రాత్రికి పార్టీ చేసుకుందాం రా.. అంటూ సుడిగాలి సుధీర్‌కి హాట్ యాంకర్ బంపర్ ఆఫర్..

133

జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుదీర్ ఒకడు. ఒక మెజీషియన్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత జబర్దస్త్ కు వచ్చి మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించటమే కాకుండా టివిలో అనేక షోస్ కి యాంకర్ గా పని చేస్తూ బయట ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. సుడిగాలి సుదీర్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నాడని చెప్పాలి. డబ్బు ముఖ్యం కాదు జనాలను ఎంటర్ టైన్ చెయ్యడమే ముఖ్యమని ఎంటర్ టైన్ చేసే ప్రతి షోకు వెళ్తాడు. జబర్దస్త్, ఢీ, పోరాపోవే షోలతో ఫ్యాన్ ఫాలోయింగ్ కు పెంచుకున్నాడు. దీంతో ఆడియన్స్ మాత్రమే కాదు యాంకర్స్ కూడా ఈ జబర్దస్త్ అందగాడు వెంటబడుతున్నారు. బుల్లితెరపై అతనిపై పంచేస్తూ, రొమాన్స్ చేస్తూ కిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ హాట్ యాంకర్ రాత్రంతా పార్టీ చేసుకుందాం రా.. అంటూ సుధీర్‌ని కాకాపట్టింది. దానికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

Image result for sudigali sudheer

ఎప్పుడైతే సుడిగాలి సుధీర్‌ బుల్లితెరపై అడుగుపెట్టాడో.. అప్పటి నుంచే ఇతగాడి రచ్చ మొదలైంది. తనదైన కామెడీ టైమింగ్‌తో జబర్దస్త్ పంచులేస్తూ అమ్మాయిల గుండెల్లో గుణపాలు దింపడం ఈ కుర్రోడికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే బుల్లితెర నటీనటులందరిలో అందరిలో ఎక్కువ రచ్చ చేసే పోరాడిగా సుడిగాలి సుధీర్ పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతే యాంకర్ రష్మీతో సుడిగాలి సుధీర్ రొమాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఈ జోడీ కనిపిస్తే చాలు ఆ ఊపే వేరు.. వాళ్ళిద్దరి రొమాన్స్ ఇచ్చే కిక్కే వేరు. అందుకే ఈ ఇద్దరితో ప్రతీ పండగకు స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తూ హుషారెత్తిస్తుంటారు ప్రోగ్రామ్ నిర్వాహకులు. అయితే సుధీర్‌తో రష్మీ ఒక్కతే కాదు.. తాను కూడా రెచ్చిపోగలను అని నిరూపిస్తూ రంగం లోకి దిగింది మరో యాంకర్ విష్ణుప్రియ. పోవేపోరా కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ తో రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఈ ఫిబ్రవరి 15న ప్రసారం కాబోయే ఎపిసోడ్ కోసం సుధీర్‌తో డాన్స్ చేసిన యాంకర్ విష్ణుప్రియ.. రాత్రికి పార్టీకి రావాలంటూ ఆఫర్ చేసింది.

యాంకర్ విష్ణుప్రియ స్పెషల్ కిక్

అయితే అది నిజమైన పార్టీ కాదు లెండి!. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ”ఆజ్ మేరే ఘర్ మే పార్టీ హై తూ ఆజానా” అంటూ తమన్నా మహేష్ బాబుకు ఎలాంటి ఆఫర్ ఇచ్చిందో.. ఇప్పుడు యాంకర్ విష్ణుప్రియ కూడా సుడిగాలి సుధీర్ కి అదే ఆఫర్ చేసింది. తాజాగా విడుదలైన పోవేపోరా కొత్త ప్రోమాలో విష్ణుప్రియతో కలిసి రెచ్చిపోయి పర్ఫామ్ చేశాడు సుడిగాలి సుధీర్. ఇద్దరూ కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని డ్యాంగ్ డ్యాంగ్ పాటకు ఇరగదీసే స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ఇటీవలే సుడిగాలి సుధీర్ వెండితెరపై కాలుమోపి హీరో అవతారమెత్తిన సంగతి తెలిసిందే. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలతో వెండితెర గడప తొక్కిన సుధీర్.. ప్రస్తుతం ఇటు బుల్లితెర, అటు వెండితెరపై సత్తా చాటుతున్నాడు. సుదీర్ కెరీర్ ఇలాగె కొనసాగాలని కోరుకుందాం.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation