శేఖర్ మాస్టర్ అనసూయతో చేస్తున్న రొమాన్స్ కు ఆయన భార్య ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు ..!

129

శేఖర్ మాస్టర్ గురించి సినీ ప్రేక్షకులకు సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. డాన్స్ మాస్టర్ గా అతి కొద్ది కాలంలోనే విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మెచ్చి ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 లో సాంగ్స్ కి ఛాన్స్ ఇచ్చారు. మెగాస్టార్ ఎంత నమ్మకంగా శేఖర్ మాస్టర్ కి ఛాన్స్ ఇచ్చారో, దాన్ని వందకి వంద శాతం నిలబెట్టుకున్నాడు. అద్బుతమైన కొరియోగ్రఫీని చిరు కోసం కంపోజ్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. 60 లో కూడా మెగా స్టార్ లో ఉన్న గ్రేస్ ని బయటకి తీసి వావ్ అనిపించాడు. అంతేకాదు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ప్రతీ పాట సూపర్ హిట్ అవడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. రాం చరణ్, ఎన్.టి.ఆర్, రామ్, వరుణ్ తేజ్ ..ఇలా ఎవరైనా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మూమెంట్స్ కంపోజ్ చేయడం శేఖర్ మాస్టర్ స్పెషాలిటి.

ఇక ఒకవైపు స్టార్ హీరోలకి సూపర్ హిట్స్ ఇస్తూనే బుల్లి తెరమీద బాగా సందడి చేస్తున్నారు. రియాలిటి షోస్ తో నిత్యం ప్రేక్షకులకి టచ్ లో ఉంటున్నాడు. మల్లెమాల ప్రొడక్షన్ లో వస్తున్న అతి పెద్ద రియాలిటి డాన్స్ షో ఢీ తో శేఖర్ మాస్టర్ ఇంకా బాగా ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఈ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందిని తీర్చి దిద్దుతున్నారు. అంతేకాదు ప్రియమణి, పూర్ణలతో చేసే హంగామా ఒక ఎత్తైతే టీమ్ లీడర్స్ సుధీర్, రష్మీ, ప్రదీప్ లతో చేసే హంగామా మరొక ఎత్తు. ఇక అప్పుడప్పుడు ప్రియమణి, రష్మీలతో చేసే డాన్స్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంది. అయితే ఈ మద్య ఈ విషయంలో శేఖర్ మాస్టర్ బాగా అతి చేస్తున్నట్టు కనిపిస్తుంది.

ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళు నిర్వహిస్తున్న ప్రోగ్రాం లో కూడా శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. అదే షో లో మరో జడ్జ్ గా ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ కూడా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే షో ఎంట్రీ సమయంలో శేఖర్ మాస్టర్ అనసూయతో కలిసి డాన్స్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గత కొన్ని వారాలుగా వీళ్ళ డాన్స్ మీద జనాలు కాస్త ఘాటుగా స్పందిస్తున్నారు. దానికి కారణం వీళ్ళు డాన్స్ కంటే రొమాన్స్ ఎక్కువగా చెయ్యడం. వీళ్ళ హాట్ డాన్స్ చూసినవాళ్లు అంత రొమాన్స్ చేయడం అవసరమా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏంటా వెకిలి చేస్ఠలు, హీరోలా మరీ అంతగా రెచ్చిపోయి చేయాలా ..అంటూ ట్రోల్ చేస్తున్నారట. ఇలా జనాలు కామెంట్స్ చేస్తుంటే, శేఖర్ మాస్టర్ భార్య ఏమనుకుంటుందో తెలుసా? జనాలు అందరు ట్రోల్ చేస్తుంటే, శేఖర్ మాస్టర్ భార్య మాత్రం ఆయన్నని చూసి బాగా సంబరపడుతుందట. మా ఆయన అచ్చం హీరోలా అనిపిస్తున్నాడని తెగ పొగిడేస్తుందట. వాస్తవంగా భర్త గురించి ఏవీ పట్టించుకోని శేఖర్ మాస్టర్ భార్య ఈ మధ్య ఆయన అనసూయతో కలిసి వేస్తున్న స్టెప్స్ అదిరిపోతున్నాయని సరదాగా కామెంట్ చేస్తుందట. ఈమె కామెంట్స్ కు కొందరు పాజిటివ్ గా రియాక్ట్ అయితే కొందరు మాత్రం నెగెటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

Content above bottom navigation