బిగ్ బాస్‌ 4 కు కొత్త హోస్ట్.. కంటిస్టెంట్స్ వీళ్ళే..

111

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ షో తెలుగులోకి ప్రవేశించి ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. మొదటి సీజన్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించగా… రెండో సీజన్‌కు నాని, మూడవ సీజన్ కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించాడు. త్వ‌ర‌లోనే నాల్గవ సీజ‌న్ మొద‌లు కాబోతోంది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ బాధ్యతను ఎవరు తీసుకోబోతున్నారు అన్న అనుమానం తెలుగు ప్రేక్షకుల్లో కలుగుతోంది. అదే సమయంలో దీనికి సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే బిగ్ బాస్ సీజన్ 4 ను త్వరలో స్టార్ట్ చేయనున్నారని, దీనికి ఒక సూపర్ స్టార్ ను హోస్ట్ గా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారంట. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో క్లారిటీ లేకపోయినా.. హోస్ట్ విషయంలో మాత్రం పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి రంగంలోకి దింపబోతున్నారని ఆ మధ్య ఓ న్యూస్ ప్రచారం అయింది. ఇందుకోసం అతడికి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అన్నారు. అయితే, ఈ విషయం క్లారిటీ మాత్రం రాలేదు. బిగ్ బాస్ – 4 హోస్ట్ గురించి తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం… రాబోయే సీజన్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబు హోస్ట్ చేయబోతున్నాడట. ఇందుకోసం స్టార్ మా యాజమాన్యం అతడితో భారీ డీల్ కుదుర్చుకుందని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఎవరూ తీసుకోనంత అమౌంట్ మహేశ్ తీసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎవరు బిగ్ బాస్ సీజన్ 4 ను హోస్ట్ చేస్తారో.. అలాగే కంటిస్టెంట్స్ వీళ్ళే అని కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..

  • సుడిగాలి సుదీర్ : బుల్లితెర మీద ఇప్పుడు సుదీర్ హవా నడుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జబర్దస్త్, ఢీ, పోరాపోవే లాంటి షోలతో దుమ్ములేపుతున్నాడు. అందుకే ఎలాగైనా సుదీర్ ను బిగ్ బాస్ హౌజ్ కు షోకు క్రేజ్ తీసుకురావాలని బిగ్ బాస్ యాజమాన్యం అనుకుంటుంది. అందుకే అతనితో సంప్రదింపులు జరుపుతుంది.
  • హేమచంద్ర : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య గాయకుడు మరియు ఒక సంగీత దర్శకుడు. ఇతను హైదరాబాద్ కు చెందిన వ్యక్తి, ఇతను 2005 లో జరిగిన “స రి గ మ ప” పాట ల పోటీలో రెండవ రన్నరప్ గా నిలిచాడు.
  • రఘు మాస్టర్ : ప్రస్తుతం టాలీవుడ్లో టాపులో కొనసాగుతున్న కొరియోగ్రాఫర్లలో రఘు మాస్టర్ ఒకరు. ఆర్య2 సినిమా తర్వాత కొరియోగ్రాఫర్ గా పాపులర్ అయిన రఘు మిర్చి, జిల్, అఖిల్ తో పాటు అనేక చిత్రాలకు పని చేసారు.
  • గాయత్రి గుప్తా : ఫిదా సినిమాతో తెలుగు సినీ జ‌నాల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ హాట్ భామ‌. కెరియ‌ర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల కోసం నానా క‌ష్టాలుప‌డ్డ ఈ భామ.. ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ర్టీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.
  • ఉదయభాను : యాంకర్ గా ఇప్పుడొస్తున్న బుల్లితెర భామలందరికి ఉదయభాను స్పూర్తిదాయకం. ఓ పక్క సీనియర్ యాంకర్లు సుమ, ఝాన్సిలు అప్పుడు మంచి ఫాంలో ఉన్నా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ యాంకరింగ్ కే ఓ హాట్ ఇమేజ్ తెచ్చిన వ్యాఖ్యాత ఉదయభాను.
  • జబర్దస్త్ నరేష్ : బుల్లితెర కమెడియన్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ లో ప్రేక్షకులను ఎక్కువగా ఇష్టపడే నటులలో నరేష్ కూడా ఒకరు సందేహం లేదు. కామెడీ పంచులు, అల్లరి చేష్టలతో నరేష్ ఆడియన్ బాగా ఆకట్టుకుంటున్నాడు.
Image result for బిగ్ బాస్‌ 4 కు కొత్త హోస్ట్.
  • జాకీ : నటుడిగా జాకీకి మంచి గుర్తింపు వుంది. ముఖ్యంగా ఆయన బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు చాలా బాగా తెలుసు…తెలుగు లో వచ్చే చాలా సిరియల్స్ లో నటిస్తున్నాడు .
  • అపూర్వ : తన అందచందాలతో టాలీవుడ్ లో ఎన్నో క్యారెక్టర్స్ లలో నటించి మెప్పించిన అపూర్వ కూడా ఒక కంటిస్టెంట్ గా వెళ్లనుంది.
  • తాగుబోతు రమేష్ : టాలీవుడ్ లో కమిడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు తాగుబోతు రమేష్. అయితే ప్రస్తుతం అంతలా సినీ అవకాశాలు లేవు. అందుకే బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లి మళ్ళి పేరు తెచ్చుకొని సినీ అవకాశాలు పొందాలని అనుకుంటున్నాడు.

ఇలా బిగ్ బాస్ 4 కు సంబంధించి కొంతమంది పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిలో అందరు కాకపోయినా కొందరైనా వస్తారని అనుకుంటున్నారు. చూడాలి మరి ఎవరెవరు బిగ్ బాస్ 4 హౌస్ లో అడుగుపెడతారో. అలాగే ఎవరిని హోస్ట్ గా తీసుకొస్తారో..

Content above bottom navigation