యాంకర్ మంగ్లీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు

58

ప్రస్తుతం తెలంగాణాలో ఏ పండుగను తీసుకున్నా ఆ పండుగకు ఒక వారం ముందే తన గొంతెసుకుని వస్తుంది. ప్రతి పండుగకు ప్రత్యేక పాటను పాడుతూ పల్లెటూరి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. చిన్నప్పుడు జానపద గీతాలు పాడి తరువాత చిన్న చిన్న పోగ్రామ్స్ ద్వారా ఆమె టాలెంట్ ను బయటపెట్టుకుంది. ఇప్పుడు స్టార్ సింగర్ గా అవతారం ఎత్తింది. ఆమె ఎవరో కాదు తీన్మార్ వార్తల ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయినా మంగ్లీ. అలాంటి మంగ్లీ జీవితం గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

రాయలసీమ అమ్మాయి, తెలంగాణ బుల్లి తెర అంటే మీకర్థం కాకపోవచ్చు కానీ మంగ్లీ అన్నా.. మాటకారి మంగ్లీ అన్నా, వి6 మంగ్లీ అన్నా, తీన్మార్ మంగ్లీ అన్నా టక్కున గుర్తు పడతారు కదా? ఆమెనే వి6 న్యూస్ చానెల్ లో తీన్మార్ వార్తల్లో తెలంగాణ భాష, యాసతో దుమ్మురేఫై, ఇప్పుడు సింగర్ గా, ఫ్రీ ల్యాండ్స్ యాంకర్ గా సత్తా చాటుతున్న అమ్మాయి. అంతగా తెలంగాణ భాష మాట్లాడుతుందంటే ఆమెది కచ్చితంగా తెలంగాణ అనుకుంటారు. కానీ ఆమె సిసలైన సీమ గిరిజన బిడ్డ. ఆమె అసలు పేరు మంగ్లి కాదు సత్యవతి. రాయలసీమ ఆడబిడ్డలు కూడా కొంచెం ప్రోత్సాహం అందిస్తే ఎంతవరకయిన పోతారు అనడానికి ఉదాహరణ బంజారా బిడ్డ సత్యవతి జీవితమే. జానపదాలకు పుట్టినిల్లు రాయలసీమ గడ్డ. సత్యవతి అనంతపురం జిల్లాలో బసినేపల్లె తాండ గుత్తి మండలంలో 10 జూన్ 1994 న జన్మించింది. ఐదో తరగతి వరకు బసినేపల్లి తాండలోనే చదివింది. 6 నుంచి 10 వరకు గుత్తి పట్టణంలో చదివింది. రాయలసీమ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్.డి.టి) చొరవతో సంగీతం, పాటలు పాడడం నేర్చుకుంది సత్యవతి. ఈ సంస్థ చొరవ ఆమెను ఎక్కడికో తీసుకువెళ్లిందని చెప్పాలి. ఆ సంస్థ ద్వారానే చదువుకొని పాటలు పాడటం నేర్చుకున్నది. తిరుపతి లోని సంగీత విద్యాలయం లో పూర్తి మెళకువలు నేర్చుకున్నది. జానపద గీతాలతో తన జీవితాన్ని ప్రారంభించిన మంగ్లీ v6 ఛానెల్ లో తీన్మార్ మంగ్లీ గా పరిచయం అయ్యింది. తెలంగాణ యాస, భాషతో తెలంగాణ ప్రజల మన్ననలు పొందింది.

Image result for mangli

అలా మొదలైన సాహిత్య ప్రయాణంలో ఆమె వెనుదిరిగి చూడలేదు. అచ్చమైన తెలంగాణ భాష నేర్చుకున్నది. అందమైన గొంతుతో పాటలు పాడడం, తెలంగాణ గిరిజన ఆడపిల్ల మాదరిగా మాట్లాడి తెలుగు వారందరినీ మెప్పిస్తున్నది. వి6 టివిలో వచ్చే తీన్మార్ వార్తల్లో తెలంగాణ భాషలో, యాషలో అదరగొట్టింది సత్యవతి. శశిరేఖా పరిణయం అనే సీరియల్ లో కూడా సత్యవతి నటించి మెప్పించింది. రాయలసీమలో పుట్టిన సత్యవతి తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిందంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సినిమాల్లో, ప్రైవేట్ లలో చాలా పాటలు పాడుతుంది. శైలజారెడ్డి అల్లుడులో పాడిన పాట, జార్జ్ రెడ్డి సినిమాలో పాడిన పాటలు చాలాపెద్ద హిట్ అయ్యాయి. అలాగే ప్రతి పండుగకు కూడా ఒక పాటను పాడి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మంగ్లీ పేరుప్రఖ్యాతలు తెచ్చుకుంది. చినప్పట్నుండే పేదరికం అనుభవించి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వార చదువుకొని మంగ్లి అలియాస్ సత్యవతి ఈ స్థాయికి రావడం నిజంగా రాయలసీమ వాళ్ళే కాదు తెలుగు ప్రజలంతా గర్వించదగిన విషయమే అంటున్నారు. రాయలసీమలో పుట్టిన సత్యవతి తెలంగాణలో అదరగొట్టింది. కానీ ఇక మీదట రాయలసీమ యాస, భాషలోనూ పాటలు పాడేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రాయలసీమ పాటలను సైతం మంగ్లీ నోట వినబోతున్నామని రాయలసీమ వాసులు సంబరపడుతున్నారు. మంగ్లీ ఇలాగె మరిన్ని పాటలు పాడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.

Content above bottom navigation