బుల్లితెర ప్రియులకు బ్యాడ్ న్యూస్.. జబర్ధస్త్, అదిరింది సహా అన్ని సీరియల్స్‌ కు బ్రేక్..

తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చేది అంటే బుల్లితెర అనే చెప్పాలి. ప్రతి రోజు సీరియల్స్, పోగ్రామ్స్ లతో ఇంట్లో ఉండేవాళ్ళను సంతోషపెడుతుంది. ప్రతి రోజు ఏదో ఒక పోగ్రామ్ వస్తూనే ఉంటుంది. తెలుగు బుల్లితెరపై ఎన్నో కామెడీ షోలు ఉన్నాయి. వాటిలో బాగా ఫెమస్ అయినా షోలు చాలా ఉన్నాయి.. అలాంటి షోలలో జబర్ధస్త్, పటాస్, పోవే పోరా, ఢీ, అదిరింది సహా మరికొన్ని ఉన్నాయి. అలాగే ప్రతిరోజు మహిళలను కట్టిపడేసే సీరియల్స్ ఉన్నాయి. కార్తీకదీపం, కోయిలమ్మ, ఆమెకథ..లాంటి సీరియల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడా షోలు, సీరియల్స్ అన్నీ కూడా ఆగిపోనున్నాయి. ఈ న్యూస్ బుల్లితెర ప్రేక్షకులను షాక్‌ కు గురి చేస్తోంది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

తెలుగులో బుల్లితెరపై వస్తున్న కామెడీ షోలు చాలానే ఉన్నాయి. వాటిలో జబర్ధస్త్, అదిరింది, పటాస్, పోవే పోరా, ఢీ సహా మరికొన్ని షోలు కామెడీ ప్రధానంగానే రూపొందుతున్నాయి. ఈ షోలన్నింటికీ భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. వారంలో ఒకటి, రెండు రోజులు ప్రసారం అయ్యే ఈ షోలు చాలా రోజులుగా విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న జబర్ధస్త్‌కు పోటీగా ఇటీవల ‘అదిరింది’ అనే షో వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెగా బ్రదర్ నాగబాబు సహా చాలా మంది జబర్ధస్త్ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. దీంతో ఈ రెండు షోల మధ్య పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రెండు షోల నిర్వహకులు సరికొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నారు.

కొద్ది రోజులుగా భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకుని టీవీ సీరియల్స్, గేమ్ షోస్, వెబ్ సిరీస్ షూటింగ్స్ నిలిపివేయాలని తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ నెల 31 వరకు వీళ్లంతా షూటింగులకు దూరంగా ఉండనున్నారు.దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ బంద్ కానున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. రెండు వారాలకు ఒకసారి షెడ్యూల్ జరుపుకునే జబర్ధస్త్, అదిరింది, పటాస్, పోవే పోరాతో పాటు మరికొన్ని షోలు ఆగిపోనున్నాయట. అయితే, ఇది ఒకటి రెండు ఎపిసోడ్స్‌కు మాత్రమే ఇబ్బందిగా మారుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. వాస్తవానికి టీవీ సీరియళ్ల విషయంలో ఇది పెద్ద ఇబ్బందే కాదు.

Image result for బుల్లితెర  బ్యాడ్ న్యూస్

అయితే, కొత్తగా ప్రసారం అవుతున్న వాటికి మాత్రం కష్టాలు తప్పవట. అలాగే, లీడ్ యాక్టర్లు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. ఇలా జరగడం వల్ల కొన్ని సీరియళ్ల ప్రసారాలు తాత్కాలికంగా ఆగిపోయే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్ ప్రపంచం మొత్తం ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులకు సైతం ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌తో పాటు టెక్నీషియన్లు షూటింగులకు విరామం ప్రకటించారు. అంతేకాదు, సినిమా హాళ్లు కూడా మూత పడ్డాయి. ఈ నెల 31 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Content above bottom navigation