్రేమికుల దినోత్సవం….అంటే యువ ప్రపంచానికి పండగే. వాలంటైన్స్ డే ప్రేమను పంచేరోజు. పెళ్ళికి పునాది ప్రేమ. సామాన్యుల్లానే సెలెబ్రెటీలకు కూడా ప్రేమ కథలు ఉన్నాయి. కొందరు అయితే ప్రేమ పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన ప్రేమ పెళ్లిళ్లు చాలానే ఉన్నాయి. అలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for tollywood love marriages

హీరో కృష్ణ, విజయనిర్మల : సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ కమ్ హీరోయిన్ అయినా విజయ నిర్మల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరికీ అంతముందే వేరే వాళ్ళతో పెళ్ళైన కూడా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అక్కినేని నాగార్జున అమల : శివ సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే అప్పటికే నాగార్జునకు దగ్గుబాటి లక్ష్మితో పెళ్లయింది. వీరికి ఒక కొడుకు నాగచైతన్య కూడా ఉన్నాడు. అయితే కొన్ని పరిస్థితుల వలన ఇద్దరి మధ్య విభేదాలు రావడం, విడాకులు తీసుకోవడం, తర్వాత అమలను నాగార్జున పెళ్లి చేసుకున్నాడు.
అల్లుఅర్జున్, స్నేహారెడ్డి : టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన క్లాస్ మేట్ అయిన స్నేహారెడ్డిని ప్రేమించాడు. ఇంట్లో వీరి ప్రేమకథను చెప్పడంతో పచ్చజెండా ఊపారు. పెద్దల సమక్షంలో ప్రేమపెళ్లి చేసుకున్నాడు.
రాంచరణ్ తేజ, ఉపాసన : మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ఈయన తన బాల్యస్నేహితురాలు అయినా కామినేని ఉపాసనను ప్రేమించి జూన్ 14, 2012లో వివాహం చేసుకున్నాడు.
మహేష్ బాబు, నమ్రత : టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మాజీ ఫెమినా మిస్ ఇండియా అయినా నమ్రతను వంశీ సినిమా టైమ్ లో ప్రేమించాడు. పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా అందరిని ఎదిరించి 2005లో పెళ్లి చేసుకున్నాడు.
సమంత నాగచైతన్య : టాలీవుడ్ లో క్యూట్ కపుల్ ఎవరు అంటే ముందు గుర్తుకువచ్చే జంట వీళ్ళే. ఏ మాయ చేశావే సమయంలో మొదలైన వీరి ప్రేమకథ మనం సినిమా టైమ్ వరకు నడిచింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడంతో అందరి సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి జరిగింది.

Image result for tollywood love marriages

వీళ్ళ కాకుండా టాలీవుడ్ లో ఇంకా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. హీరో శ్రీకాంత్, ఊహలది కూడా ప్రేమ పెళ్లినే. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది.. దివంగత సినీనటుడు శ్రీహరి డిస్కోశాంతిలది కూడా ప్రేమ పెళ్లి. తమిళ నటుడు సూర్య, నటి జ్యోతికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు నటుడు గౌతమ్, కెమెరామెన్ శ్రీనివాస్‌రెడ్డి కుమార్తె జ్యోత్సను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హీరో నాని విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అంజనతో 2012లో ప్రేమపెళ్లి జరిగింది. మంచు విష్ణు వైఎస్ రాజశేఖరరెడ్డి మేనకోడలు విరోనికా రెడ్డిని 2009లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. తమిళ ఇండస్ట్రీలో అజిత్, షాలినిలది కూడా విజయవంతమైన ప్రేమ వివాహం. ఈ జంట ఎంతోమందికి ఆదర్శం. ఇక సింగర్స్ హేమచంద్ర శ్రావణ భార్గవిలది ప్రేమ పెళ్లి. అలాగే సింగర్ గీతామాధురి, నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలా చెప్పుకుంటూపోతే టాలీవుడ్ లో చాలా సక్సెస్ ఫుల్ ప్రేమకథలు ఉన్నాయి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation