సమంత నాగచైతన్య లవ్ స్టోరీ ..

116

అక్కినేని నాగచైతన్య – సమంత.. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్. ఈ ఇద్దరిది ప్రేమ పెళ్లి. వీళ్ళ ప్రేమాయణం ఆల్వేస్ హాట్ టాపిక్. అసలు ఆ ఇద్దరి మధ్య ప్రేమాయణం ఎప్పుడు మొదలైంది? ఎలా మొదలైంది? ఎన్నేళ్ల పాటు సాగింది? ఆ తర్వాత ముందుగా ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు? మొదటగా అంగీకరించినది ఎవరు? ఇలా రకరకాలుగా అభిమానుల్లో సందేహాలు ఉన్నాయి. అయితే సమంత చైతన్య ప్రేమకథ ఎప్పుడు మొదలైందో, ఎక్కడ మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.

సమంత నాగచైతన్య ఇద్దరు మొదటి కలుసుకుంది ఏ మాయ చేశావే సెట్ లో. గౌతమ్ మీనన్ చెప్పిన కథ నచ్చడంతో ఈ ఇద్దరు సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు. అలా ముహూర్తం రోజున ఈ ఇద్దరి మధ్య తొలి పరిచయం అయ్యింది. ఇక ఆ సినిమా టైమ్ లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. షూటింగ్ కోసం కేరళ, విదేశాలకు వెళ్లడంతో ఈ ఇద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగింది. అలాగే తెలుగులో సమంతకు అదే మొదటి సినిమా. అప్పటివరకు సమంతకు తెలుగు భాషతో సంబంధం లేదు. అందుకే ఆమెకు తెలుగు కూడా నేర్పించే పనిలో పడ్డాడు చైతన్య. అలా ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. ఇక ఈ సినిమా తర్వాత ఎవరి సినిమాలలో వాళ్ళు బిజీ అయిపోయారు. అయితే మళ్ళి ఈ ఇద్దరినీ కలిపింది ఆటో నగర్ సూర్య సినిమా. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 3
ఏళ్ళు నడిచింది. సమంత డేట్స్ దొరికితే నాగచైతన్య డేట్స్ దొరికేవి కాదు, చైతన్య డేట్స్ దొరికితే సమంత డేట్స్ కుదిరేవి కాదు. ఇలా దాదాపు 3 ఏళ్ళు ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. అదే సమయంలో ఫోన్స్ లలో ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఒకరికి ఒకరు చెప్పుకోలేని పరిస్థితి. చెప్తే ఎక్కడ రిజెక్ట్ అవుతుందో అనే భయం. అందుకే ఒకరికి ఒకరు చెప్పుకోలేదు. కానీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఫోన్స్ లలో మాట్లాడుకునేవారు. ఒకరి సినిమాల గురించి మరొకరు తెలుసుకునేవారు.

Image result for samantha naga chaitanya

ఇలాంటి సమయంలో వీరికి మనం సినిమా వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలుగా, లవర్స్ గా నటించాడు. పైగా అక్కినేని బ్యానర్. సొంత సినిమా కాబట్టి చైతన్యనే సమంతను తీసుకుందాం అని చెప్పాడంట. దాంతో చైతన్య సమంతను ప్రేమిస్తున్నాడని అందరికి అర్థం అయ్యింది. కానీ ఎవరు కూడా బయట పడలేదు. ఇక ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోనే చైతన్య దైర్యం చేసి ప్రపోజ్ చెయ్యడం, సమంత సంతోషంగా ఒప్పుకోవడం జరిగింది. అలా వీరి ప్రేమకథ మొదలైంది. అయితే ఈ విషయం ఇప్పుడే బయటపెట్టకూడదు అని ఇద్దరు కూడా చాలా సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. అందరికి డౌట్ వచ్చినా కూడా మేము ఫ్రెండ్స్ అనే చెప్పుకొచ్చారు. మీడియాలో రకరకాల వార్తలు వచ్చినా కూడా ఏనాడూ కూడా బయటపడలేదు. అయితే ఒకసారి సమంత నాగార్జున ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో ఉండే కుక్కపిల్ల సమంత దగ్గరకు వచ్చిందంట. అది చూసి నాగార్జున షాక్ అయ్యాడంట. అప్పుడు నాగార్జునకు కూడా అర్థం అయినా చైతన్యను అడగలేదు. సమయం వచ్చినప్పుడు చైతన్యనే చెప్తాడని నాగార్జున సైలెంట్ గా ఉండిపోయాడు. ఇలా చాలా రోజులు సీక్రెట్ గా మైంటైన్ చేసిన ఈ ప్రేమజంట ఎట్టకేలకు ఇంట్లో చెప్పడంతో, అందరు కూడా వీరి ప్రేమకు పచ్చజెండా ఊపారు. గోవాలో ఒక ప్రముఖ హోటల్ లో 2017 అక్టోబర్ 6న హిందూ సంప్రదాయ పద్ధతిలో, 7న క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అక్కినేని, దగ్గుబాటి రెండు కుటుంబాలు కూడా హాజరై అంగరంగ వైభవంగా ఈ పెళ్లిని చేశారు. నవంబర్ 17, 2017 న హైదరాబాద్ లో పెద్ద రిసెప్షన్ పెట్టి సినీ రాజకీయ ప్రముఖులను పిలిచి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ఇలా ఈ ప్రేమజంట పెళ్లితో ఒక్కరయ్యారు. ఇక పెళ్ళైన తర్వాత సమంత సినిమాలను తగ్గించలేదు. వరుసపెట్టి సినిమాలలో నటిస్తుంది. రంగస్థలం, యూ టర్న్, మహానటి, ఓ బేబీ, మజిలీ, జాను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస హిట్స్ కొట్టింది. ప్రస్తుతం ఒకవైపు సినిమా కెరీర్, మరోపక్క ఫామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉన్నారు. అక్కినేని వారసుడి కోసం అక్కినేని ఫామిలీ మొత్తం ఎదురుచూస్తుంది.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation