వామ్మో.. యాంకర్ సుమ కొడుకు అంతున్నాడేంటి..

176

సుమ కనకాల..తెలుగు టెలివిజన్ రంగంలో మకుటం లేని మహరాణి. యాంకరింగ్ రంగంలో తనదైన శైలిలో ఎన్నో ఏళ్లుగా దూసుకుపోతుంది. అందుకే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరూ సుమని అభిమానిస్తారు. సుమ అంటే మాటల ప్రవాహం.. సుమ అంటే వెటకారం.. సుమ అంటే చమత్కారం. తెలుగు బుల్లితెరపై మకుటంలేని మహారాణిగా వెలుగొందుతోన్న ఈ సీనియర్ యాంకర్ ఇప్పుడు తన కొడుకుకు సంబందించిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టింది. దాంతో ఆ ఫోటో వైరల్ అయ్యింది. దానికి సంబంధించి పూర్తీ వివరాలోకి వెళ్తే..

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే సుమ అని ఠక్కున చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత రెండు దశాబ్దాలుగా టెలివిజన్, సినిమా రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. స్పాంటేనియస్ గా పంచ్ లు వేయడంలో సుమ తర్వాతే ఎవరైనా.. తన మాటలతో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవడంలో దిట్ట. తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్లో ఆమె తెలియని వారు లేరంటే అతిశయోక్తికాదు. తన వాక్ చాతుర్యం ,సమయస్ఫూర్తి కామెడీ టైమింగ్ తో ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. సినిమా ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా మాటలతో అదరగొట్టేస్తుంటారు. మనల్ని ఇంతలా అభిమానిస్తున్న కుటుంబం గురించి మనకు బాగానే తెలుసు. కానీ ఆమె పిల్లలు గురించి కాస్త తక్కువగానే తెలుసు అని చెప్పాలి.

రాజీవ్ కనకాలను సుమ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 1999 ఫిబ్రవరిలో రాజీవ్ కనకాల, సుమ వివాహం జరిగింది. పెళ్లి సమయానికి సుమ వయసు 24 సంవత్సరాలు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు రోషన్ కాగా.. కూతురు పేరు మనస్విని. రోషన్ ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో నటించాడు. అప్పటికి రోషన్ కాస్త చిన్న పిల్లాడు. కానీ, ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు. తాజాగా తన కొడుకుతో తీసుకున్న ఫొటోను సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా కనిపిస్తున్నాడు. ఆదివారం (మార్చి 15న) రోషన్ పుట్టినరోజు సందర్భంగా సుమ ఈ ఫొటోను సుమ షేర్ చేసినట్టు తెలిసింది. ‘‘నా ప్రియమైన రోషన్ పెద్దవాడయ్యాడు. దృఢంగా తయారయ్యాడు. లవ్ యు రా’’ అని సుమ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ ఫొటోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. రోషన్ చూడటానికి అచ్చం సుమలానే ఉన్నాడని అంటున్నారు. అంతేకాదు.. రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిజంగానే రోషన్ అచ్చం వాళ్లమ్మలానే ఉన్నాడు. కాకపోతే, బాగా పొడవుగా ఉన్నాడు.

Content above bottom navigation