సింగర్ సునీత భర్త ఎవరో కాదు మనకు బాగా తెలిసిన వ్యక్తే.. ఎవరో తెలిస్తే షాక్

63

సింగర్ సునీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. తియ్యని గాత్రమే కాదు.. అందమైన రూపం ఆమె సొంతం. చాలు చాలు చాలు సరసాలు చాలు.. అని కొంటెపాటలు పాడినా.. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అంటూ ఎమోషనల్ సాంగ్స్ పాడినా సునీత గాత్రంలో ఉండే మాధుర్యం మిస్ కాదు. పాటలతో శ్రోతలను అలరించడమే కాకుండా డబ్బింగ్‌తో ఎంతో మంది హీరోయిన్‌లకు గాత్ర ధానం చేసి మెప్పించింది. ఠాగూర్ లో జ్యోతికకు, చూడాలని ఉందిలో సౌందర్యకి, జయంలో సదాకు, గోదావరిలో కమలినీ ముఖర్జీకి, హ్యాపీ డేస్ లో తమన్నాకు, కంత్రిలో హన్సికకు, సింహ, శ్రీరామ రాజ్యంలో నయనతారకు, శ్రీరామ దాసులో స్నేహ పాత్రకు డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా తన గానంతో ఫాన్స్ ని సంపాదించుకుంది. 3వేలకు పైనే పాటలు పాడిన ఈమెది కోకిల స్వరమే కాదు, మైమరపించే రూపం ఆమె సొంతం. అందుకే ఎక్కడికెళ్లినా సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. 500 మూవీస్ కి పైనే డబ్బింగ్ ఆర్టిస్టుగా చేసింది. టాప్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది ఈమె.

పైకి నవ్వుతు కనిపించే సునీత జీవితంలో చాలా విషాదం ఉంది. ఆమె వైవాహిక జీవితం అంత గొప్పగా ఏమి ఉండదు. సునీతకు చిన్న వయస్సులోనే అంటే 19ఏళ్ళప్రాయంలోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి పేరు ఆకాష్ ,అమ్మాయి పేరు శ్రేయ. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులతో సన్నిహితంగా మెలగాల్సి ఉండడం కామన్. అయితే భర్త కిరణ్ ఆమె పై అనుమానం పెంచుకుని, తరచూ వేధించడం వలన ఇక చేసేదిలేక పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని విడాకులు తీసుకుంది. కిరణ్ కుమార్ కూడా ఇండస్ట్రీ వ్యక్తే. సినిమా ఈవెంట్స్, సైమా లాంటి అవార్డ్ ఫంక్షన్ కి డైరెక్టర్ గా ఉంటున్నాడు. ఇద్దరూ విడిపోయి 10ఏళ్ళు అయింది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వీరిద్దరికీ తల్లి అంటే ఎంతప్రేమో, తండ్రి మీద ప్రేమ ఎక్కువే. ఇటీవల తండ్రితో దిగిన పిల్లలిద్దరి ఫొటోస్ వైరల్ అయ్యాయి.

Image result for సింగర్ సునీత భర్త

ఇక సునీత కూతురు శ్రేయ స్టడీస్ తో పాటు సంగీతంపై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య నటించిన సవ్యసాచి మూవీలో ఓ సాంగ్ పాడి అదరగొట్టేసింది. ఇక కొడుకు ఆకాష్ గ్రాడ్యుయేషన్ పూర్తీచేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. అయితే ఈ మధ్యనే సునీత రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. ఒక బిజినెస్ మ్యాన్ ను సునీత రెండో పెళ్లి చేసుకుంటుందని, అతను కూడా భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడని వార్తలు వచ్చాయి. కానీ వీటిని సునీత కొట్టిపారేసింది. ఈ వయసులో రెండవ పెళ్లి చేసుకోడానికి నేను సిద్ధంగా లేనని, అనవసరంగా పిచ్చి పిచ్చి వార్తలు రాయొద్దని తెలిపింది.

Content above bottom navigation