రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్..

హీరోయిన్ అమలాపాల్ గురించి మనకు తెలుసు.మంచి నటిగా మన అందరికి అలరిస్తుంది.నటిగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలో అమలాపాల్ వివాహం చేసుకుంది. ఆ తరువాత వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమలాపాల్ బిజీ నటిగా కొనసాగుతోంది. అయితే గత కొంతకాలంగా అమలాపాల్ రెండవ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. కానీ వాటన్నిటిని అమలాపాల్ కొట్టేసింది. ఇప్పట్లో నా పెళ్లి లేదని చెప్పింది. కానీ ఇప్పుడే సడెన్ గా రెండవ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.

అమలాపాల్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబైకి చెందిన భవ్నిందర్ సింగ్‌ ను అమలాపాల్ పెళ్లి చేసుకుంది. అయితే, వీరి ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే విషయంలో స్పష్టత లేదు. ఫొటోలు చూస్తుంటే ఉత్తరభారత సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగినట్టు అర్థమవుతోంది. తాను మళ్లీ ప్రేమలో ఉన్నానని, నిజమైన ప్రేమను పొందుతున్నానని కిందటేడాది ‘ఆడాయి’ సినిమా ప్రమోషన్లలో అమలాపాల్ చెప్పారు. అయితే, తన బోయ్‌ఫ్రెండ్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. అయితే, ముంబైకి చెందిన సింగర్ భవ్నిందర్ సింగ్‌ తో అమలాపాల్ సహజీవనం చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. అమలాపాల్ బుర్ఖా ధరించి భవ్నిందర్ సింగ్‌తో బయటకు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, ఇప్పుడు వీరి పెళ్లి ఫొటోలు బయటికి రావడంతో అమలాపాల్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. అమలాపాల్‌ రహస్యంగా పెళ్లిచేసుకుంది అంటే నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమలాపాల్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. మనిషిలో ఉండే భావాలను తెలియజేసే ఒక పిట్టకథ చెప్పారు. ‘‘ఒక పెద్దాయన ఒక కుర్రాడితో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘నా లోపల ఎప్పుడూ రెండు తోడేళ్లు ఒకదానితో ఒకటి పోట్లాడుతూ ఉంటాయి. ఒక తోడేలు కోపం, అసహ్యం, అహం, ఈర్శ్య, అబద్దాలతో నిండిపోయి ఉంది. మరో తోడేలు ప్రేమ, ఆనందం, నిజం, శాంతిలతో నిండి ఉంది. ఈ రెండిటి మధ్య పోట్లాట అనేది నీ లోపల, మనుషుల అందరి లోపల జరుగుతుంది’. ఒక్క క్షణం ఆలోచించిన ఆ కుర్రాడు.. ‘ఏ తోడేలు గెలుస్తుంది?’ అని అడిగాడు. ‘నువ్వు దేన్ని జీర్ణించుకుంటే అది’ అని ఆ పెద్దాయన సమాధానం ఇచ్చాడు’’ అని అమలాపాల్ పోస్టులో పేర్కొన్నారు.

Image result for రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్

ఈ పోస్ట్ పెట్టిన తరవాతి రోజే అమలాపాల్ పెళ్లి ఫొటోలు బయటికి వచ్చాయి. అమలాపాల్ మొదట తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడారు. కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిన వీరు 2014 జూన్ 12న పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహ అనంతరం మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ లీగల్‌గా విడిపోవడానికి విడాకులకు దరఖాస్తు చేశారు. ఆరు నెలల జ్యుడీషియల్ సెపరేషన్ పీరియడ్‌లో భాగంగా 2016 ఆగస్ట్ నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉన్నారు. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ 2017 ఫిబ్రవరిలో విడాకులు మంజూరు చేసింది. విజయ్‌తో విడాకులు తీసుకున్న తరవాత అమలాపాల్ పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టారు. తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయారు. తెలుగులోనూ అడపాదడపా చిత్రాలు చేశారు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది.

Content above bottom navigation