విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల..యువకుడి అరెస్ట్

99

సినీ తారల పేర్లతో మోసాలకు పాల్పడటం తరచూ చూస్తూనే ఉంటాం. యాక్టర్లపై మోజుతో అమాయకులు ఆర్థికంగా, శారీరకంగా మోససోవడం జరుగుతూనే ఉంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ అని చెప్పి మోసానికి పాల్పడిన ఓ యువకుడు కటకటాలపాలయ్యాడు. ఇటీవల కాలంలో ఏ హీరోకి సాధ్యం కానంత ఫాలోయింగ్ సొంత చేసుకున్నారు విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన కొద్ది సినిమాలతోనే యూత్‌లో సుస్థిర స్థానాన్ని సాధించారు. అందుకే అమ్మాయిలను వలలో వేసుకునేందుకు ఓ సైబర్ నేరగాడు ఆయన పేరును తెగ వాడేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నయవంచకుడి ఆట కట్టించారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే….

విజయ్‌ దేవరకొండ పేరుతో కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌ లో పేజ్‌ క్రియేట్ అయింది. దీన్ని చూసిన అనేక మంది ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ లు పంపిస్తున్నారు. రిక్వెస్ట్‌ లు పంపిస్తున్న వారిలో అందమైన అమ్మాయిలను గుర్తిస్తున్న మోసగాడు వారితో నేరుగా ఛాటింగ్ చేస్తున్నాడు. కొద్దిరోజుల తర్వాత తనకు డబ్బింగ్‌ చెప్పే ఆర్టిస్టుతో చాటింగ్‌ చేయాలని, అన్ని వివరాలు పరిశీలించిన తాను నేరుగా చాటింగ్‌ చేస్తానంటూ విజయ్‌ దేవరకొండలా చెప్తున్నాడు. ఆ తర్వాత తన డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అంటూ ఓ ఫోన్‌ నంబర్‌ ఇచ్చి యువతులతో వాట్సాప్ ఛాటింగ్ చేస్తున్నాడు. కొద్దిరోజులకు వారితో ప్రేమ, పెళ్లి అంటూ మాయమాటలు చెప్పి సహజీవనం చేద్దామంటూ వేధిస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని ఇటీవల కొందరు సన్నిహితులు విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన తన అసిస్టెంట్ గోవింద్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి హేమ పేరుతో ఛాటింగ్ చేయించారు.

ఫ్రెండ్ రిక్వెస్ట్‌ ని ఓకే చేసిన సైబర్ నేరగాడు తాను విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ నంటూ మాయమాటలు చెప్పాడు. దీంతో విజయ్ తన మేనేజర్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరిపిన పోలీసులు ఆ సైబర్ నేరగాడ్ని పట్టుకున్నారు. ఈ విషయం మీద విజయ దేవరకొండ టీమ్ వెల్లడించిన ప్రకారం.. అమ్మాయిలను మోసగిస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్‌ను కనిపెట్టేందుకు మాటల్లోకి దించాం. అతనితో ఒక అమ్మాయిలా పరిచయం చేసుకుని రివర్స్ ట్రాప్ చేయడం మొదలుపెట్టాం. అతడి మాటలను మా తరఫు వ్యక్తి మాటలు నమ్మినట్టు నటించాడు. నిన్ను కలవాలి. వెంటనే హైదరాబాద్‌కు రమ్మని నాటకం ఆడాం. దాంతో అతడు నమ్మి మా వద్దకు వచ్చారు అని తెలిపారు. మేము ఆడిన నాటకాన్ని నమ్మిన యువకుడు వెంటనే హైదరాబాద్ బయల్దేరి వచ్చాడు.. అప్పటికే పోలీసులతో రెడీగా ఉన్న మా టీమ్ అతడిని పట్టుకుని స్టేషన్‌కు తరలించడం జరిగింది.

Image result for విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల

ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. విచారణలో బయటకు వచ్చిన భయంకరమైన వాస్తవాలు షాక్ గురిచేశాయి అని విజయ్ దేవరకొండ టీమ్ సభ్యులు అన్నారు. పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మరో ఇద్దరు హీరోలకు చెందిన మహిళా అభిమానులను మోసగించినట్టు బయటకు వచ్చింది. మరో పదిమందిని ఇలానే మోసం చేశానని నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులోనే ఉన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి అని విజయ్ దేవరకొండ సభ్యులు పేర్కొన్నారు. ఇక ముందు హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ అకౌంట్ల నుంచి మెసేజ్‌లు వచ్చినా ఎవరూ నమ్మొద్దు అని విజయ్ ఆఫీస్ టీమ్ తెలిపింది. చూశారుగా హీరో పేరు చెప్పి ఎలా మోసం చేశాడో. కాబట్టి అమ్మాయిలు సోషల్‌మీడియాలో మీకిష్టమైన హీరో పేజీ కనబడగానే ఫాలో అయిపోయి అవతలి వారు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మేయకండి.

Content above bottom navigation