రామ్ చరణ్‌కు షాకిచ్చిన సొంత అక్క.. అల్లు అర్జున్‌కు ఓటు.

99

మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో చాలా మంది పెద్ద ఫ్యామిలీ అంటారు
టాలీవుడ్ లో చిరంజీవి వేసిన పూ బాట‌లో ఇప్ప‌టి మెగా హీరోలు ఎంద‌రో స్టార్ హీరోలు అయ్యారు
అందుకే చిత్ర సీమ‌కు మెగాస్టార్ గా చిరంజీవి అన్న‌య్య‌గానే ఉన్నారు.
అయితే వివాదాలకు దూరంగా – అంద‌రితో ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం మెగాస్టార్ స్ట‌యిల్
అయితే ఆయ‌న వార‌సులు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు
పెద్ద కూతురు సినిమారంగంలో ఉంటే కుమారుడు చ‌ర‌ణ్ కూడా నిర్మాత‌గా ప్ర‌ముఖ హీరోగా ఉన్నారు
ఈ స‌మ‌యంలో చెర్రీ అక్క త‌మ్ముడి గురించి కొన్నిఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పింది.
అవేంటో చూద్దామా లెట్స్ వాచ్ దిస్ వీడియో

శత్రువులు ఎక్కడో ఉండర్రా.. అక్కలు చెల్లెళ్ల రూపంలో మన చుట్టూనే తిరుగుతుంటారు అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆయన రాసింది సీరియస్ ఏమో కానీ ఇక్కడ మాత్రం రామ్ చరణ్‌ అక్క సుష్మిత ఆయనకు సూపర్ షాక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చరణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పింది చిరంజీవి పెద్ద కూతురు… తన వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాల గురించి కూడా చెప్పింది సుష్మిత కొణిదెల… ముఖ్యంగా తమ్ముడు చరణ్ ఇంట్లో ఎలా ఉంటాడో అనేది కూడా తెలిపింది ఈమె…. సుష్మిత సైరా నరసింహారెడ్డి సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా పనిచేసింది.

తాజాగా ఇంటర్వ్యూలో రామ్ చరణ్, బన్నీలలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటే మరో అనుమానం లేకుండా అల్లు అర్జున్ పేరు చెప్పింది సుష్మిత. బన్నీ, చరణ్‌ పేరు చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఈమె…. అల్లు అర్జున్ అద్భుతమైన డాన్సర్ అని.. చరణ్ కంటే బాగా చేస్తాడని చెప్పింది సుష్మిత. మెగా ఇంట్లో చిన్నప్పట్నుంచీ కూడా బన్నీ అన్ని ఈవెంట్స్‌లో పాల్గొనేవాడు. చిరంజీవి కూడా బన్నీ డాన్సుల గురించి గతంలో చెప్పాడు. ఇఫ్పుడు సుష్మిత కూడా ఇదే చెప్పింది. బన్నీ, చరణ్‌లలో కచ్చితంగా అల్లు అర్జున్ బెస్ట్ డాన్సర్ అని చెప్పింది కొణిదెల వారమ్మాయి..

Image result for sushmitha konidela

ఇదిలా ఉంటే గతంలో కూడా చరణ్, చిరు గొడవల గురించి కూడా చెప్పింది ఈమె…. సైరా విషయంలో మాత్రం చాలా మదనపడ్డానని చెబుతుంది. ముఖ్యంగా క్రియేటివ్ ఇగోలను తట్టుకుని.. తన మనసు చంపుకుని.. ఇష్టాన్ని కాదనుకుని మరీ పని చేసానని సంచలన నిజాలు చెప్పింది మెగా డాటర్….. వారంలో 15 కాస్ట్యూమ్స్ సిద్ధం చేయమన్నా కూడా రాత్రి పగలు కష్టపడుతూ తాను ఆపని చేయగలనని చెబుతుంది సుష్మిత…. అయితే సైరా విషయంలో మాత్రం అలా జరగలేదని.. తనకు ఎదురైన క్రియేటివ్ ఇగోలను హ్యాండిల్ చేయడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చింది ఈమె. తనకు నచ్చకపోయినా కూడా టీం కోసం సర్దుకుని పని చేసినపుడు కన్నీరు కూడా వచ్చేవని చెప్పింది సుష్మిత.

అంతేకాదు.. తండ్రీ కొడుకులుగా ఉన్నపుడు చిరంజీవి మాటలను జవదాటని రామ్ చరణ్.. నిర్మాతగా మాత్రం చండశాసనుడే అంటుంది ఈమె…. సైరా సినిమా విషయంలో చిరంజీవి, చరణ్ మధ్య చాలా సార్లు గొడవలయ్యాయని.. ఏకంగా చిరంజీవితోనే వాదోపవాదాలు ఆడాడని తమ్ముడి గురించి నిజాలు చెప్పింది సుష్మిత…. తనకు కావాల్సినవి వచ్చేంతవరకు చరణ్ అస్సలు కాంప్రమైజ్ కాడని.. దానికోసం ఎంత కష్టపడినా కూడా ఔట్ పుట్ మాత్రం బాగా రావాలని ఆర్డర్స్ వేస్తాడని చెప్పింది…. కొన్ని విషయాలు చిరంజీవి చేయనని చెప్పినపుడు.. చరణ్ తన దగ్గరికి వచ్చి నాన్న ఈ పని ఎలాగైనా చేయాలి.. ఆయన్ని నువ్వే ఒప్పించు అని తనకు చాలా సార్లు ఆర్డర్ వేసాడని గుర్తు చేసుకుంది సుష్మిత…. మొత్తానికి తమ్ముడి గురించి చాలా విషయాలే చెప్పింది ఈమె. ఈ విష‌యాలు విని చ‌ర‌ణ్ అభిమానులు అందుకే ఆయ‌న మెగాస్టార్ కొడుకు అయ్యాడు అంటున్నారు.

Content above bottom navigation