సప్తగిరి సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేవాడో తెలుసా?

తెలుగులో ఉన్న మంచి కమెడియన్స్ లలో సప్తగిరి ఒకడు.‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ప్రేమకథాచిత్రం సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తర్వాత ఈ తిరుపతి నటుడి దశ తిరిగింది. ఇతడి కామెడీ కల్ట్ హిట్ అయ్యింది. అదే ఊపులో కొన్ని పదుల సినిమాల్లో సప్తగిరిగి ఛాన్సులు దక్కాయి.ఆ తర్వాత సప్తగిరికి హీరో ఛాన్సులు కూడా వచ్చాయి. అయితే సప్తగిరి సినీ ఇండస్ట్రీలోకి రావడం వెనుక, అతని సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది. అసలు సప్తగిరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. అతను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు.. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం..

సప్తగిరి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. చిత్తూరు జిల్లా, పుంగనూరు కి చెందిన ఓ సామాన్య కుటుంబంలో రెండవ సంతానంగా జన్మించాడు. ఇతని తండ్రి అటవీ శాఖలో ఉద్యోగి. తల్లి గృహిణి. ఇంటర్ వరకు చదివాడు. అయితే ఎంసెట్ లో మంచి ర్యాంకు రానందున బిటెక్ చేసే ఛాన్స్ కోల్పోయాడు. ఇక సినిమాల్లోకి వెళ్లాలన్న కోరికతో తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఒక రోజు తిరుమల వెళ్ళాడు. దర్శనం అయ్యాక అక్కడ ఓ సాధువు రూపంలో కనిపించిన వ్యక్తి ఇతన్ని సప్తగిరి కొంచెం పక్కకు జరుగు అనడంతో ఈ పేరేదో బాగుందే అనుకుని తన పేరును సప్తగిరి అని మార్చుకున్నాడు. ఇక హైదరాబాదుకు వెళ్ళి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాలనుకున్నాడు. అక్కడ మల్టీమీడియా కోర్సు చేస్తానని ఇంట్లో చెబితే ఎలా వెళ్తావ్, ఎక్కడుంటావ్ అని పేరెంట్స్ అడిగారట. మొత్తానికి హైదరాబాదు చేరుకొని, తన మిత్రుని ఇంట ఉన్నాడు.

ఇంగ్లీషులో నాలెడ్జ్ పెంచుకుందామని ఎస్.ఆర్.నగర్ లోని ఓ శిక్షణా కేంద్రంలో చేరాడు. కానీ రెండు నెలలు గడిచాక అందులో లాభం లేకపోవడంతో వదిలేశాడు. సహాయ దర్శకుడిగా అవకాశం కోసం స్టూడియోల చుట్టూ ఆరునెలలు తిరిగాడు. అయితే రమేష్ వర్మ అనే పబ్లిసిటీ డిజైనర్ తన ఇంటి ముందే ఉండడంతో అక్కడికి దిల్ రాజు లాంటి సినిమావాళ్లు వచ్చేవారు. దీంతో ఒకరోజు రమేష్ వర్మ దగ్గరకు వెళ్లి తాను సహాయ దర్శకుడిగా చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. చాలా రోజులు తిరిగాడు. చివరకు రమేష్ వర్మ తరుణ్ తో ఒక ఊరిలో అనే సినిమా చేయాలనుకున్నాడు. ఆ సినిమా మూడు మాసాల తర్వాత ఆగిపోవడంతో రమేష్ వర్మ ఇతన్ని శేఖర్ సూరి దగ్గర చేరమన్నాడు. అతని దగ్గర చాలా రోజులు తిరిగాక చివరకు శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఎ ఫిల్మ్ బై అరవింద్ కోసం సహాయ దర్శకుడిగా చేరమన్నాడు.

Image result for సప్తగిరి సినిమా

ఈ సినిమాలో పనిచేయడం వల్ల సప్తగిరి సినిమాలోని అన్ని విభాగాల గురించి తెలుసుకుంటూ సినీ ప్రముఖులతో మరిన్ని పరిచయాలు పెంచుకున్నాడు. ఇక ఆ తరువాత భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమా నిర్మాత దిల్ రాజుకు అసిస్టెంట్ డైరెక్టర్స్ చేత చిన్న చిన్న వేషాలు వేయించడం ఆనవాయితీ. ఆ విధంగా బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో మొదటి సారిగా సప్తగిరి వెండి \తెరపై కనిపించాడు.ఇందులో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత భాస్కర్ దగ్గరే పరుగు సినిమాకు అసోసిసియేట్ డైరెక్టరుగా చేరాడు. బొమ్మరిల్లు సినిమాలో సప్తగిరి హావభావాల్ని పరిశీలించిన భాస్కర్ పరుగు మూవీలో కూడా ఓ పాత్ర ఇచ్చాడు. మొదట్లో నటించడం ఇష్టం లేకపోయినా ఛాన్స్ కోసం నటన, దర్శకత్వం రెండు పనులూ చేశాడు. తర్వాత స్నేహితుడు ఆనంద్ రంగా తీసిన ఓయ్ సినిమాలో కమెడియన్ గా ఆడియన్స్ ని మెప్పించడంతో ఛాన్స్ లు పెరిగాయి. దేశముదురు, సాధ్యం, కందిరీగ, దరువు, నిప్పు, మంత్ర, గబ్బర్‌ సింగ్‌ లాంటి సినిమాల్లో నటించాడు. దర్శకుడు మారుతి తీస్తున్న ప్రేమకథా చిత్రమ్ లో కూడా ఛాన్స్ ఇచ్చాడు. అందులో పాత్ర అతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఒక రోజు విమానంలో వస్తుండగా ఓ తమిళ సినిమా చూసి దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసుకుని అందులో హీరోగా నటిస్తే బాగుంటుందని అనుకుని స్నేహితులను సంప్రదించాడు. అలాగే తను వైద్యం కోసం వెళుతున్న హోమియో డాక్టర్ రవి కిరణ్ ఆ సినిమా నిర్మాతగా ఉండటానికి ముందుకు వచ్చాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే పేరుతో డిసెంబరు 2016 లో ఈ సినిమా విడుదలైంది. హీరోగా మొదటి సినిమా కావడంతో ఓ మోస్తరుగా ఆడింది . ఆ తర్వాత సప్తగిరి ఎల్ ఎల్ బి సినిమాలో చేయగా కొంతవరకే ఆడింది. లవర్స్, దృశ్యం, మనం, టెంపర్, దోచేయ్, పవర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, మజ్ను, రారండోయ్ వేడుక చూద్దాం, తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలలో కమిడియన్ గా నటిస్తున్నాడు. సప్తగిరి ఇంకా మరిన్ని చిత్రాలలో నటించి మన అందరికి అలరించాలని కోరుకుందాం.

Content above bottom navigation