మహేష్ బాబు వంశీ పైడిపల్లికి మధ్య పెద్ద గొడవ..అందుకే సినిమా క్యాన్సిల్ అయ్యింది.. ఏమైందో తెలిస్తే షాక్ ..

198

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రావాల్సిన సినిమా ఆగిపోయినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని కొంత మంది వాయిదా అంటుంటే.. మరికొందరు రద్దు అని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రద్దు అయ్యింది. అయితే ఈ సినిమా ఆగిపోడానికి కారణం మహేష్ బాబుకు, వంశీ పైడిపల్లికి మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏమైందో ఇప్పుడు పూర్తీగా తెలుసుకుందాం.

స్టార్ హీరోలతో అనుకున్న ప్రాజెక్టులు ఒక్కోసారి చేతులు మారుతుంటాయి. లేదంటే రద్దవుతాయి. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. స్క్రిప్ట్ నచ్చకపోవచ్చు, రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావొచ్చు, లేదంటే హీరో మనసు మార్చుకోవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా విషయంలో మాత్రం స్క్రిప్ట్ కీలక పాత్ర పోషించిందని, గత రెండు రోజులుగా ఇండస్ట్రీలో వినిపిస్తోన్న టాక్. వంశీ పైడిపల్లి సిద్ధం చేసిన స్క్రిప్ట్ మహేష్ బాబుకు నచ్చలేదని.. దీంతో మరో స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి వంశీ రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ప్రస్తుతానికి మహేష్.. వంశీ ప్రాజెక్ట్‌ ను రద్దు చేసుకుని వేరే దర్శకుడితో సినిమా చేయబోతున్నారని కూడా అన్నారు. అయితే ఈ వార్తలు వంశీ పైడిపల్లిని బాధించాయట. నిజానికి మహేష్ బాబు స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పినా వంశీ ఏమీ బాధపడలేదట. మరో స్క్రిప్ట్ సిద్ధం చేస్తాను.. ఈలోపల వేరే కథలు వినండి అని ఆయనే స్వయంగా సలహా ఇచ్చారట. కానీ, మీడియాలో వచ్చిన కథనాలు చూసి వంశీ బాధపడుతున్నారని సమాచారం.

Image result for mahesh babu vamshi paidipally

ఎందుకంటే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి మధ్య మంచి స్నేహం ఉంది. ఇరు కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉంటాయి. ‘మహర్షి’ సినిమా సమయంలో వారి సాన్నిహిత్యం ఎలా ఉంటుందో చూశాం. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కుమార్తెలు సితార, ఆద్య కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు కూడా వంశీ ఫ్యామిలీతో కలిసి మహేష్ కుటుంబం సెలబ్రేట్ చేసుకుంది. వీరంతా కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. మరి ఇంతలా మహేష్ బాబుకు కనెక్ట్ అయిపోయిన వంశీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడం, దీనిపై మీడియాలో రకరకాల వార్తలు రావడంతో బాగా కలతచెందుతున్నారట. మరోవైపు, ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త వెంటనే మీడియాలో వచ్చేయడం వెనుక మహేష్ టీమ్ హస్తం ఉందని కూడా వంశీ భావిస్తున్నారట. మహేష్ టీమ్ కావాలనే ఈ వార్తను ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుందని వంశీకి తెలిసింది. ఈ విషయం మహేష్ బాబుకు తెలిసినా కూడా అయన తన టీమ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈ విషయం మీద మహేష్ ను నిలదీశాడంట వంశీ పైడిపల్లి. అయినా కూడా మహేష్ పెద్దగా స్పందించలేదంట. ఇది తనకు జరిగిన అవమానమని ఆయన బాధపడుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ‘మహర్షి’ సినిమా సమయంలోనే వంశీపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాను మరింత ఎంటర్‌ టైనింగ్ తీయాల్సిందని అన్నారు. అలాంటిది, ఇప్పుడు వంశీ స్క్రిప్ట్ మహేష్‌ కు నచ్చలేదంటే ఆయన ఎలాంటి స్క్రిప్ట్‌ను తీసుకెళ్లారో అనే విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు అవకాశం ఇచ్చినప్పుడు సరైన స్క్రిప్ట్ తయారుచేసి తీసుకెళ్లాలి కదా అనేవారు కూడా ఉన్నారు.

Content above bottom navigation