యాంకర్స్ లలో ఎవరి ఆస్తి ఎంత? ఎన్ని కోట్లు సంపాదించారు?

238

యాంకరింగ్ అనేది అంత తేలికైన విషయం కాదని మన అందరికి తెలుసు. బాష మంచిగా వచ్చి ఉండాలి. సమయానికి తగ్గట్టు మాట్లాడుతూ జనాలను మాటలతోనే కట్టిపడెయ్యాలి. అప్పుడే వారి యాంకరింగ్ కు పేరు వస్తుంది. తెలుగు టెలివిజన్ తెర గురించి మాట్లాడాలంటే చాలామంది యాంకర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ వీరిలో కొందరు మాత్రమే మంచి పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న యాంకర్స్ లలో సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్లకు సెపరేట్ ఫాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే ఇంత పేరు ఉన్న వీళ్ళు ఎంత సంపాదిస్తారో మీకు తెలుసా? వీళ్ళు కూడబెట్టిన ఆస్తిపాస్తుల వివరాలు మీకు తెలుసా? ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి. యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది.. సుమ చేతిలో దాదాపు డజన్ కు పైగా షోస్ ఉన్నాయి. ప్రతి రోజు 18 గంటలు షూటింగ్స్ తోనే గడుపుతుంది. క్యాష్ , స్టార్ మహిళ, పంచావతారం, సూపర్ సింగర్, అవాక్కయ్యారా?, జీన్స్, భలే చాన్సులే, పట్టుకొంటే పట్టుచీర, లక్కు కిక్కు..ఇలా ఎన్నో షోలకు యాంకరింగ్ చేసింది. ప్రస్తుతం వీటిలో కొన్ని షోలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి సుమ సంపాదన విషయానికి వస్తే…

Image result for anchor suma

సుమ ఒక హీరోయిన్ ఎంత సంపాదిస్తుందో అంత సంపాదిస్తుంది. ఒక్కొక్క పోగ్రామ్ కు లక్ష రూపాయల వరకు తీసుకుంటుంది. అలాగే సినిమా ఈవెంట్స్ అయితే ఒక్క రోజుకు ఏకంగా 3 లక్షల వరకు తీసుకుంటుంది. నెలకు 25 రోజులు షూటింగ్స్ లలో పాల్గొంటూనే ఉంటుంది. నెలకు దగ్గర దగ్గర 50 లక్షల వరకు వెనుకేస్తుంది. సుమకు ఒక నిర్మాణ సంస్థ కూడా ఉంది. జీ తెలుగులో ఒక పోగ్రామ్ కు నిర్మాతగా వ్యవహరించింది. ఇక సుమ ఆస్తిపాస్తుల విషయానికి వస్తే, సుమ ఈ మధ్యనే జూబ్లీహిల్స్ లో ఒక ఇంటిని కొనుగోలు చేసింది. ఆ ఇంటి విలువ దాదాపు 5 కోట్లు అని తెలుస్తుంది .అలాగే రాజీవ్ కనకాలకు తండ్రి నుంచి వచ్చిన ఇల్లు బోరబండలో ఉంది. అలాగే సుమ పేరిట శంషాబాద్ ఏరియాలో దాదాపు 5 ఎకరాల స్థలం ఉంది. దీని విలువ కోట్లలో ఉంటుంది. ఇక కేరళలో కూడా సుమకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. వారసత్వంగా వచ్చిన కొంత భూమి అక్కడ ఉన్నట్టు సమాచారం. ఇక సుమకు పలు బ్రాండ్స్ కు సంబందించిన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆడి కంపెనీకి చెందిన 80 లక్షల కారు, స్కోడా కంపెనీకి చెందిన 30 లక్షల కారు సుమకు ఉన్నాయి. ఇవే కాకుండా రాజీవ్ కనకాలకు భారీ ఆస్తులే ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే సుమ దాదాపు 50 కోట్లకు అధిపతి అని తెలుస్తుంది.

ఇక యాంకర్స్ లలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే యాంకర్ అనసూయ గురించి ప్రస్తావించాలి. అనసూయ కూడా హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని రేంజ్ లో సంపాదిస్తుంది. అనసూయ చేతిలో ఇప్పుడు దాదాపు 6 పోగ్రామ్స్ నడుస్తున్నాయి. వీటిలో రెండు షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఒక్కసారి అనసూయ సంపాదన విషయానికి వస్తే…

