శ్రీముఖిని పెళ్లి దాక తీసుకుని వచ్చి దారుణంగా మోసం చేసిన వ్యక్తి.

126

శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులను పరిచయం అక్కర్లేని పేరు. యాంకర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. టీవీ యాంకర్లు సుమ, ఝాన్సీ, అనసూయ, రష్మి తర్వాత ఈ మధ్య కాలంలో తెలుగు టీవీ షోలలో అందం, హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంటున్నమరో యాంకర్ శ్రీముఖి. తన అందం, యాటిట్యూడ్, చలాకీతనాని…. తన హాట సెక్స్ అప్పీల్ జోడించి ఇటు బుల్లితెరపై, అటు వెండితెర అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోంది. అయితే శ్రీముఖి గురించి ఇప్పుడొక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ఆ వార్త వివరాల్లోకి వెళ్తే..

voice..

శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. సినిమాల్లో విజయశాంతి రాములమ్మ అయితే, బుల్లితెరపై శ్రీముఖి రాములమ్మ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. శ్రీముఖి పటాస్ షోతో తెలుగువారికి చాలా దగ్గరైంది. పటాస్ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలిచాయి. టీవీ స్క్రీన్ పై రవి, శ్రీముఖిలు చేసే కామెడీ గాని, వేసే పంచ్ లుగాని, షో కి మంచి రేటింగ్ ఇచ్చాయి. అంతేకాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా న‌టించిన శ్రీ‌ముఖి.. ఆ త‌ర్వాత కొన్ని తెలుగు, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌ తో యాంక‌ర్‌గా మొద‌లుపెట్టింది.. ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌ గా మారింది. అయితే శ్రీముఖి పై ఎప్పటి నుండో రూమర్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ‘ పటాస్’ షో నుండి శ్రీముఖి తప్పుకోవడంతో ఈ రూమర్స్ మరీ ఎక్కువయ్యాయి.

‘పటాస్’షో నుండి శ్రీముఖి తప్పుకుని బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన సత్తా చూపించి రన్నర్ గా మంచి పోటీని ఇచ్చింది.. తర్వాత సిల్వర్ స్క్రీన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పుడు కొన్ని షోలకు యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే, పటాస్ షో నుండి శ్రీముఖి తప్పుకోవడం వెనుకు తెరవెనుక చాలానే జరిగిందని వార్తలు వస్తున్నాయి. యాంకర్ రవితో శ్రీముఖి ఎఫైర్ నడిపిందని, ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచిందని చాలా పుకార్లు షికారు చేశాయి. తర్వాత రవితో జరిగిన గొడవలే పటాస్ షో వదిలేయడానికి కారణమనే ప్రచారం జరిగింది.

Image result for srimukhi

దానికి తోడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు, తనను ఒకరు మోసం చేసారని, పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. కానీ శ్రీముఖి ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది క్లారిటీ లేదు. ఇక బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ మాలో మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటూ ఓ కొత్త షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీముఖి.

Content above bottom navigation