రోజా చేసే పనులు అలాంటివి.. హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..

229

బుల్లితెర మీద ఇప్పుడు హవా నడిపిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకడు. జబర్దస్త్ షోతో భారీ పాపులారిటీ సంపాదించిన ఆది, ఇప్పుడు ఢీ షోతో పాటు సినిమాలలో కూడా కమిడియన్ గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. జడ్జ్ రోజాపై, యాంకర్ అనసూయపై ఎలాంటి పంచులైనా వేయాలంటే అది హైపర్ ఆదికే సాధ్యం అన్నట్లుగా ఉంటుంది ఆయన తీరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది.. రోజా చేసే పనుల గురించి ప్రస్తావిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

జబర్దస్త్ జడ్జ్‌ అనగానే ఠకీమని గుర్తుకొచ్చే పేర్లు రోజా, నాగబాబు. ఆ వేదికపై కమెడియన్స్ చేసే హంగామా కంటే.. జడ్జ్ సీట్లో కూర్చొని అంతకంటే ఎక్కువ హంగామా చేసేవారు ఈ ఇద్దరు స్టార్స్. అలాంటిది ఊహించని విధంగా ఆ ఇద్దరూ విడిపోయారు. అయినా కూడా రోజా ఒక్కరే జబర్దస్తీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రోజా గురించిన ప్రశ్నపై ఆసక్తికర సమాధానమిచ్చాడు హైపర్ ఆది. రోజా సంగతులన్నీ రెండు మూడు ముక్కల్లో చెప్పేసి.. అదే అందరూ ఒప్పుకోవాల్సిన నిజం అని అన్నాడు. దీంతో హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకపక్క పాలిటిక్స్ మరోపక్క టీవీ షోస్, ఇంకోపక్క గృహిణిగా బాధ్యతలు.. ఇవ్వన్నీ ఏకకాలంలో చేస్తూ సక్సెస్‌ ఫుల్‌ గా వెళ్తోందంటే, నిజంగా ఆమె గ్రేట్ అని చెప్పుకోవాలని హైపర్ ఆది అన్నాడు. పార్టీ ఫీలింగ్ లేకుండా సీరియస్‌ గా అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. ఆవిడ చేసే పనులను ఎవరైనా అప్రిసియేట్ చేయాల్సిందే అని హైపర్ ఆది చెప్పాడు.

ఇకపోతే మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? అని యాంకర్ అడిగిన ప్రశ్నను దాటేయబోయాడు హైపర్ ఆది. చివరకు తప్పని పరిస్థితుల్లో ఆ విషయం చెప్పేశాడు. తనకు అనుష్క అంటే చాలా ఇష్టమని, క్రష్ కూడా ఆమెపైనే తప్ప ఇంకెవరిపైనా లేదని చెప్పాడు. ఇక అదిరింది షో గురించి మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి సీనియర్ కమెడియన్లు ‘అదిరింది’ షోకు వెళ్లిపోయినా, జబర్దస్త్ రేటింగ్ మాత్రం పడిపోలేదని అంటున్నారు.. దీనిపై మీ స్పందనేంటి అని ఆదిని యాంకర్ అడిగారు. దానికి ఆది స్పందిస్తూ.. అంకెల గురించి వేరే వాళ్లను కంపేర్ చేస్తూ మనం మాట్లాడకూడదు. అలా ఎవరినీ నిరుత్సాహపరచకూడదు. అన్ని షోలు బాగుండాలనే కోరుకుంటాను. కాంపిటీషన్ ఎప్పుడూ నడుస్తుండాలని కోరుకుంటాను. అక్కడ కూడా మనకు కావాల్సిన వాళ్లు, తెలిసినవాళ్లు అందరూ ఉన్నారు’’ అంటూ నాగబాబు ప్రస్తావన తీసుకొచ్చారు ఆది.

Image result for హైపర్ ఆది

నాగబాబు గురించి కూడా మాట్లాడిన హైపర్ ఆది.. మా అందరికీ బాగా కావలసిన వ్యక్తి నాగబాబు గారు. ఆయన ఎక్కడున్నా కూడా మేమందరం బాగుండాలనే కోరుకుంటూ ఉంటారని, మెసేజ్‌ లు కూడా చేస్తుంటారని చెప్పాడు. నాగబాబుగారికి నేను ఎప్పటికీ దూరం కాదని ఆయన స్పష్టం చేశాడు.

Content above bottom navigation