Image result for anchor anasuya

ఈటీవీ జబర్దస్త్‌తో పాటు మా టీవీలో ఓ షో.. జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్.. ఇప్పుడు జెమినీలో కొత్తగా తల్లా పెళ్లామా అనే షో కూడా చేస్తుంది. వీటితో పాటు సినిమాలు కూడా ఉన్నాయి. అనసూయ ఒక్క షోకు యాంకరింగ్ కోసం 3 లక్షలకు పైగానే తీసుకుంటుంది. ఇక జడ్జిగా 5 లక్షల వరకు తీసుకుంటుంది. ఇక అనసూయ చాలా సినిమాల్లో నటిస్తుంది. రంగస్థలం, క్షణం సినిమాలతో ఆమెకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా రంగస్థలం తర్వాత అనసూయ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఈమె ఒక్కొక్క సినిమాకు 30 లక్షల వరకు తీసుకుంటుంది. ఇక యాంకరింగ్, జడ్జిగా నెలకు దాదాపు 30 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈమె నెలకు అటుఇటుగా 3 కోట్ల వరకు సంపాదిస్తుంది. ఇక అనసూయ కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే.. అనసూయకు జూబ్లీహిల్స్ లో 5 కోట్ల విలువ చేసే ఒక లగ్జరీ ఇల్లు ఉంది. అలాగే ఈమె ఈ మధ్యనే ఆడి క్యూ7 కారు కొన్నది .దీని విలువ కోటి రూపాయలు. ఈ కారు కాకుండా అనసూయకు 30 లక్షలు విలువ చేసే డస్టర్ కారు ఉంది. అలాగే అనసూయకు వికారాబాద్ ఏరియా సైడ్ 2 ఎకరాల పొలం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే అనసూయ సొంత గ్రామం అయినా నల్గొండ జిల్లా పోచంపల్లి వద్ద 10 ఎకరాల స్థలం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈమె భర్త భరద్వాజ్ కూడా నెలకు దాదాపు 25 లక్షల వరకు సంపాదిస్తాడంట. ఈ లెక్కన చుస్తే అనసూయకు దాదాపుగా 30 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక యాంకర్స్ లలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే యాంకర్ రష్మీ గురించి ప్రస్తావించాలి. రష్మీకి కూడా హీరోయిన్ కు ఉన్న ఫాలోయింగ్ ఉంది. ఈమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఈవెంట్స్ కు తోడు ఓపెనింగ్స్ తోనూ సంద‌డి చేస్తుంటుంది ర‌ష్మి. రష్మీ చేతిలో ఈటీవీ జబర్దస్త్ తో పాటు ఢీ డాన్స్ షో ఉంది. ఇంతకముందు రగడ, సూపర్ కుటుంబం, ఐడియా సూపర్ లాంటి షోలకు యాంకరింగ్ చేసింది. ఇవేకాకుండా సినిమా ఫంక్షన్స్ కు, అవార్డ్స్ ఫంక్షన్స్ కు కూడా యాంకరింగ్ చేస్తుంది. అలాగే ఫెస్టివల్స్ సమయంలో ప్రైవేట్ పోగ్రామ్స్ చేస్తుంటుంది.

Image result for anchor rashmi

సినిమాల్లో నటించిన త‌ర్వాత ర‌ష్మి రేట్ కూడా డ‌బుల్ అయిపోయింది. రష్మీ సంపాదన విషయానికి వస్తే.. రష్మీ ఒక్కొక్క షోకు 2 లక్షల వరకు తీసుకుంటుంది. సినిమా ఫంక్షన్స్ కు అయితే 3 లక్షల వరకు తీసుకుంటుంది. అలాగే సినిమాకు 25 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక రష్మీ కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే.. రష్మీకి బంజారా హిల్స్ లో 2 కోట్ల విలువ చేసే ప్లాట్ ఉంది. ఇదే కాకుండా రష్మీకి 50 లక్షల విలువ చేసే టొయోటా కారు ఉంది. ఇదే కాకుండా రష్మీకి 20 లక్షల విలువ చేసే నిస్సాన్ కారు ఉంది. ఇక ఈ మధ్యనే రష్మీ 5 కోట్లు పెట్టి 100 ఎకరాల స్థలం కొన్నదంట. ఈ లెక్కన చుస్తే రష్మీకి దాదాపుగా 10 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక యాంకర్స్ లలో మరొకరి గురించి ప్రస్తావించాల్సి వస్తే యాంకర్ శ్రీముఖి గురించి ప్రస్తావించాలి. శ్రీముఖికి కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి కొన్ని సినిమాలో కూడా నటించింది. అలాగే అదుర్స్, సూపర్ సింగర్, భలే చాన్సులే, కామెడీ నైట్స్, జీ సరిగమప, పటాస్ లాంటి షోలకు యాంకరింగ్ చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొంది. మళ్ళి ఈ మధ్యనే కొన్ని కొత్త షోలు ప్రారంభించింది. శ్రీముఖి సంపాదన విషయానికి వస్తే..

Image result for srimukhi

శ్రీముఖి ఒక్కొక్క షోకు లక్ష వరకు తీసుకుంటుంది. అలాగే సినిమా ఫంక్షన్స్ అయితే 2 లక్షల వరకు తీసుకుంటుంది. ఇక సినిమాకు అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక్కొక్క సినిమాకు పాత్రను బట్టి 5 లక్షల వరకు తీసుకుంటుంది. ఇక సినిమాలో మెయిన్ పాత్ర అయితే దాదాపుగా 15 లక్షల వరకు తీసుకుంటుంది. ఇక శ్రీముఖి కూడబెట్టిన ఆస్తుల విషయానికి వస్తే..శ్రీముఖికి బంజారా హిల్స్ లో కోటి రూపాయలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలాగే ఆమె సొంత ఊరు అయినా నిజామాబాద్ లో 10 ఎకరాల పొలం ఉంది. దీని విలువ దగ్గర దగ్గర 3 కోట్ల వరకు ఉంది. ఇక బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో పాల్గొంది. ఈ షో నుంచి శ్రీముఖికి కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అందింది. ఇక శ్రీముఖి కార్ల విషయానికి వస్తే.. నిస్సాన్ కంపెనీకి చెందిన 25 లక్షల కారు, అలాగే మహేంద్ర కంపెనీకి చెందిన 15 లక్షల విలువ చేసే కారు ఉంది. ఓవరాలుగా శ్రీముఖికి ఉన్న ఆస్తుల విలువ చుస్తే దాదాపు 5 కోట్ల వరకు ఉంటుంది.

Content above bottom navigation