సుడిగాలి సుధీర్ షాకింగ్ నిర్ణయం.. తప్పు చేస్తున్నావంటూ హెచ్చరిక..

జబర్దస్త్ తో ఎంతో పేరు తెచ్చుకున్న వాళ్లలో సుడిగాలి సుదీర్ ఒకడు. ఒక మెజీషియన్ గా కెరీర్ మొదలు పెట్టి తరువాత జబర్దస్త్ కు వచ్చి మంచి కమిడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ జబర్దస్త్ లో మంచి పేరు సంపాదించటమే కాకుండా టివిలో అనేక షోస్ కి యాంకర్ గా పని చేస్తూ బయట ఈవెంట్స్ కి కూడా యాంకరింగ్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నాడు. సుడిగాలి సుదీర్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సుదీర్ ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నాడని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారట. ఇక సినిమాలు చేయనని, కేవలం జబర్దస్త్ చేస్తానని అన్నారట. ఈ విషయం ఆయన ఎక్కడ ఎప్పుడు చెప్పారో తెలీదు కానీ అలా చేస్తే కెరీర్ ఉండదు అంటూ హెచ్చరిస్తున్నారు సీనియర్ సినీ పరిశోధకులు ఇమంది రామారావు.

రామారావు గారు ఈ విషయం మీద మాట్లాడుతూ… సుడిగాలి సుధీర్ తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. అది కరెక్ట్ అనిపించడంలేదు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమాతో హీరో అనిపించుకున్న సుధీర్ ఆ తర్వాత తన జబర్దస్త్ ఫ్రెండ్స్‌తో కలిసి ‘3 మంకీస్’ సినిమా తీసాడు. కానీ తొలి సినిమా హిట్ అయింది. రెండో సినిమా ఫ్లాప్ అయింది. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ ఓ మాటన్నాడు. తనకు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం నచ్చదట. అదేంటి? హీరో అంటే ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయాలి. అసలు చేస్తోంది నటనే కదా. ఆ నటనలో రొమాన్స్ కూడా భాగమే. సుధీర్ అంటే అమ్మాయిల్ని సులువుగా పడేస్తాడు అని ఓ బ్రాండ్ ఉంది. అలాంటిది అతను హీరోయిన్స్‌ తో రొమాన్స్ చేయను అనడం నాకు నచ్చలేదు. అతను హీరో అవడానికి ఇండస్ట్రీలోకి వచ్చాడు. హీరో అని నిరూపించుకున్నాడు. అలాంటప్పుడు చక్కగా సినిమాలు చేసుకుంటూపోవాలి కానీ బుల్లితెరను వదలను అంటే ఎలా?

Image result for sudigali sudheer

సినీ ప్రపంచంలోకి రావాలని ఎందరో కలలు కంటుంటారు. ఆ అవకాశం సుధీర్‌ కి వస్తే నిలబెట్టుకోవాల్సిందపోయి పాడు చేసుకుంటున్నాడు. తాను కట్టుకున్న గుడిని తానే తన్నేసుకుంటున్నాడు. సినిమా వేరు, స్నేహితులు వేరు అని సుధీర్ తెలుసుకోవాలి. గెటప్ శీను, రామ్ ప్రసాద్, సుధీర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. కానీ సినిమా విషయంలో ఈ ఫ్రెండ్స్ ఫార్ములా పనికిరాదు అని ‘3 మంకీస్’ సినిమా నిరూపించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా మంచి ఫ్రెండ్స్. మరి రామ్ చరణ్ సినిమాలో ఎన్టీఆర్ కానీ మహేష్ కానీ ఎందుకు నటించలేదు. ఎందుకంటే అలా చేస్తే సినిమా ఆడుతుందని ఎవ్వరూ చెప్పలేరు. ఫ్రెండ్స్‌ తో సినిమాలు చేస్తే బ్లాక్ బస్టర్ అయిపోతాయి అనుకుంటే అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు స్నేహితులు కూడా సినిమాల్లోకి వచ్చేయాలి కదా. కాబట్టి సుధీర్ నా మాట విని చక్కగా సినిమాలు చేసుకుంటూ ఉండాలని ఓ సినీ పరిశోధకుడిగా సలహా ఇస్తున్నాను అని ఇమంది రామారావు గారు సుదీర్ కు సలహా ఇచ్చాడు. చూడాలి మరి సుదీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

Content above bottom navigation