శ్రీరెడ్డి పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరంటే?

101

శ్రీరెడ్డి.. ఆమె ఏం చేసినా సంచలనమే. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి గొంతెత్తిన శ్రీరె్డ్డి, చేసిన రచ్చ మాములు రచ్చకాదు. తెలుగు ఫిలిం నగర్ అసోసియేషన్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి అప్పట్లో బాగానే వార్తల్లో నిలిచింది. ఆమె అండతో ఎంతోమంది లేడి సినీ ఆర్టిస్టులు ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకున్నారు. అప్పట్లో ఆ ఉద్యమం తారాస్థాయికి చేరింది.

కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిస్థితుల వలన నీరుగారింది. ఇటీవల శ్రీరెడ్డి ఆచార్య టీజర్ గురించి కామెంట్స్ రచ్చకు దారితీశాయి. తర్వాత మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె చేసిన ట్వీట్ పలు సందేహాలకు దారితీస్తోంది. త్వరలో గుడ్ న్యూస్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆ తీపి కబురు ఏంటబ్బా అని.. నెటిజన్లు నోరెళ్లబెట్టి మరీ చూస్తున్నారు. తన పర్సనలా..? లేక మరెవరినైనా కెలుకుతారా అనే చర్చ జరుగుతోంది.

Content above bottom navigation