యాంకర్ రష్మీ గురించి బయటపడ్డ మరో సంచలన నిజం..జబర్దస్త్ కు వచ్చే ఒక్క రోజు ముందు ఏం జరిగిందంటే?

95

జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ జోడి, ఢీ 10 లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు రష్మీ గౌతమ్ యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బుల్లితెర మీదనే కాకుండా వెండితెర మీద కూడా రాణిస్తుంది. గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకొన్నారు. యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్న క్రేజ్ రష్మీకి ఉంది. ఆమె కోసం షో చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలోకి 2001 లోనే వచ్చిన రష్మీకి గుర్తింపు రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది. రష్మీ ఎక్కడ పుట్టింది.. సినిమాలలోకి ఎలా వచ్చింది. అసలు సినీమా అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు రష్మీ ఎన్ని ఇబ్బందులు పడింది. ఆ విషయాలన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రష్మీ కుటుంబ విషయానికి వస్తే రష్మి తల్లి ఒడిషా రాష్ట్రానికి చెందింది. తండ్రి ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడు. రష్మీ విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. అయితే రష్మీకి 12 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు. తల్లిదండ్రులు విడిపోయాక రష్మీ అమ్మమ్మ తాతయ్య దగ్గరే పెరిగింది. రష్మీ తండ్రి ఈ మధ్యనే చనిపోయారు. రశ్మితో పాటు పిన్ని కొడుకు కూతురు కూడా తాతయ్య అమ్మమ్మ దగ్గరే పెరిగారు. రష్మీకి చదువు అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదంట. ఎలాగోలా cbse లో పాఠశాల విద్యను పూర్తీ చేసింది. ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది. రష్మీకి ట్రావెలింగ్ చెయ్యడం ఇష్టం. కాలేజీలో కూడా అన్ని కల్చరర్ యాక్టివిటీస్ లో ముందు ఉండేదంటా. సినిమాలలోకి వెళ్లాలని రష్మీ చిన్నపాటి నుంచే అనుకునేదంట. డిగ్రీ కంప్లీట్ చేశాక 2001 లో ఒక్కతే హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అవకాశాల కోసం వచ్చి ఎన్నో అవమానాలు పడింది. ఆ తరువాత 2002 లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది. ఎప్పుడైనా షూటింగ్ రాత్రి లేట్ గా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్తే ఇంటి ఓనర్స్ డోర్ ఓపెన్ చేసేవారు కాదంట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడేవారంట. కొందరు అయితే సినిమాలలో నటించిన కూడా పేమెంట్స్ ఇచ్చేవారు కాదంట. అయితే ఎన్ని ఇబ్బందులు పడినా ఇంట్లో చెప్పేది కాదంట. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, బాగానే ఉన్నా అని చెప్పేదంట. ఒక పోగ్రామ్ చేసినందుకు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు 25 వేల రూపాయల చెక్ ఇచ్చారంట. అప్పుడు ఇంట్లో సామాన్లు కొనుక్కుని రెంట్ కట్టుకుందంట.

2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది. ఆ తరువాత ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత, కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి, తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక 2011 లో తన తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో, అలాగే సినిమా అవకాశాలు రాకపోవడంతో తిరిగి వైజాగ్ వెళ్లిపోయిందట. ఏమైనా జాబ్ చేద్దామని అనుకుందట. అయితే సరిగ్గా అప్పుడే జబర్దస్త్ టీమ్ వాళ్ళు రష్మీకి ఫోన్ చేసి యాంకరింగ్ చెయ్యమని చెప్పారంట. రష్మీకి ఆఫర్ ఎలా వచ్చిందంటే….అప్పటికే 13 ఎపిసోడ్స్ జరిగాయి. అయితే అప్పుడు అనసూయ ప్రెగ్నెంట్ తో ఉండడంతో రష్మిని సంప్రదించారట. అలా ఉహిచకుండా ఆఫర్ వచ్చింది. టీవీ రంగంలో ఉంటె సినిమా అవకాశాలు రావని తెలుసు. అయినా కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆ షో ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది. ఇక ఆ తరువాత జరిగినదంతా అందరికి తెలిసిందే. ఇప్పుడు రష్మీ తెలుగు బుల్లితెర మీద డిమాండ్ ఉన్న యాంకర్. రష్మీ జీవితం ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

Content above bottom navigation